హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముత్తూట్ లో దోపిడికి ప్రయత్నించింది వారేనా, అందుకే హ్యాపీ హోమ్ అపార్ట్ మెంట్లో సోదాలు?

హ్యాపీ హోమ్స్ లో నివసిస్తున్న వారికి ఆరు గంటలుగా సంతోషం దూరమైంది. ఎప్పుడు ఏం జరుగుతోందోననే ఆందోళన అపార్ట్ వాసుల్లో నెలకంది.అయితే ఈ అపార్ట్ మెంట్ లో అక్టోపస్, గ్రేహౌండ్స్ బలగాలు సుమారు 6 గంటలపాటు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హ్యాపీ హోమ్స్ లో నివసిస్తున్న వారికి ఆరు గంటలుగా సంతోషం దూరమైంది. ఎప్పుడు ఏం జరుగుతోందోననే ఆందోళన అపార్ట్ వాసుల్లో నెలకంది.అయితే ఈ అపార్ట్ మెంట్ లో అక్టోపస్, గ్రేహౌండ్స్ బలగాలు సుమారు 6 గంటలపాటు సెర్చింగ్ నిర్వహించాయి. నిందితుల కోసం పోలీసులు వేటను సాగిస్తున్నారు.

హైద్రాబాద్ శివార్ లోని మైలార్ దేవ్ పల్లిలోని ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో మంగళవారం నాడు దోపిడికి నలుగురు వ్యక్తులు ప్రయత్నించారు.అయితే బ్యాంకు సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడంతో దొంగలు పారిపోయారు.

అయితే దోపిడికి యత్నించిన నలుగురు వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సిసి టివి కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా పోలీసులు వారిని గుర్తించేపనిలో పడ్డారు.మరోవైపు నిందితులు ఉపయోగించిన టవేరా వాహనం ఉప్పర్ పల్లి శివారులో గుర్తించారు. అయితే ఈ అపార్ట్ మెంట్ లో దొంగలు ఉన్నారే అనుమానంతో పోలీసులు దాదాపుగా ఆరు గంటలు అపార్ట్ మెంట్ లో సోదాలు నిర్వహించారు.

అపార్ట్ మెంట్ లో పోలీసులు భారీగా ఆయుధాలతో సోదాలు నిర్వహించడంతో అపార్ట్ మెంట్ వాసులు ఆందోళన చెందారు. అయితే నిందితులను పట్టుకొనేందకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

వాహనాన్ని గుర్తించారిలా

వాహనాన్ని గుర్తించారిలా

ముత్తూట్ ఫైనాన్స్ లో దోపిడికి విఫలయత్నం చేసిన దుండగులు సాధ్యం కాకపోవడంతో పారిపోయారు.అయితే అదే వాహనంలో పారిపోతే దొరికిపోతామనే ఉద్దేశ్యంతో ఉప్పర్ పల్లి సమీపంలోని 184 పిల్లర్ నంబర్ వద్ద ఉన్న హ్యాపీ హోమ్స్ అపార్ట్ మెంట్స్ ప్రాంతంలో నిలిపారు. వాహనానికి వెనుక ఉన్న నెంబర్ ప్లేట్ ను పగులగొట్టారు. అయితే వాహనం నెంబర్ ప్లేట్ ను ధ్వంసం చేస్తుంటే అనుమానం వచ్చిన సెక్యూరిటీ గార్డు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొన్నారు. అపార్ట్ మెంట్ లోనే నిందితులు ఉన్నారనే అనుమానంతో పోలీసులు సోదాలు నిర్వహించారు.

