వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండోసారి వద్దు, అమెరికా వెళ్లిపోతా: రఘురాం రాజన్

|
Google Oneindia TeluguNews

ముంబై: ఆర్బీఐ గవర్నర్‌గా తాను రెండోసారి బాధ్యతలను చేపట్టలేనని, తనకు ఇష్టమైన బోధనా వృత్తిలోకి వెళ్తానని, యూనివర్సిటీ ఆఫ్ చికాగోకు వెళ్లాల్సిన తరుణం ఆసన్నమైందని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ చెప్పారు.

ఆర్బీఐ గవర్నర్ పదవిని ఆయన రెండోసారి చేపడతారా, అవకాశం వస్తుందా అనే చర్చ గత కొద్ది రోజులుగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతను తాజాగా ఓ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆర్థిక ప్రగతికి తాను ఏం చేశానో చెప్పారు.

భారత్‌కు వద్దు!: రఘురాంరాజన్‌పై స్వామి సంచలనంభారత్‌కు వద్దు!: రఘురాంరాజన్‌పై స్వామి సంచలనం

నేను తొలుత చెప్పినదాని కంటే మనం ఎక్కువే చేశామని, ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతుల నియామకం విషయంలో బ్యాంక్‌ బోర్డు బ్యూరో ఏర్పాటు ద్వారా ప్రభుత్వానికి సాయపడ్డామని, విఫలమైన ప్రాజెక్టుల నుంచి బకాయిలు రాబట్టుకోవడానికి బ్యాంకుల కోసం కొత్త అధికారాలిచ్చామన్నారు.

Raghuram Rajan says no to second term as RBI governor

ఆస్తుల నాణ్యత సమీక్ష(ఏక్యూఆర్‌)ను ప్రవేశపెట్టామని, దీని ద్వారా ఆయా బ్యాంకులు ఆయా సమయాల్లో మొండి బకాయిలను గుర్తించి కేటాయింపులు జరపడానికి వీలైందన్నారు. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కోసం సార్వజనీన చెల్లింపుల పద్ధతిని తీసుకురావడం కోసం సహాయపడ్డామన్నారు.

తన చివరి గమ్యస్థానం అకడమిక్స్ అని, మూడేళ్ల పదవీ కాలం ముగింపు దశకు చేరుకుందని, యూనివర్సిటీ ఆఫ్‌ చికాగోకు వెళ్లాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. మనం ఏం సాధించామన్నది సమీక్షించుకోవడానికి ఇది సరైన సమయమన్నారు.

తొలి రోజున నిర్ణయించుకున్న లక్ష్యాల్లో రెండు ఇంకా పూర్తి కావాల్సి ఉందని, ద్రవ్యోల్బణం మన లక్ష్య స్థాయిలోనే ఉందని, అయితే విధానాలను నిర్ణయించే పరపతి విధాన కమిటీ ఇంకా ఏర్పాటు కావాల్సి ఉందన్నారు. సెప్టెంబరు 4, 2016న గడువు ముగుస్తుందని, అయినప్పటికీ నా దేశానికి అవసరమైనపుడు నా సేవలు ఎపుడూ ఉంటాయన్నారు.

కీలక సమాచారం పంపడమా: రాజన్‌పై స్వామి మళ్లీ కీలక సమాచారం పంపడమా: రాజన్‌పై స్వామి మళ్లీ

తన తర్వాత ఈ బాధ్యతలను స్వీకరించే వ్యక్తి కచ్చితంగా మనల్ని ఉన్నత స్థానాలకు తీసుకెళతారని విశ్వాసం ఉందని చెప్పారు. కాగా, రఘురాం రాజన్ ఈ లేఖను సిబ్బందికి రాశారు. రాజన్ నిర్ణయం నేపథ్యంలో బీజేపీ పైన కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.

రాజన్ తర్వాత..

రఘురాం రాజన్ తర్వాత ఆర్బీఐ గవర్నర్‌గా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఆర్బీఐ గవర్నర్ పదవి కోసం విజయ్ కేల్కర్, రాకేష్ మోహన్, అశోక్ లాహిరి, ఊర్జిత్ పటేల్, అరుంధతి భటడ్టాచార్య, సుబీర్ గోకర్ణ్, అశోక్ చావ్లా తదితరుల పేర్లను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

English summary
Reserve Bank of India Governor Raghuram Rajan has decided not to continue in the role for a second term and will return to academia once his tenure ends on September 4, 2016.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X