హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విపక్షాలకు 8 సీట్లే: కేసీఆర్ సర్వేలో టీఆర్ఎస్ వైపే ప్రజలు, ఒవైసీతో మాట్లాడతా

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 'ఇప్పుడే వచ్చిన సర్వే ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అన్ని ప్రతిపక్ష పార్టీలకు కలిపి ఏడెనిమిది శాసనసభ స్థానాలు మాత్రమే వస్తాయి.
ప్రజలంతా మావైపే ఉన్నారు. వారి నాడి తెలుసుకునేందుకు సర్వే చేశాం. పాతబస్తీలో మా ప్రాబల్యం పెరిగింది. స్వల్ప ఆధిక్యతతో ఎంఐఎం తన ఏడు స్థానాలను నిలబెట్టుకుంటుంది. మజ్లిస్‌ పార్టీ బలంగా ఉన్నా, అక్కడ కూడా మజ్లిస్, టీఆర్‌ఎస్‌ల మధ్య 48:38 నిష్పత్తిలో ఓట్లు పోలవుతాయి' అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

దసరా సందర్భంగా మంగళవారం సిద్దిపేట జిల్లాలోని తన వ్యవసాయక్షేత్రంలో ఎంపిక చేసిన కొందరు ముస్లిం, క్రైస్తవ సామాజికవర్గ టీఆర్‌ఎస్‌ నేతలు, అధికారులు, విలేకరులకు ముఖ్యమంత్రి విందు ఇచ్చారు. దాదాపు 4 గంటల పాటు వివిధ జిల్లాల మైనారిటీ నేతలతో పార్టీ స్థితిగతులను చర్చించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్, ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో కలసి సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వ పాలన పట్ల రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఇందుకు తాజాగా చేయించిన ఓ సర్వే వివరాలను వెల్లడించారు.

Opposition will secures 7- 8 seats only says cm kcr

హిందూ, ముస్లిం ఐక్యతకు ప్రతీకగా ప్రసిద్ధిగాంచిన తెలంగాణ గంగా జమున తెహజీబ్‌ను పునరుద్ధరించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మంచి స్పందన లభిస్తోందని చెప్పారు. తెలంగాణలో గత సంస్కృతి సంప్రదాయాల సువాసన పరిమళాలు మళ్లీ వెల్లువిరుస్తాయన్నారు. రాష్ట్రంలో అశాంతిని సహించబోమని, శాంతి భద్రతల విషయంలో రాజీపడబోమని స్పష్టం చేశారు.

వంద శాతం ప్రజలు సంతోషంగా ఉన్నట్లు ఈ సర్వేలో వెల్లడైందన్నారు. చిన్న జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రమంతా ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారని.. వీధుల్లోకి వచ్చి ర్యాలీలు నిర్వహించారని కేసీఆర్‌ పేర్కొన్నారు. తానేషాహీ (పెత్తందారీతనం) నిర్మూలన కోసమే చిన్న జిల్లాలను ఏర్పాటు చేశామన్నారు.

అరవై ఏళ్లు ఉమ్మడి ఏపీ పాలన సాగిందని, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లవుతున్నా దళితులు, మైనారిటీలు ఎక్కడివారు అక్కడే ఎందుకు ఉండిపోయారని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యానికి సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే చిన్న జిల్లాలు ఏర్పాటు చేశామన్నారు.

ప్రతి కుటుంబానికి చెందిన సమగ్ర సమాచారం జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రి కంప్యూటర్‌లో ఉంటాయని చెప్పారు. ఇక సమగ్ర కుటుంబ సర్వే ద్వారా జిల్లాల్లో సేకరించిన సమాచారం అత్యంత వాస్తవికతను కలిగి ఉందని, సంక్షేమ పథకాల అమలకు ఆ సమాచారాన్ని వినియోగించుకుంటామన్నారు.

కాగా, 2018-19లో ఖాళీ అవుతున్న రాజ్యసభ సీటును ముస్లింలకు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రానున్న 3-4 ఏళ్లలో మైనారిటీ గురుకులాలను 500కు చేర్చుతామని, వచ్చే విద్యా సంవత్సరంలో 90 గురుకులాలు ప్రారంభిస్తామని చెప్పారు. రేస్‌ కోర్సు, చంచల్‌గూడ జైలును తరలించి అక్కడ విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తామన్నారు.

ముస్లింల సమస్యలపై నెలకోసారి సమీక్ష జరుపుతామని, రెండు, మూడు వారాల్లో హజ్‌, మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, మైనారిటీ కమిషన్లకు పాలకమండళ్లను నియమిస్తామన్నారు. అన్ని పాలకమండళ్లలో 2-3 డైరెక్టర్‌ పోస్టులను మైనారిటీలకు ఇస్తామన్నారు. మైనారిటీ సంక్షేమ బడ్జెట్‌ ను రూ.1200 కోట్ల నుంచి రూ.1500 కోట్లకు పెంచుతామన్నారు.

'మజ్లిస్‌ ఫ్రెండ్లీ పార్టీ. ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీతో మాట్లాడతాం. పాతబస్తీలో మాకు పనిచేయడానికి అవకాశం ఇవ్వాలని కోరుతాం'.. అని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాగానే సర్కారుని అస్థిపరచడానికి కుట్ర జరగ్గా మజ్లిస్‌ అండగా నిలిచిందన్నారు. 'ఆ పార్టీ ప్రజలతో కలిసి ఉండటం వల్లే విజయం సాధిస్తోంది. ఇతర పార్టీలన్నీ ఎన్నికల ముందే పాతబస్తీకి వెళ్తాయి. మజ్లిస్‌ ప్రజలతోనే ఉంటుంది. అదే ఒరవడిని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కొనసాగించాలి' అని సీఎం సూచించారు.

English summary
Telanaga CM Kcr says now election is happened opposition will secures 7- 8 seats only at his farm house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X