హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎంసెట్ 2: తెరపైకి మరో పేరు ఇక్బాల్, కింగ్‌పిన్ ఇతడే

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎంసెట్ 2 పేపర్ లీకేజి వ్యవహారంలో ఇప్పటివరకు రాజగోపాల్ రెడ్డే కీలక నిందితుడని అధికారులు భావిస్తుండగా తాజాగా ఇక్బాల్ అనే మరో కొత్త పేరు బయటికొచ్చింది. ఇక్బాల్‌ది మామూలు చరిత్ర కాదని, దేశవ్యాప్తంగా పలు ప్రశ్నాపత్రాల లీకేజిలకు ఇతడే కింగ్‌పిన్ అని తేలింది.

తాజా ఎంసెట్ 2 పేపర్ లీకేజి కూడా ఇక్బాల్ కనుసన్నల్లోనే జరిగినట్టు సీఐడీ అధికారులు ఆధారాలు సేకరించారు. ఎంసెట్ 2 పేపల్ లీకేజి వ్యవహారం దేశవ్యాప్తంగా విస్తరించిందని విచారణలో తేలిందని అధికారులు చెప్తున్నారు. ప్రశ్నాపత్రాల ముద్రణ వ్యవహారాల్లో ఉండే కీలక ప్రింటింగ్ ప్రెస్‌లన్నింటిలో ఇక్బాల్ మనుషులు ఉన్నారని సీఐడీ అధికారులు గుర్తించారు.

ప్రస్తుతం అధికారుల అదుపులో ఉన్న రాజగోపాల్‌రెడ్డి, షేక్ రమేశ్ తదితరుల విచారణలో భాగంగా ఈ కేసుకు సంబంధించిన కొత్త విషయాలు వెలుగు చూసినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. ఈ లీకేజి ఢిల్లీకి చెందిన ఇక్బాల్ అనే వ్యక్తి నడుపుతున్నాడని, ఢిల్లీలోని ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఎంసెట్ 2 ప్రశ్నాపత్రాన్ని లీక్ చేయించింది కూడా ఇతడేనని చెప్పేందుకు బలమైన ఆధారాలను సీఐడీ సేకరించింది.

ప్రస్తుతం పరారీలో ఉన్న ఇక్బాల్ కోసం ఢిల్లీతోపాటు ముంబై, అసోంలలో మూడు బృందాలతో గాలింపు జరుపుతున్నామని సీఐడీ అధికారులు తెలిపారు. దాదాపు వంద కోట్ల రూపాయల ఈ కుంభకోణంలో 9 మంది బ్రోకర్లు ఉన్నారని వారు చెప్పారు. వీరి ద్వారా దాదాపు 145 మంది పరీక్షాపత్రం పొందారని గుర్తించారు.

గురువారం ఇద్దరు బ్రోకర్లు తిరుమల్, విష్ణులను అరెస్టు చేసిన సీఐడీ.. శుక్రవారం షేక్ రమేశ్ అనే మరో బ్రోకర్‌ను అరెస్టు చేసినట్టు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురూ తలా 15మంది చొప్పున విద్యార్థులతో పేపర్ లీక్ వ్యవహారంలో డీల్ కుదిర్చినట్టు సీఐడీ ఆధారాలతో సహా బయటపెట్టింది.

మరోవైపు ఏపీలోని కర్నూల్లో మరో ఇద్దరు బ్రోకర్లు వెంకటేశ్, తరుణ్‌రాజ్‌లను శుక్రవారం సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం అరెస్టయిన విష్ణు, తిరుమల్ 39మంది విద్యార్థులతో ఒప్పందం కుదుర్చుకొని ఒక్కొక్కరి వద్ద రూ.30లక్షల నుంచి రూ.40లక్షలు వసూలు చేశారు.

 ఎంసెట్ 2: తెరపైకి మరో పేరు ఇక్బాల్, కింగ్‌పిన్ ఇతడే

ఎంసెట్ 2: తెరపైకి మరో పేరు ఇక్బాల్, కింగ్‌పిన్ ఇతడే

ప్రకాశంజిల్లా కనిగిరి ప్రాంతానికి చెందిన షేక్ రమేశ్ 14మంది విద్యార్థులతో డీల్ చేసి, రూ.1.73కోట్లు వసూలు చేశాడని సీఐడీ నిర్థారించింది. ఇలా మొత్తం 9మంది బ్రోకర్లు దాదాపు వంద కోట్ల రూపాయలకుపైగా డీల్ చేశారని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. కొంతమంది విద్యార్థుల నుంచి టెన్త్ సర్టిఫికెట్లు, పోస్ట్‌డేటెడ్ చెక్కులను సైతం బ్రోకర్లు తీసుకున్నారని సీఐడీ అధికారులు చెప్పారు.

