హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీలో వర్షంలో యువతీ యువకుల డ్యాన్స్(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి వినాయక నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరక్కుండా ముందస్తుగా నగర పోలీసుల రచించిన వ్యూహం ఫలించింది. ఉత్సవాలు శాంతియుతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తొలి వినాయక చవితి కావడంతో రాష్ట్ర పోలీసులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

అందుకు తగ్గట్లుగానే 30 వేల మంది పోలీసులను రంగంలోకి దించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 800 నిఘా నేత్రాల సహాయంతో క్షణక్షణం ఉత్సవాలను పర్యవేక్షించారు. ముఖ్యంగా పాత నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. చార్మినార్, అలియాబాద్, శాలిబండ, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు.

అలాగే అతి సున్నిత, సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక పికెట్ల ద్వారా పరిస్థితులను అదుపు తప్పకుండా భద్రతాపరంగా అన్ని ఏర్పాట్లు చేశారు. హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి, డిజిపి అనురాగ్ శర్మ స్వయంగా రంగంలోకి దిగి బందోబస్తును పర్యవేక్షించారు. హోంమంత్రి, డిజిపిలు చార్మినార్ వద్దకు చేరుకుని భద్రతా చర్యలు, బందోబస్తును పరిశీలించారు. ఈ సందర్భంగా హోం మంత్రి నాయిని మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న తొలి నిమజ్జన యాత్రను ప్రశాంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశామన్నారు.

 వినాయక నిమజ్జనం

వినాయక నిమజ్జనం

డప్పు దరువులు, బ్యాండ్ మేళాలు, నృత్యాలు, ఆకట్టుకునే వేషధారణలు.. ఏ చోట విన్నా జై భోలోగణేష్ మహారాజ్ కీ.. గణపతి బప్పా మోరియా అన్న భక్తిపూర్వ నినాదాల మధ్య హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జనం స్వల్ప సంఘటనల మినహా ప్రశాంతంగా జరిగింది. ఎల్పీ నగర్‌లో డ్యాన్స్ చేస్తున్న యువతీ యువకులు.

 వినాయక నిమజ్జనం

వినాయక నిమజ్జనం

గణపతి బప్పా మోరియా నినాదాలతో వినాయక్‌సాగర్ పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి. పదిరోజుల పాటు భక్తుల నుంచి ఘనంగా పూజలందుకున్న ఆది దేవుడి నిమజ్జనం సోమవారం ఆద్యంతం భక్తిశ్రద్ధలతో ఘనంగా, నేత్ర పర్వంగా జరిగింది. ఎల్పీ నగర్‌లో డ్యాన్స్ చేస్తున్న యువతీ యువకులు.

 వినాయక నిమజ్జనం

వినాయక నిమజ్జనం

పాతబస్తీలోని పలు ప్రాంతాలు, బేగంబజార్, ఎంజె మార్కెట్ ఇతరాత్ర ప్రాంతాల్లో వినాయక నిమజ్జన ఊరేగింపుల విషయంలో పోలీసులు, మండప నిర్వాహకుల మధ్య వాగ్వాదనలు చోటుచేసుకున్నాయి.

 వినాయక నిమజ్జనం

వినాయక నిమజ్జనం

పోలీసుల వ్యూహం ఫలించి అనుకున్న సమయంలోనే బాలాపూర్ భారీ గణపయ్యను నిమజ్జనం కోసం వినాయక్‌సాగర్ వైపు తరలిరాగా, ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి కాస్త ఆలస్యంగా కదిలాడు.

 వినాయక నిమజ్జనం

వినాయక నిమజ్జనం

భారీ గణపయ్యకు ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, కలశ పూజలు నిర్వహించిన తర్వాత రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో నిమజ్జనానికి మళ్లించారు.

 వినాయక నిమజ్జనం

వినాయక నిమజ్జనం

పదహారు క్రేన్లను ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ మార్గ్‌లో , అలాగే 25 క్రేన్లను ఏర్పాటు చేసిన అప్పర్ ట్యాంక్‌బండ్‌పై ఉదయం ఆరు గంటల నుంచి మందకోడిగా సాగిన నిమజ్జనం క్రమంగా మధ్యాహ్నం తర్వాత పుంజుకుంది.

