బాధపడ్డ ఐపీఎస్, 27మంది హంతకురాళ్లతో ఇంద్రాణి
ముంబై: షీనా బోరా హత్య కేసును విచారిస్తున్న మాజీ ముంబై పోలీసు కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి రాకేష్ మారియా తన బదలీ పైన స్పందించారు. అయితే రాజీనామా చేసే ఆలోచన లేదని ఆయన చెప్పారు. బదలీ ఆయనను బాధించిందని చెబుతున్నారు.
తన బదలీ విషయంలో తాను రాజీనామా చేస్తున్నానని వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. షీనా హత్య కేసును విచారిస్తున్న ఆయనను మహారాష్ట్ర ప్రభుత్వం ఉన్నపళంగా బదలీ చేసి డిజిపి (హోంగార్డ్స్)గా పదోన్నతి ఇచ్చింది.

ఆయన స్థానంలో డిజిపి ర్యాంక్ అధికారి అహ్మద్ జావెద్ ముంబై నూత పోలీసు కమిషనర్ అయ్యారు. అయితే, ఈ నియామకం వెనుక రాజకీయ ప్రమేయం ఉందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. షీనా హత్య కేసు దర్యాఫ్తును పక్కదారి పట్టించేందుకేనని విమర్శలు వచ్చాయి. దీంతో, ప్రభుత్వం కూడా ఈ కేసు దర్యాఫ్తును రాకేష్ మారియానే పర్యవేక్షిస్తారని ప్రకటించింది.
అయితే బదలీ పైన తీవ్ర ఆందోళనతో ఉన్న రాకేష్ మారియా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని వార్తలు వచ్చాయి. దీనిని ఆయన ఖండించారు.
ఇంద్రాణికి నిద్రపట్టలేదు!
షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఆమె తల్లి ఇంద్రాణికి జైలులో మొదటి రోజు నిద్ర పట్టలేదంట. 27 మంది మహిళా హంతకురాళ్లు ఉన్న బ్యారెక్‌లో ఆమెను ఉంచారు. ఆ గదిలో ఒక ఫ్యాన్ ఉంది. కప్పుకునేందుకు దుప్పటి ఒకటి ఇచ్చారు.












Click it and Unblock the Notifications