వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జబర్దస్త్: కమెడియన్ల చేత కన్నీరు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జబర్దస్త్ కామెడీ షో బయట కూడా దుమారం రేపుతోంది. గౌడ విద్యార్థి సంఘం కార్యకర్తలు టీవీ ఆర్టిస్టు వేణుపై దాడి చేయడంతో జబర్దస్త్ టీమ్ వీధికెక్కింది. సోమవారంనాడు హైదరాబాదులో ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో ప్రముఖ సినీ నటుడు నాగబాబు కూడా పాల్గొన్నారు. తెలుగు ప్రజలను నవ్వించేందుకు ఎంతో కష్టపడుతున్న కమెడియన్లపై దాడి చేసి వారితో కంటతడి పెట్టించడం సంప్రదాయం కాదని నటుడు, జబర్దస్త్‌ జడ్జి నాగబాబు ఆందోళన వ్యక్తం చేశారు.

జబర్దస్త్‌ సభ్యుడు వేణుపై, గౌడసంఘం నేతలు ఆదివారం దాడిచేసిన విషయం తెలిసిందే. వేణుపై జరిగిన దాడికి నిరసనగా సినీ, టీవీ ఆర్టిస్టులు సోమవారం ఫిల్మ్‌ చాంబర్‌ నుంచి జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జబర్దస్త్‌ టీంతో పాటు ఇతర ఆర్టిస్టులు పాల్గొని తమ నిరసన తెలియజేశారు.

ప్రజలను నవ్వించడమే తమ ధ్యేయమని, వ్యక్తిగతంగా ఎవరినీ తాము విమర్శించబోమని, వేణుపై జరిగిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా నాగబాబు చెప్పారు. ఎవరైనా బాధపడి ఉంటే, క్షమాపణలు కోరేందుకు తమకు ఎలాంటి అభ్యతరం లేదని, ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే, చట్టప్రకారం ముందుకెళ్లాలని ఆయన అన్నారు.

భయపడేది లేదు

భయపడేది లేదు

అంతేకాని ఇలా దాడులు చేయడం సంప్రదాయం కాదని, ఇలాంటి దాడులకు భయపడబోమని, లక్షదాడులు జరిగినా జబర్దస్త్‌ ఆగిపోదని నాగబాబు హెచ్చరించారు.

ధన్‌రాజ్ ఆవేదన

ధన్‌రాజ్ ఆవేదన



ఎప్పుడూ ప్రజలను నవ్వించడానికే ప్రయత్నిస్తాం, ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదని, కామెడీని కామెడీగానే చూడాలని, అంతే కానీ కమెడియన్లపై దాడులు చేయకూడదని కమెడియన్‌ ధన్‌రాజ్‌ తెలిపారు.

వేణుపై దాడిని ఖండిస్తున్నాం..

వేణుపై దాడిని ఖండిస్తున్నాం..

వేణుపై జరిగిన దాడిని కమెడియన్స్‌ అందరూ ఖండిస్తున్నామని, తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని ధన్‌రాజ్‌ చెప్పారు. ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

తలసాని శ్రీనివాస్ యాదవ్ మద్దతు

తలసాని శ్రీనివాస్ యాదవ్ మద్దతు

వేణుపై దాడిని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఖండించారు. వినోదాన్ని వినోదంగానే చూడాలని ఆయన హితవు చెప్పారు. ఆస్పత్రిలో వేణును ఆయన పరామర్శించారు.

వారి వాదన మరో విధంగా..

వారి వాదన మరో విధంగా..

గౌడ కులస్తులను కించపరచేలా వేణు స్కిట్స్‌ చేస్తున్నాడని, ఇంతకుముందు కూడా ఇలాగే చేశారని, అప్పుడు వేణుని కలిస్తే మళ్లీ ఇలాంటి తప్పు చేయమని హామీ ఇచ్చి ఇప్పుడు మళ్లీ అదే తప్పును పునరావృతం చేస్తున్నారని గౌడసంఘం నేత రామారావుగౌడ్‌ అన్నారు.

బెదిరించారు కూడా..

బెదిరించారు కూడా..

ఫిల్మ్‌చాంబర్‌ వద్ద తమను బెదిరించారని, వేణుపై పోలీసులకు ఫిర్యాదు చేశామని రామారావు గౌడ్ చెప్పారు. జబర్దస్త్ షోపై గౌడ విద్యార్థి సంఘం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

English summary
Jabardasth TV show team took out rally protesting against attack on Venu. Nagababu said that the TV show will not be stopped.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X