8 నిమిషాల్లో వాహనం వద్దకు చేరుకొన్న పోలీసులు

8 నిమిషాల్లో వాహనం వద్దకు చేరుకొన్న పోలీసులు

హ్యాపీహోం అపార్ట్ మెంట్ వద్ద నిందితులు వాహనం నెంబర్ ప్లేట్ ను పగుల గొడుతున్నారనే సమాచారం తెలుసుకొన్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొన్నారు. సెక్యూరిటీ గార్డు ఫోన్ చేసిన 8 నిమిషాల్లోనే పోలీసులు అక్కడికి వచ్చారు. అయితే ముత్తూట్ ఫైనాన్స్ లో చోరికి ప్రయత్నించిన దుండగులు ఉపయోగించిన వాహనం ఇదేనని గుర్తించారు. ఆ వాహనం గుజరాత్ రిజిస్ట్రేషన్ తో ఉంది. వాహనంలో ఓ రివాల్వర్, మూడు కత్తులు దొరికాయి.

అక్కడ 80 శాతం గుజరాతీయులే

అక్కడ 80 శాతం గుజరాతీయులే

ఈ అపార్ట్ మెంట్ లో 80 శాతం మంది గుజరాత్ నుండి వలసవచ్చినవారే నివసిస్తున్నారు. గోద్రా అల్లర్ల తర్వాత అక్కడి నుండి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డవారే కావడం పట్ల పలు అనుమానాలకు తావిచ్చింది. దోపిడిదారుల వాహనం కూడ గుజరాత్ రిజిస్ట్రేషన్ ది కావడంతో వారు వాహనాన్ని అక్కడే వదిలేసి ప్లాట్లలో నక్కారా అని పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే పెద్ద ఎత్తున పోలీసు బలగాలను దింపి సోదాలు నిర్వహించారు. దుండగుల వద్ద ఆయుధాలు ఉండడంతో కాల్పులు జరిపే ప్రమాదం ఉందని భావించి 40 మంది షార్ప్ షూటర్లు, 2 అక్టోపస్ టీమ్ లను దింపారు. ఒకేసారి అంతమంది పోలీసులు రావడంతో అపార్ట్ మెంట్ వాసులు భయాందోళనలకు గురయ్యారు. అక్టోపస్ ఐజి శ్రీనివాస్ రెడ్డి పరిస్థితిని సమీక్షించారు.

సిసికెమెరాల్లో దుండగులు వాహనం గుర్తింపు

సిసికెమెరాల్లో దుండగులు వాహనం గుర్తింపు

దుండగులు వాడిన టవేరా వాహనం వివరాలను సేకరిస్తున్నారు. అన్ని టోల్ గేట్ల వద్ద దాని రాకపోకలపై ఆరా తీస్తున్నారు. అది పటాన్ చెరువు టోల్ గేట్ నుండి సిటీలోకి రావడం వరకు 40 సార్లు రికార్డు అయినట్టు పోలీసులు గుర్తించారు.మిగతా టోల్ గేట్ల వద్ద కూడ సీసీటీవి పుటేజీ ని పరిశీలిస్తున్నారు. మంగళవారం నాడు పటాన్ చెరువు, ఓఆర్ ఆర్ మీదుగా మైలార్ దేవ్ పల్లి ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయానికి వచ్చినట్టు సిసీటీవి పుటేజీలో రికార్డైంది.

ఆరాంఘర్ మీదుగా పీవీ ఎక్స్ ప్రెస్ హైవే

ఆరాంఘర్ మీదుగా పీవీ ఎక్స్ ప్రెస్ హైవే

ఆరాంఘర్ అండర్ పాస్ మీదుగా వారు పివీఆర్ ఎక్స్ ప్రెస్ హైవే ఎక్కారు. ఉప్పర్ పల్లి వద్ద కిందకు దిగి నేరుగా హ్యాపీ హోమ్స్ అపార్ట్ మెంట్ లో పార్కింగ్ చేశారు. కాగా, అత్తాపూర్ లోని ఓ హొటల్ లో వారు మూడురోజులపాటు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ హోటల్ నుండే దోపిడికి పథకం వేసి శనివారం నుండి చుట్టుపక్కల పరిస్థితిని పరిశీలించారని తెలిసింది.

English summary
Police searching completed in Happy home apartments in Upparpally at Hyderabad outskirts.6 hours they searched in this apartment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X