వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్బరుద్దీన్‌కు ఇలా నోటీసు అందించారు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీకి మహారాష్ట్ర పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులను థానే పోలీసులు స్వయంగా ఆయనకు సోమవారం అందించారు. మహారాష్ట్రకు రావొద్దని ఆ రాష్ట్ర పోలీసులు సూచించారు.

ఈ నెల 23వ తేదీన మహారాష్ట్రలోనే థానేలో జరగనున్న ఓ బహిరంగ సభకు అక్బరుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అయితే, ఆ బహిరంగ సభకు హాజరు కాకుండానే థానే కమిషనర్ సోమవారం నోటీసులు పంపించారు.

ఔరంగాబాద్, దౌలతాబాద్, ముంబై, ఉత్తర ప్రదేశ్‌లలో పర్యటిస్తానని చెప్పారు. ఎవరైనా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కొంటామని చెప్పారు. తానే పోలీసు కమిషనర్ నోటీసు పైన తాము మహారాష్ట్ర న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు చెప్పారు.

అక్బరుద్దీన్‌కు నోటీసులు

అక్బరుద్దీన్‌కు నోటీసులు

థానేలో ప్రస్తుతం పరిస్థితులు బాగాలేవని, అందువల్ల సభకు రావొద్దని మహారాష్ట్ర పోలీసులు అక్బరుద్దీన్‌కు పంపిన నోటీసులో తెలిపారు.

అక్బరుద్దీన్‌ను నోటీసులు

అక్బరుద్దీన్‌ను నోటీసులు

ధానేలో జరిగే బహిరంగ సభకు ఈ నెల 23వ తేదీన రావద్దని పోలీసులు అక్బరుద్దీన్ ఓవైసీకి నోటీసును ఇలా అందించారు.

అక్బరుద్దీన్‌కు నోటీసులు

అక్బరుద్దీన్‌కు నోటీసులు

తాను ప్రజాప్రతినిధిగా దేశంలో ఎక్కడికైనా వెళ్తానని మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ సోమవారం చెప్పారు.

అక్బరుద్దీన్‌కు నోటీసులు

అక్బరుద్దీన్‌కు నోటీసులు

థానే పోలీసు కమిషనర్ ఇచ్చిన సీఆర్‌పీసీ సెక్షన్ 144 నోటీసును తీసుకున్న అక్బరుద్దీన్ తిరిగి సమాధానమిచ్చారు. తన థానే పర్యటన ఆగదని చెప్పారు.

అక్బరుద్దీన్‌కు నోటీసులు

అక్బరుద్దీన్‌కు నోటీసులు

ప్రజాప్రతినిధిగా తాను దేశంలోని ఏ ప్రాంతానికైనా స్వేచ్ఛగా వెళ్లే హక్కు ఉందని చెప్పారు. తమ పార్టీ విస్తరణను అడ్డుకునేందుకే ఈ నోటీసు జారీ చేశారని ఆయన అన్నారు.

అక్బరుద్దీన్‌కు నోటీసులు

అక్బరుద్దీన్‌కు నోటీసులు

మహారాష్ట్రలో బలోపేతం అవుతున్న మజ్లిస్ పార్టీని అడ్డుకునేందుకు, రాజకీయ దురుద్దేశ్యంతో తన పర్యటనను అడ్డుకునేందుకు ఈ నోటీసు ఇచ్చారని అక్బరుద్దీన్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తన పర్యటన ఆగదన్నారు.

అక్బరుద్దీన్ ఓవైసీకి నోటీసులు

అక్బరుద్దీన్ ఓవైసీకి నోటీసులు

నోటీసులు అందుకున్న అక్బరుద్దీన్ ఓవైసీ తన నివాసం వద్ద సోమవారం ఇలా కనిపించారు. ఆయన థానే వెళ్తానని చెబుతున్నారు.

English summary
he Thane police commissionerate on Monday barred Majlis-e-Ittehadul Muslimeen (MIM) legislator Akbaruddin Owaisi from entering Mumbra till July 31, fearing that his visit could create law and order problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X