వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమైక్యం రెండు: జగన్ అటు, వీరు ఇటు (ఫొటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నేపథ్యంలో సమైక్యాంధ్ర కోసం సాగుతున్న పోరాటం రెండు పాయలుగా సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఢిల్లీలో సోమవారం జరిగిన రెండు ధర్నాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా జరిగింది. మరోవైపు అశోక్ బాబు నేతృత్వంలోని ఎపిఎన్జీవోల ఆధ్వర్యంలో రామ్ లీలా మైదానంలో ర్యాలీ జరిగింది.

రామ్ లీలా మైదానంలో జరిగిన ధర్నాలో సీమాంధ్రకు చెందిన తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ ధర్నాలో ఎపిఎన్జీవోలు తమ గళాలు వినిపించారు. సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. సమైక్యాంధ్ర ప్లకార్లులు, బ్యానర్లు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెసు తిరుగుబాటు పార్లమెంటు సభ్యుడు లగపాటి రాజగోపాల్ పాల్గొన్నారు.

రామ్ లీలా మైదానంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో సీమాంధ్రకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు దేవినేని ఉమామహేశ్వర రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర విభజనను ఆపాలంటూ వారు డిమాండ్ చేశారు.

సేవ్ ఆంధ్రప్రదేశ్

సేవ్ ఆంధ్రప్రదేశ్

రామ్ లీలా మైదానంలో జరిగిన ర్యాలీలో ఉద్యోగులు సేవ్ ఆంధ్రప్రదేశ్ ప్లకార్డులను ప్రదర్శిస్తూ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోటెత్తారు.

రామ్ లీలా మైదానంలో ఇలా..

రామ్ లీలా మైదానంలో ఇలా..

ఎపిఎన్జీవోల ఆధ్వర్యంలో రామ్ లీలా మైదానంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో పచ్చని వస్త్రాలను మెడ చుట్టూ వేసుకుని ఇలా దర్శనమిచ్చారు.

సమైక్యాంధ్ర కోసం...

సమైక్యాంధ్ర కోసం...

సమైక్యాంధ్ర కోసం రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రామ్ లీలా మైదానం సీమాంధ్రులతో ఇలా నిండిపోయింది

బూర్గుల, పొట్టి శ్రీరాములు, తెలుగుతల్లి

బూర్గుల, పొట్టి శ్రీరాములు, తెలుగుతల్లి

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రామ్ లీలా మైదానంలో పొట్టి శ్రీరాములు, బూర్గుల రామకృష్ణారావు, తెలుగుతల్లి చిత్రాలతో పోస్టర్‌ను ఏర్పాటు చేశారు.

చేతులెత్తారు...

చేతులెత్తారు...

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నాయకులు రామ్ లీలా మైదానంలో ఇలా చేతులు ఎత్తి తమ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు.

అశోక్ బాబు ఇలా..

అశోక్ బాబు ఇలా..

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఎపిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి. అశోక్ బాబు తన ప్రసంగాన్ని సాగించారు.

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా..

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా..

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రామ్ లీలా మైదానంలో సోమవారం సీమాంధ్ర ప్రజలు ఇలా సేవ్ ఆంధ్రప్రదేశ్ ప్లకార్డులను ప్రదర్శించారు.

నిలిచిన వనిత...

నిలిచిన వనిత...

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఎపిఎన్జీవోల సంఘం బ్యానర్‌తో ఓ మహిళ ఇలా నిలిచారు. ఆమె చుట్టూ ఇలా టోపీలతో మహిళలు..

పార్లమెంటు వద్ద నిరసన

పార్లమెంటు వద్ద నిరసన

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు సోమవారం పార్లమెంటు ఆవరణలో ఇలా నిరసన తెలిపారు.

పార్లమెంటు వద్ద టిడిపి సీమాంధ్ర ఎంపీలు..

పార్లమెంటు వద్ద టిడిపి సీమాంధ్ర ఎంపీలు..

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు ఇలా నిరసన వ్యక్తం చేశారు.

English summary
Delhi has witnessed two separate dharnas, one at Janthar Manthar by YSR Congress party president YS Jagan and another at Ramleela maidan by Ashok babu lead AP NGOs'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X