వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ధోనీ రిటైరయితే తెలిసొస్తుంది, కోహ్లీ వస్తే ఏమౌతుందో చెప్పలేం'

|
Google Oneindia TeluguNews

ముంబై: భారత జట్టుకు అన్ని ఫార్మాట్లకు ఇప్పుడే విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా చేయడం సరికాదని, భారత క్రికెట్ స్థాయిని పెంచిన ధోనీనే మరింతకాలం కొనసాగించాలని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డీన్ జోన్స్ అభిప్రాయపడ్డాడు. ఓ గొప్ప ఆటగాడిని వైదొలగాలని తొందర పెట్టడం సరికాదన్నారు.

ధోనీ రిటైర్ అయ్యాక ఆ లోటును ఎవరూ పూడ్చలేదని, అప్పుడు తెలిసి వస్తుందని అభిప్రాయపడ్డాడు. ఎంతకాలం ఆడాలన్న నిర్ణయాన్ని ధోనీకే వదిలి వేయడం మంచిదని చెప్పాడు. కోహ్లీ అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ కావడానికి మరింత సమయం కావాలన్నాడు.

kohlidhoni

తన దృష్టిలో ప్రస్తుతం ప్రపంచ అత్యుత్తమ బ్యాట్సుమెన్ కోహ్లీనే అని చెప్పాడు. విరాట్ తన జీవితంలోనే మంచి దశలో ఉన్నాడని చెప్పాడు. కోహ్లీ ఆట చూస్తే తనకు ఆనందమేస్తుందన్నాడు. ప్రత్యేకత సంపాదించుకున్నాడని చెప్పాడు. అతను బ్యాటింగుకు వస్తుంటే ఏం జరుగుతుందో ఊహించలేమన్నాడు.

అంత ప్రశాంతంగా కనిపిస్తాడని, మ్యాచులు ఎలా ముగించాలో అతనికి బాగా తెలుసునని చెప్పాడు. ఇంతకుముందు ఏబీ డివిల్లీయర్స్ అత్యుత్తమ ఆటగాడు అని అనుకునేవాడినని, స్వల్ప కాలంలోనే కోహ్లీ అతనిని గత ఏడాది దాటేశాడని చెప్పాడు.

English summary
Indian limited overs skipper Mahendra Singh Dhoni may be a shadow of his old self but former Australian batsman Dean Jones feels that the Jharkhand dasher will be “missed more in sub-continental conditions” once he calls time on his illustrious career.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X