ఎంసెట్ 2: తెరపైకి మరో పేరు ఇక్బాల్, కింగ్‌పిన్ ఇతడే

ఎంసెట్ 2: తెరపైకి మరో పేరు ఇక్బాల్, కింగ్‌పిన్ ఇతడే


శుక్రవారం అదుపులోకి తీసుకున్న రమేశ్‌ను సీఐడీ జడ్జి ఎదుట ప్రవేశపెట్టగా.. ఆయన రమేశ్‌కు 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న ఇక్బాల్‌కు అనుచరుడిగా ఉన్న వ్యక్తికి రమేశ్ అప్పగించాడని తెలిపారు. లీక్ చేయించిన ప్రశ్నాపత్రాల నుంచి 320 ప్రశ్నలు ఇచ్చి ఈ నెల 7, 8 తేదీల్లో వారితో ప్రాక్టీస్ చేయించారు.

ఎంసెట్ 2: తెరపైకి మరో పేరు ఇక్బాల్, కింగ్‌పిన్ ఇతడే

ఎంసెట్ 2: తెరపైకి మరో పేరు ఇక్బాల్, కింగ్‌పిన్ ఇతడే


రాజగోపాల్‌ను విచారించిన కొద్దీ సీఐడీ అధికారులు కొత్త విషయాలను వెల్లడించారు. ఇప్పటికే ఎయిమ్స్, పబ్లిక్ సర్వీస్ కమిషన్, బీహార్ సర్వీస్ కమిషన్.. తదితర పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారాల్లో ఇక్బాల్‌పై ఆరోపణలున్నాయి. ఇతడికి దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ ఉందని సీఐడీ అనుమానిస్తోంది.

ఎంసెట్ 2: తెరపైకి మరో పేరు ఇక్బాల్, కింగ్‌పిన్ ఇతడేని

ఎంసెట్ 2: తెరపైకి మరో పేరు ఇక్బాల్, కింగ్‌పిన్ ఇతడేని

దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలు తాము నిర్వహించే పరీక్షలకు ప్రశ్నాపత్రాలను దేశంలో ఏయే ప్రింటింగ్ ప్రెస్‌లలో ప్రింట్ చేయిస్తాయో లాంటి వివరాలను తెలుసుకునే ఇక్బాల్.. ఆయా ప్రెస్‌లలో అప్పటికే తన తరఫున పనిచేసే వారితో పేపర్‌లను తెప్పిస్తుంటాడని సీఐడీ అనుమానిస్తోంది.

 ఎంసెట్ 2: తెరపైకి మరో పేరు ఇక్బాల్, కింగ్‌పిన్ ఇతడే

ఎంసెట్ 2: తెరపైకి మరో పేరు ఇక్బాల్, కింగ్‌పిన్ ఇతడే

2007నుంచి లీకేజీ వ్యవహారాలు నడిపిస్తున్న రాజగోపాల్‌రెడ్డి, ఇక్బాల్‌తో జత కలిశాడని సీఐడీ అధికారులు తెలిపారు. దీంతో పాటు ఇక్బాల్, రాజగోపాల్‌రెడ్డి మనుషులు అన్ని యూనివర్సిటీల్లోనూ ఉన్నారని, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ఆయా యూనివర్సిటీల్లో వారు పని చేస్తున్నారని సీఐడీ అనుమానిస్తోంది.

 ఎంసెట్ 2: తెరపైకి మరో పేరు ఇక్బాల్, కింగ్‌పిన్ ఇతడే

ఎంసెట్ 2: తెరపైకి మరో పేరు ఇక్బాల్, కింగ్‌పిన్ ఇతడే


ఈ కారణంగానే ఇక్బాల్, రాజగోపాల్‌రెడ్డి సులభంగా పేపర్లను లీక్ చేయగలుగుతున్నారని సీఐడీ అధికారులు అంటున్నారు. ఇప్పటివరకు సీఐడీ అధికారికంగా ముగ్గురు బ్రోకర్లను అరెస్ట్ చేసింది. మిగతా వారి కోసం దేశవ్యాప్తంగా వేట సాగిస్తోంది. ఈ ముగ్గురు బ్రోకర్లు, కీలక సూత్రధారి రాజగోపాల్‌రెడ్డిని విచారించగా పేపర్ అందుకున్న విద్యార్ధుల సంఖ్య 130కి చేరింది.

English summary
New name iqbal emerged in eamcet 2 paper leakage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X