• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కెసిఆర్ తేల్చేశారు: బాబుకు జగన్ పార్టీ ఎమ్మెల్యేల కష్టాలు

By Pratap
|

విజయవాడ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై చెలరేగుతున్న ఊహాగానాలకు దాదాపుగా తెరపడినట్లే. అసెంబ్లీ సీట్ల పెంపునకు కేంద్రం సుముఖంగా లేదని తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పారు. ఆయన ప్రకటనను ఆషామాషీగా తీసుకోవడానికి ఏమీ లేదు.

ఢిల్లీ పెద్దలతో చర్చల తర్వాతనే చేశారు కాబట్టి ఆయన ప్రకటనకు విశ్వసనీయత కలుగుతోంది. అసెంబ్లీ సీట్ల పెంపు లేకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్కువ కష్టాల్లో పడనున్నారు. కెసిఆర్‌కు అంతగా తిప్పలు ఉండవు.

సీట్ల పెంపు లేకపోతే జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి వచ్చిన శాసనసభ్యులతో చంద్రబాబుకు చిక్కులు తప్పకపోవచ్చు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక సమయంలో ఆయన తీవ్రమైన కష్టాలను చవి చూడాల్సి వస్తుంది.

అయోమయం, గందరగోళం...

అయోమయం, గందరగోళం...

చంద్రబాబు ఆశలు దాదాపుగా ఆవిరి అయినట్లే. తెలుగుదేశం పార్టీలోని కొత్త-పాత నేతల్లో అయోమయం, తమ రాజకీయ భవితవ్యంపై గందరగోళం ప్రారంభమైందిప్రధానంగా వైయస్సార్ కాంగ్రెసు నుంచి వచ్చిన 20 మంది ఎమ్మెల్యేలతోపాటు, కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆనం బ్రదర్స్ వంటి సీనియర్లకు వచ్చే ఎన్నికల్లో సీట్లు కేటాయిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వారికి ఇచ్చే సీట్లను కూడా చెప్పారు. ఇప్పట్లో నియోజకవర్గాల సంఖ్య పెరగదని తేలిపోవడంతో వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేల్లో ఆందోళన ప్రారంభమైంది.

  Chandrababu Fixed YS Jagan And Pawan Kalyan For 2019 Polls
  వైరం కొనసాగుతూనే ఉంది...

  వైరం కొనసాగుతూనే ఉంది...

  వెసిపికి చెందిన ఎమ్మెల్యేలు చేరేనాటికే నియోజకవర్గ ఇన్చార్జులుగా ఉన్న టిడిపి సీనియర్లతో ఇంకా వైరం కొనసాగుతూనే ఉంది. వైసీపీ నుంచి చేరిన వారితో కలసి సమన్వయంతో పనిచేసుకోవాలని చంద్రబాబు ఎన్నిసార్లు ఆదేశించినా వారు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఆ వైరం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఇది చంద్రబాబుకు కరవమంటే కప్పకు కోపం, వద్దంటే పాముకు కోపం అన్న రీతిలో తయారయ్యే ప్రమాదం ఉంది.

  అవి ఫలిస్తాయా...

  అవి ఫలిస్తాయా...

  కరణం బలరాం, పోతుల సునీత (ప్రకాశం), రామసుబ్బారెడ్డి (కడప) వంటి నేతలకు ఎమ్మెల్సీ పదవులు, కెఇ ప్రభాకర్‌కు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి సర్దుబాటు చేసినా ఫలితం ఉండకపోవచ్చునని అంటున్నారు. ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత కూడా వైసీపీ నుంచి చేరిన గొట్టిపాటి రవికుమార్‌తో కరణం బలరామ్, జమ్మలమడుగులో వైసీపీ నుంచి చేరిన మంత్రి ఆదినారాయణరెడ్డితో రామసుబ్బారెడ్డికి ఇంకా వైరం కొనసాగుతూనే ఉంది.

  వారికి ఇలా హామీ...

  వారికి ఇలా హామీ...

  వచ్చే ఎన్నికల్లో సీట్లు పెరుగుతున్నందున కొత్తగా ఏర్పడే నియోజకవర్గాల సీట్లు ఇస్తామి కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్, రామసుబ్బారెడ్డి వంటి నేతలకు చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేల చేరిక వల్ల నష్టపోయిన మాజీ ఎమ్మెల్యేలు అన్నే రాంబాబు, దివి శివరాంకూ అలాంటి హామీలే ఇచ్చారు. అలా అవకాశం కల్పించే అవకాశం లేకపోవడంతో పార్టీలో చేరిన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే స్థానాలపై ఆశలు పెట్టుకున్న పార్టీ సీనియర్లకు ఎక్కడ స్థానం కల్పించాలో చంద్రబాబు చిక్కుల్లో పడే అవకాశం ఉంది.

