వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్ ఊరిలో లోకేష్, వారసత్వం (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు రాజకీయ వారసత్వాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ సొంతం చేసుకున్నట్లు కనిపిస్తున్నారు. టిడిపిపై పట్టుకు నందమూరి, నారా కుటుంబాల మధ్య రేగిన చిచ్చు ఆరిపోయినట్లే కనిపిస్తోంది. నారావారి కుటుంబం నందమూరి కుటుంబంపై ఆధిపత్యం సాధించినట్లే.

టిడిపి ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ నియామకం జరగడంతోనే అది పూర్తయింది. తాజాగా, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిపే కార్యక్రమంలో భాగంగా చేపట్టిన మన నీరు - మన మట్టితో నారా లోకేష్ తాత ఎన్టీఆర్‌కు తానే వారసుడినని చాటుకున్నారు.

కృష్ణా జిల్లాలోని ఎన్టీ రామారావు స్వగ్రామం నిమ్మకూరులో నారా లోకేష్ మంగళవారం మన నీరు - మన మట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ ఇంటి సమీపంలోని మట్టిని ఆయన అమరావతి కోసం సేకరించారు. తద్వారా ఎన్టీఆర్ రాజకీయ వారసుడిని తానేనని చెప్పకనే చెప్పారు.

నారా లోకేష్ ఇలా..

నారా లోకేష్ ఇలా..

మన నీరు - మన మట్టి కార్యక్రమంలో భాగంగా నారా లోకేష్ ఇలా ఎన్టీఆర్ నివాసం వద్ద మట్టిని అమరావతి శంకుస్థాపన కోసం సేకరించారు.

నారా లోకేష్ ఇలా..

తన వారసుడు బాలయ్యేనని ఓసారి గతంలో ఎన్టీ రామారావు ప్రకటించినప్పుడు చంద్రబాబు అలక వహించారు. బాలయ్య కూతురు బ్రాహ్మణిని వివాహం చేసుకున్న నారా లోకేష్ ఎన్టీఆర్ వారసత్వాన్ని కూడా సొంతం చేసుకున్న సూచనలు కనిపిస్తున్నాయి.

జూనియర్ పక్కకు వెళ్లారు...

జూనియర్ పక్కకు వెళ్లారు...

తెలుగుదేశం పార్టీ వారసత్వాన్ని స్వీకరించాలని ప్రయత్నించి చంద్రబాబుతో విభేదించిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు సినిమాలకే పరిమితమయ్యారు.

హరికృష్ణ కూడా..

హరికృష్ణ కూడా..

నారా లోకేష్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలనే చంద్రబాబు ప్రయత్నంపై తీవ్రంగా విభేదించిన నందమూరి హరికృష్ణ కూడా రాజీ పడినట్లు కనిపిస్తున్నారు.

బాలయ్య ఎమ్మెల్యేగానే...

బాలయ్య ఎమ్మెల్యేగానే...

తన కూతురిని నారా లోకేష్‌కు ఇచ్చి చంద్రబాబుతో వియ్యమందుకున్న బాలకృష్ణ హిందూపురం శాసనసభ సభ్యుడిగానే ఉంటూ రాజకీయాల్లో కీలక మారడం లేదు.

నిమ్మకూరులో ఇలా..

నిమ్మకూరులో ఇలా..

ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో అడుగు పెట్టి, అమరావతి కోసం మట్టిని సేకరించి, సందడి చేసిన నారా లోకేష్ రాజకీయంగా చంద్రబాబు వారసుడిగా మారినట్లే.

నారా లోకేష్ అంతా...

నారా లోకేష్ అంతా...

చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీలో నారా లోకేషే ముఖ్య నాయకుడిగా మారారు. ఆయన అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నారు.

పార్టీ నాయకులూ ఆయన వెంటే...

పార్టీ నాయకులూ ఆయన వెంటే...

తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా నారా లోకేష్ వెంటనే నడుస్తున్నారు. ఆయనను చంద్రబాబుకు వారసుడిగానే చూస్తున్నారు.

ఇలా బొట్టు పెట్టించుకున్నారు...

ఇలా బొట్టు పెట్టించుకున్నారు...

ఎన్టీ రామరావు స్వగ్రామం నిమ్మకూరులో నారా లోకేష్ మహిళలతో ఇలా తిలకం దిద్దించుకుని తన నాయకత్వాన్ని చాటుకున్నారు.

హారతులూ పట్టారు...

హారతులూ పట్టారు...

ఎన్టీ రామారావు స్వగ్రామం నిమ్మకూరులో మన నీరు - మన మట్టి కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్‌కు మహిళలు హారతులు పట్టారు.

English summary
Nara Lokesh participated IN the Mana Neeru - Mana Matti Programme & collected the soil Near the house of late legend Sr NTR in Nimmakuru (Vi), Krishna district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X