 వినాయక నిమజ్జనం

వినాయక నిమజ్జనం

రెండు నుంచి అయిదు అడుగుల లోపు ఎత్తు కలిగిన విగ్రహాల నిమజ్జనం తొంభై శాతం సాయంత్రం ఆరు గంటల వరకు పూర్తయింది.

 వినాయక నిమజ్జనం

వినాయక నిమజ్జనం

ఆరడుగులపై చిలుకు విగ్రహాల నిమిజ్జనం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతం నుంచి ప్రారంభమైంది. ఒకటిన్నర గంటల సమయంలో నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి క్రేన్ల వద్ద భద్రత నిమిత్తం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు.

 వినాయక నిమజ్జనం

వినాయక నిమజ్జనం

గతంలో జరిగిన వినాయక నిమజ్జనోత్సవాలతో పోలిస్తే ఈసారి నిమజ్జనానికి జనం ఎక్కువగా తరలివచ్చారు. ఉదయం నుంచి వర్షం లేకపోవటంతో భారీగా జనం ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు.

 వినాయక నిమజ్జనం

వినాయక నిమజ్జనం

సాయంత్రం ఆరు గంటల కల్లా ఎన్టీఆర్ మార్గ్‌లో సుమారు వెయ్యి విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.

 వినాయక నిమజ్జనం

వినాయక నిమజ్జనం

బల్దియా కమిషనర్ సోమేశ్ కుమార్ సోమవారం ఉదయం ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నతాధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.

 వినాయక నిమజ్జనం

వినాయక నిమజ్జనం

రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, డిజిపి అనురాగ్ శర్మ, నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డిలు వేర్వేరుగా పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో శాంతిభద్రతలను పరిశీలించారు.

 వినాయక నిమజ్జనం

వినాయక నిమజ్జనం

నగర పోలీసు కమిషనర్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న నిమజ్జనాన్ని ఎప్పటికపుడు పర్యవేక్షిస్తూ సిబ్బందికి తగిన సూచనలు సలహాలిచ్చారు.

 వినాయక నిమజ్జనం

వినాయక నిమజ్జనం

రెండు అడుగుల నుంచి అయిదు అడుగుల ఎత్తు కలిగిన విగ్రహాలు వేల సంఖ్యలో మధ్యాహ్నానికల్లా నిమజ్జనమయ్యాయి. భారీ గణపయ్య నిమజ్జనాలన్నీ కూడా సాయంత్రం అయిదు గంటలకు నిమజ్జనానికి వచ్చాయి.

 వినాయక నిమజ్జనం

వినాయక నిమజ్జనం

పాతబస్తీ నుంచి ఎంజె మార్కెట్, ఆబిడ్స్, బషీర్‌బాగ్ నుంచి లిబర్టీ మీదుగా వెళ్లే గణనాథులను అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు మళ్లించగా, భారీ ఎత్తు కల్గిన విగ్రహాలను సచివాలయం మీదుగా ఏక్బాల్ మినార్ నుంచి యూ టర్న్ తీసుకుని సచివాలయం, లుంబినీపార్కు మీదుగా క్రేన్ల వైపు తరలించారు.

 వినాయక నిమజ్జనం

వినాయక నిమజ్జనం

నిమజ్జనానికి వచ్చే దారిలో పోలీసుల బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేసినా, మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా సాధారణ ట్రాఫిక్‌ను ఎన్టీఆర్ మార్గ్ వరకు అనుమతించారు.

 వినాయక నిమజ్జనం

వినాయక నిమజ్జనం

దారి మళ్లించి ఆర్టీసి బస్సుల రాకపోకలను కొనసాగిస్తామని ఆ శాఖ చెప్పినా, మధ్యాహ్నం తర్వాత బస్సుల రాకపోకలు స్తంభించాయి.

 వినాయక నిమజ్జనం

వినాయక నిమజ్జనం

గణనాధులకు స్వాగతం పలికేందుకు దారులకు ఇరువైపులా ఆయా స్వచ్చంధ, వ్యాపార, సేవా సంస్థలు స్వాగత వేదికలను ఏర్పాటు చేసి ఫలహారాలు, మంచినీటిని సరఫరా చేశాయి.