  జగన్ చెప్పినా వినలేదు...

  జగన్ చెప్పినా వినలేదు...

  వైసిపి అధ్యక్షుడు వైయస్ జగన్ చెప్పినా వినకుండా పార్టీ మారిన కొందరు ఎమ్మెల్యేల్లో అప్పుడే అంతర్మథనం ప్రారంభమైంది.. సీట్ల సంఖ్య పెరుగుతుందని, మీ సీట్లకు భరోసా ఇస్తున్నామని చెప్తే టిడిపిలో చేరామని, ఇప్పుడు చూస్తే ఆ పరిస్థితి లేదని అంటున్నారు. దానికి తోడు వైసిపి పుంజుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు.కేసులుంటే ఏమైతాయి, టిడిపిలోకి వెళ్లకూడదని, తనను కూడా జైలుకే పంపారని జగన్ చెప్పినా వినకలేదని, ఇప్పుడు పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైందని అంటున్నారు.

  చంద్రబాబు అనుసరించిన వైఖరే...

  చంద్రబాబు అనుసరించిన వైఖరే...

  సీట్ల సంఖ్య పెరుగుతుందనే ధీమాతో చంద్రబాబు వ్యవహరించడం వల్లే పరిస్థితి ఇంతదాకా వచ్చిందని టిడిపి సీనియర్లు అంటున్నారు. పునర్విభజన జరగకపోతే వచ్చే ఎన్నికల్లో గెలవలేమన్నట్లు పార్టీ నాయకత్వం వ్యవహరించిందని, ఇప్పుడు సీట్ల పెంపు లేదని తెలిసిన తర్వాత తలపట్టుకుందని అంటున్నారు. సీట్ల కోసం వచ్చిన వారెవరూ పార్టీలో ఉండరని, వైసీపీలో చోటు లేని వారు గత్యంతరం లేక కొనసాగుతారని అంటున్నారు. కానీ పరిస్థితి అలా ఉండకపోవచ్చునని, అది టిడిపికి ఎదురు దెబ్బ కొట్టే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

  వ్యూహం తిరగబడింది...

  వ్యూహం తిరగబడింది...

  చంద్రబాబు సొంత పార్టీని బలోపేతం చేసుకునే దిశగా పనిచేయకుండా, ఉన్న పార్టీ నేతలను విశ్వసించి బలం పెంచుకునే మార్గం చూసుకోకుండా జగన్‌ను బలహీనపరిచి ప్రయోజనం పొందాలనే ఆలోచన చేయడం సమస్యకు ప్రధాన కారణమంటున్నారు. అయితే, పార్టీలోకి కొత్తగా వచ్చినవారు, పార్టీలో మొదటి నుంచి వచ్చినవారు టిడిపిలో కలిసిపోయే అవకాశం లేదని అంటున్నారు.

  వెంకయ్య నాయుడిని చూసుకుని....

  వెంకయ్య నాయుడిని చూసుకుని....

  వెంకయ్య నాయుడిని చూసుకుని సీట్ల సంఖ్య పెరుగుతుందనే గట్టి విశ్వాసం ఉండడం వల్లనే చంద్రబాబు జగన్‌ను దెబ్బ తీసేందుకు ఫిరాయింపులను ప్రోత్సహించారని అంటున్నారు. అయితే, బిజెపి అగ్ర నాయకత్వం మరో విధంగా ఆలోచించినట్లు కనిపిస్తోంది. వెంకయ్య నాయుడిని ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ఎంపిక చేసి చంద్రబాబు ఆశలను వమ్ము చేసింది. దానికితోడు, జగన్‌కు బిజెపి దగ్గర కావాలని చూస్తున్నట్లు అర్థమవుతోంది. ఇది చంద్రబాబుకు పూడ్చుకోలేని నష్టాన్ని కలిగించినట్లేనని భావిస్తున్నారు.

  English summary
  According tolitical analysts - Andhra Pradesh CM and Telugu Desam prty chief Nara Chandrababu Naidu may face trouble in coing elecions.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
  X