వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్రాన్స్ టెర్రర్ దాడి.. ప్రతీకారమే: ఈఫిల్ టవర్‌పై ఐసిస్ కామెంట్

|
Google Oneindia TeluguNews

ఫ్రాన్స్: నైస్ నగరంలో ఉగ్రవాద దాడి అనంతరం ఐసిస్ మద్దతుదారులు సంబరాలు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్యారిస్‌లో గత ఏడాది నవంబర్ నెలలో ఉగ్రదాడి జరిగింది. ఎనిమిది నెలల తర్వాత గురువారం నాడు ఇప్పుడు మరోసారి దాడి జరిగింది.

నవంబర్ నెలలో జరిగిన దాడిలో 130 మంది మరణించగా, ఇప్పుడు 80 మంది మృతి చెందారు. నైస్ దాడి అనంతరం ఐసిస్ మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. అదే సమయంలో సామాజిక అనుసంధాన వేదికలోను ఐసిస్ ఉగ్రవాదులు ఓ సందేశాన్ని పంపించారు.

కాలిఫేట్‌లోని ప్రతి ఇంచ్ భూమిలో మేం సురక్షితంగా జీవించే వరకు ఫ్రాన్స్, యూరప్ దేశస్తులు సురక్షితంగా ఉండరు అని ఐసిస్ ట్విట్టర్లో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, ఇది ప్రతీకారం అని కూడా వారు పేర్కొన్నారని తెలుస్తోంది.

అబూ ఒమర్ శిషానిని హత్య చేసినందుకు ఇది ప్రతీకారమని, ఇది కేవలం ఆరంభమేనని కూడా పేర్కొన్నారు. తీవ్రవాద దాడుల నేపథ్యంలో ఈఫిల్ టవర్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. దీని పైనా ఐసిస్ పేర్కొంది. ఫ్రాన్స్‌ను ఐసిస్ జయించే వరకు టవర్ వద్ద ఇలాగే ఉండండి అని పేర్కొన్నారు.

భద్రతా దళాలు అప్రమత్తం

భద్రతా దళాలు అప్రమత్తం

ఫ్రాన్సులోని నీస్ నగరంలో ఉగ్రవాది ట్రక్కుతో దాడి చేసి 80 మందిని చంపేశాడు. అప్పటిదాకా కేరింతలతో కోలాహలంగా కనిపించిన బాస్టిల్ ఉత్సవాలు, భీకర దాడితో హాహాకారాలతో మారుమోగింది. పోలీసులు వెంటనే స్పందించారు.

 భద్రతా దళాలు అప్రమత్తం

భద్రతా దళాలు అప్రమత్తం

వారి స్పందనలో ఏమాత్రం ఆలస్యమైనా బాస్టిల్ ఉత్సవాల ప్రదేశం శవాల గుట్టగా మారేదే అంటున్నారు. ప్యారిస్ దాడి నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. ట్రక్కు జనాలను గుద్దుకుంటూ వెళ్తుంటే గుర్తించిన పోలీసులు ట్రక్కు పైన కాల్పులు జరిపారు.

 భద్రతా దళాలు అప్రమత్తం

భద్రతా దళాలు అప్రమత్తం

అతను ట్రక్ ఆపి రెస్టారెంటులో దాక్కుంటే పోలీసులు చుట్టుముట్టారు. అసలు.. రెస్టారెంటులోకి వెళ్లగానే బాంబులతో నిండిన ట్రక్కును పేల్చేందుకు ఉగ్రవాది ప్రణాళిక రచించుకున్నాడు. ఈ ప్రణాళికను అతడు అమలు చేసేలోగానే పోలీసులు స్పందించారని తెలుస్తోంది. బుల్లెట్ల వర్షానికి అతను చనిపోయాడు.

ప్రత్యక్ష సాక్షి

ప్రత్యక్ష సాక్షి

ఈ వేడుకలను కవర్ చేసేందుకు వెళ్లిన విలేకరి రాబర్ట్ హాలోవే తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు. పూర్తి గందరగోళ వాతావరణం ఇది అని, ఎంతో మందిని ట్రక్కు ఢీ కొట్టిందని, వారి వస్తువులు గాల్లో ఎగిరిపడ్డాయని, పలువురు గాల్లో పల్టీలు కొడుతూ కిందపడి తీవ్ర గాయాల పాలయ్యారని చెప్పాడు.

ప్రత్యక్ష సాక్షి

ప్రత్యక్ష సాక్షి

ఎగిరి పడుతున్న వస్తువుల నుంచి నా తలను కాపాడుకోవాల్సి వచ్చిందని, అత్యంత కిరాతక ఘటన ఇది అన్నారు. దూసుకొస్తున్న ట్రక్కును నేను దగ్గరగా చూశానని, అది తనకు 100 మీటర్ల దూరం వరకూ వచ్చిందని, కొన్ని సెకన్ల వ్యవధిలో తన ప్రాణాలు దక్కించుకున్నానని చెప్పారు.

ప్రత్యక్ష సాక్షి

ప్రత్యక్ష సాక్షి

ఆ తర్వాత ట్రక్కు చుట్టూ పోలీసు వాహనాలు కనిపించాయని, ఈ ఘటనతో అక్కడున్న ప్రతి ఒక్కరి ఆనందం ఆవిరి అయిందని చెప్పారు.

English summary
The attack at NICE, France took place despite the country being under a state of emergency. The President of France had only said a few hours before the attack that the state of emergency put in place after the attacks at Paris last November would not be extended beyond July 26.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X