హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నృత్యాలు: రాహుల్ రాక, పాదాభివందనం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పదవి మహిళకే దక్కాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆకాంక్షించారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ శుక్రవారం తెలంగాణలో మలి విడత ప్రచారం నిర్వహించారు. వరంగల్, హైదరాబాద్‌లో రెండు బహిరంగ సభలో పాల్గొని పార్టీ నాయకులను, శ్రేణులను ఉత్సాహపరిచారు. హైదరాబాద్‌లోని ఎల్బి స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభ విజయవంతమైంది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలి వచ్చారు.

కళాకారులు, కార్యకర్తలు ఆనందంతో నృత్యాలు చేశారు. రాహుల్.. స్టేడియం వేదికకు సాయంత్రం నాలుగు గంటలకే చేరుకుంటారని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయడంతో కార్యకర్తలు రెండు గంటల నుంచే స్టేడియంకు చేరుకోసాగారు. రాహుల్ హిందీ ప్రసంగాన్ని మాజీ మంత్రి దానం నాగేందర్ తెలుగులోకి అనువదించారు. రాహుల్ తన ప్రసంగంలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలపై విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణలో సెటిలర్లకు రక్షణ బాధ్యత తమదేనని అన్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

భవిష్యత్తు అంతా యువకులదేనని, మహిళలకు శక్తినందిస్తామని ఆయన చెప్పారు. తనకు రిస్ట్ వాచీ లేదని చెప్పిన రాహుల్ గాంధీ.. తెలంగాణలో తయారైన రిస్ట్ వాచ్ కావాలని చెప్పారు. ఇప్పుడు మనం వాడే షూస్, వాచ్ తదితర వస్తువులపై మేడ్ ఇన్ చైనా అని ఉంటోందని, వీటిని కొనుగోలు చేయడం ద్వారా ఆదాయం ఆ దేశానికే పొతున్నదని ఆయన తెలిపారు. కాబట్టి వచ్చే ఐదేళ్ళలో తెలంగాణలోనే వివిధ రకాల వస్తువుల ఉత్పాదన కావాలని, వాటిపై ‘మేడ్ ఇన్ తెలంగాణ, మేడ్ ఇన్ హైదరాబాద్' రాసి ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

హైదరాబాద్ సాఫ్ట్, హార్డ్ వేర్ రంగంలో అభివృద్ధి చెంది ప్రపంచ ఖ్యాతి చెందాల్సిన అవసరం ఉందని రాహుల్ చెప్పారు. రైతులను, పేదలను అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేది కాంగ్రెస్సేనని ఆయన తెలిపారు. ఇవన్నీ టిఆర్ఎస్ పార్టీ అధినేత కె చంద్రశేఖర్ రావు వల్ల సాధ్యం కాదని ఆయన విమర్శించారు. కెసిఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోరని రాహుల్ ఆరోపించారు. కాగా, సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్థి అంజన్‌కుమార్ యాదవ్ రాహుల్‌కు ‘గద'ను బహుకరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి దానం నాగేందర్ రాహుల్‌తో శంఖం పూరింపజేశారు. ‘సమర శంఖారావం' పేరిట రూపొందించిన సిడిని రాహుల్ ఆవిష్కరించారు. గజమాలతో రాహుల్‌‌ను దానం సంత్కరించారు.

రాహుల్ సభకు హాజరైన మహిళలు

రాహుల్ సభకు హాజరైన మహిళలు

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పదవి మహిళకే దక్కాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆకాంక్షించారు.

రాహుల్‌కు పాదాభివందనం

రాహుల్‌కు పాదాభివందనం

హైదరాబాద్ ఎల్‌బి స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ గాంధీకి పాదాభివందనం చేస్తున్న యాకుత్‌పుర కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సదానంద్.

నీడ కోసం..

నీడ కోసం..

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ శుక్రవారం తెలంగాణలో మలి విడత ప్రచారం నిర్వహించారు.

తరలిన మహిళలు

తరలిన మహిళలు

రాహుల్ గాంధీ.. స్టేడియం వేదికకు సాయంత్రం నాలుగు గంటలకే చేరుకుంటారని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయడంతో కార్యకర్తలు రెండు గంటల నుంచే స్టేడియంకు చేరుకోసాగారు.

వేదికపై కళాకారుల నృత్యాలు

వేదికపై కళాకారుల నృత్యాలు

హైదరాబాద్‌లోని ఎల్బి స్టేడియంలో నిర్వహించిన రాహుల్ గాంధీ బహిరంగ సభ విజయవంతమైంది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలి వచ్చారు. కళాకారులు, కార్యకర్తలు ఆనందంతో నృత్యాలు చేశారు.

మహిళల నృత్యాలు

మహిళల నృత్యాలు

హైదరాబాద్‌లోని ఎల్బి స్టేడియంలో నిర్వహించిన రాహుల్ గాంధీ బహిరంగ సభ విజయవంతమైంది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలి వచ్చారు. కళాకారులు, కార్యకర్తలు ఆనందంతో నృత్యాలు చేశారు.

ఆనందంతో..

ఆనందంతో..

భవిష్యత్తు అంతా యువకులదేనని, మహిళలకు శక్తినందిస్తామని రాహుల్ గాంధీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

వేదిక వద్దకు చేరుకుంటూ..

వేదిక వద్దకు చేరుకుంటూ..

రాహుల్ హిందీ ప్రసంగాన్ని మాజీ మంత్రి దానం నాగేందర్ తెలుగులోకి అనువదించారు.

కాంగ్రెస్ నేతల చిందులు

కాంగ్రెస్ నేతల చిందులు

రాహుల్ తన ప్రసంగంలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలపై విమర్శల వర్షం కురిపించారు.

అభివాదం

అభివాదం

తెలంగాణలో సెటిలర్లకు రక్షణ బాధ్యత తమదేనని రాహుల్ అన్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. వేదికపై రాహుల్‌తోపాటు అభివాదం తెలుపుతున్న కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ, ఎంపి అంజన్ కుమార్ యాదవ్.

రాహుల్ ప్రసంగం

రాహుల్ ప్రసంగం

తనకు రిస్ట్ వాచీ లేదని చెప్పిన రాహుల్ గాంధీ.. తెలంగాణలో తయారైన రిస్ట్ వాచ్ కావాలని చెప్పారు.

గజమాలతో..

గజమాలతో..

రాహుల్ గాంధీని గజమాలతో సత్కరిస్తున్న ఎంపి అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి దానం నాగేందర్.

గదను చూపుతున్న రాహుల్

గదను చూపుతున్న రాహుల్

సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్థి అంజన్‌కుమార్ యాదవ్ రాహుల్‌కు ‘గద'ను బహుకరించారు. ఈ సందర్భంగా గదను చూపుతున్న రాహుల్.

భారీగా హాజరైన జనం

భారీగా హాజరైన జనం

హైదరాబాద్ సాఫ్ట్, హార్డ్ వేర్ రంగంలో అభివృద్ధి చెంది ప్రపంచ ఖ్యాతి చెందాల్సిన అవసరం ఉందని రాహుల్ చెప్పారు. రైతులను, పేదలను అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేది కాంగ్రెస్సేనని ఆయన తెలిపారు.

English summary
Congress Party Vice president Rahul Gandhi on Friday conducted a public meeting at LB stadium in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X