వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నారా వారి బుల్లోడు ఇతనే: దేవాంశుతో బ్రాహ్మణి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నారావారి బుల్లోడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాడు. నారా బ్రాహ్మణి, నారా లోకేష్ దంపతుల అబ్బాయి నారా దేవాంశు ఫోటోలు ప్రస్తుతం సామాజిక వెబ్ సైట్లలో హల్ చల్ చేస్తున్నాయి. నారావారి కుటుంబంలోకి వచ్చిన కొత్త సభ్యుడు నారా దేవాంశును చేతబట్టుకుని బ్రాహ్మణి దిగిన ఫొటోలు ఫేస్‌బుక్‌లో దర్శనమిచ్చాయి.

ఉగాది రోజున బ్రాహ్మణి పండంటి మగబిడ్డకు జన్మ ఇవ్వడంతో నారా లోకేష్ తండ్రి అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాతయ్య అయ్యారు. నారా చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణలు మనవడు పుట్టాడనే ఆనందంలో ఉన్నారు.

Nara Lokesh's wife Bhrahmnai with Devanshu makes hot topic

అయితే అమరావతి నిర్మాణ శంకుస్థాపన, హిందూపురం అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు తీరిక లేకుండా గడుపుతున్నారు. తన మనవడిని చూడడానికి కూడా తనకు సమయం దొరకడం లేదని ఓ సందర్భంలో చంద్రబాబు బహిరంగ సభలో చెప్పారు.

ఈ ఏడాది తమ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను నారా లోకేష్ మీడియాకు వెల్లడించారు. వచ్చే ఏడాది తన కుమారుడు దేవాంశు ఆస్తుల వివరాలు కూడా వెల్లడిస్తానని ఆయన చెప్పారు. నారా లోకేష్ అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో బిజీగా ఉన్న సమయంలో బ్రాహ్మణి తన ముద్దుల కొడుకుతో దిగిన ఫొటోలు ఫేస్‌బుక్కులో సందడి చేస్తున్నాయి.

English summary
Photos of Devanshu, son ofTelugu Desam party general secretary Nara Lokesh and Brhmani are became talk of the social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X