 వినాయక నిమజ్జనం

వినాయక నిమజ్జనం

నిమజ్జనంలో వివిధ వేషధారణలు ఆహూతుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. జలమండలి ఆధ్వర్యంలో ఆయా ప్రాంతాల్లో మొత్తం లక్షల వాటర్ ప్యాకేట్లను భక్తులకు అందుబాటులో ఉంచారు.

 వినాయక నిమజ్జనం

వినాయక నిమజ్జనం

ఎన్నడూ లేని రీతిలో ఉత్సవ నిర్వాహకులు ఈసారి డిజెను వాడకపోవటంతో నిమజ్జన ఊరేగింపులు పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం భక్తి నినాదాల మధ్య ఘనంగా జరిగాయి.

 వినాయక నిమజ్జనం

వినాయక నిమజ్జనం

డప్పు వాయిద్యాలు.. తీన్‌మార్ పాటలు.. యవకుల నృత్యాలు.. చిన్నారుల కేరింతలు.. భక్తుల ఆటపాటల మద్య గణేష్ నిమజ్జనం సోమవారం ప్రశాంతంగా సాగింది.

 వినాయక నిమజ్జనం

వినాయక నిమజ్జనం

ఆనందోత్సవాల మద్య ప్రజలు నిమజ్జనోత్సవం ఆనందగా కన్నుల పండగగా జరిగింది. సికింద్రాబాద్ ప్రాంతంలోని పలు ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున గణనాథులు వినాయకసాగర్‌కు కోలాహాలంగా తరలివెళ్లాయి.

 వినాయక నిమజ్జనం

వినాయక నిమజ్జనం

ముందుగా గణేష్ మండపాల ప్రాంగణంలో ఉట్లను కొట్టిన తర్వాత భారీ వాహనంలో గణనాథులను ఏర్పాటు చేసుకుని వివిధ ప్రాంతాల గుండా హుస్సేన్‌సాగర్‌కు తరలివెళ్లారు.

 వినాయక నిమజ్జనం

వినాయక నిమజ్జనం

వినాయకులను సాగర్‌లో నిమజ్జనం చేశారు. నిమజ్జనం కార్యక్రమంలో సికింద్రాబాద్ ప్రాంతాలోని పలు బస్థీలు, కాలనీలు, ప్రధాన రహాదారుల్లో ప్రజలతో సందడి కనిపించింది.

వినాయక నిమజ్జనం

వినాయక నిమజ్జనం

వినాయకుల ఉరేగింపుల వద్ద యువకుల నృత్యాలు, తీనుమార్ డ్యాన్స్‌లు, విచిత్ర వేషాదారణలు, వివిధ రకాల వాయిద్యా పరికరాల హోరులో ప్రజలు చిందేశారు.

 వినాయక నిమజ్జనం

వినాయక నిమజ్జనం

ముఖ్యంగా వినాయకుల కోసం ఏర్పాటు చేసిన భారీ వాహనాలకు రంగు రంగుల పువ్వులతో, విద్యుత్ దీపాల అలంకారణలో వినాయకులను శోభయా మానంగా తరలించారు.

 వినాయక నిమజ్జనం

వినాయక నిమజ్జనం

రహాదారుల్లో నిమజ్జనం విక్షేంచేందుకు ప్రజలు రావడంతో తాకిడి విపరీతంగా పెరిగింది. ఈసారి గతంలో కంటే ఎక్కువమంది గణనాథులను చూసేందుకు తరలి వచ్చారు.

 వినాయక నిమజ్జనం

వినాయక నిమజ్జనం

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి వినాయక నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరక్కుండా ముందస్తుగా నగర పోలీసుల రచించిన వ్యూహం ఫలించింది. ఉత్సవాలు శాంతియుతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

 వినాయక నిమజ్జనం

వినాయక నిమజ్జనం

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తొలి వినాయక చవితి కావడంతో తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

 వినాయక నిమజ్జనం

వినాయక నిమజ్జనం

అందుకు తగ్గట్లుగానే 30 వేల మంది పోలీసులను రంగంలోకి దించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 800 నిఘా నేత్రాల సహాయంతో క్షణక్షణం ఉత్సవాలను పర్యవేక్షించారు.

 వినాయక నిమజ్జనం

వినాయక నిమజ్జనం

ముఖ్యంగా పాత నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. చార్మినార్, అలియాబాద్, శాలిబండ, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు.

English summary
Photos of Ganesh Immersion in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X