చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి ప్రజారాజ్యం వైఫల్యాలు: రజనీకాంత్ పక్కా ప్లాన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

రజనీకాంత్ చిరంజీవి మాదిరిగా హడావిడి చేయడు !

చెన్నై: యుద్ధరంగంలోకి దిగితే గెలిచే తీరాలని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. అందుకు జనాకర్షణ ఒక్కటే సరిపోదని, పక్కా ప్లాన్ ఉండాలని కూడా ఆయన భావిస్తున్నారు. వాపు చూసి బలం అనుకుంటే తప్పు చేయడమే అవుతుందనేది ఆయన ఆలోచన.

తన ఆలోచననే ఆయన మంగళవారం అభిమానులతో జరిగిన సమావేశంలో ప్రస్తావించారు. ప్రజారాజ్యం విషయంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన పొరపాటు చేయకూడదని ఆయన అనుకుంటున్నారు. చిరంజీవి వైఫల్యాన్ని గుణపాఠంగా స్వీకరించాలనేది కూడా ఆయన మతంగా కనిపిస్తోంది.

 సొంత పార్టీయే పెడుతారు...

సొంత పార్టీయే పెడుతారు...

రజనీకాంత్ తమిళనాడులో సొంత పార్టీయే పెడుతారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇతర పార్టీలతో పొత్తు కూడా ఉండదని అభిప్రాయపడుతున్నాయి. కాంగ్రెసు నేత కరాటే త్యాగరాజన్ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. తనకు తెలిసి రజనీకాంంత్ సొంత పార్టీయే పెడతారని ఆయన అన్నారు. తన దారి రహదారి అనే విషయం ఇప్పటికే చెప్పారని, అందువల్ల ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోరని ఆయన అన్నారు.

బిజెపితో పొత్తుకు నో చాన్స్

బిజెపితో పొత్తుకు నో చాన్స్

వచ్చే ఎన్నికల్లో రజనీకాంత్ బిజెపితో కలిసి నడిచే అవకాశం కూడా లేదని కరాటే త్యాగరాజన్ అన్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో బిజెపికి నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చాని, దీన్ని బట్టి చూస్తే రజనీకాంత్ కమలతో దోస్తీ కట్టే అవకాశాలు కూడా లేవని అభిప్రాయపడ్డారు. ఆయన బిజెపితో పొత్తు పెట్టుకుంటారని గతంలో ప్రచారం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కారణంగా ఆ ప్రచారం సాగింది.

 చిరంజీవిలా హడావిడి చేయరు..

చిరంజీవిలా హడావిడి చేయరు..

మెగాస్టార్ చిరంజీవి మాదిరిగా హడావిడిగా రజనీకాంత్ రాజకీయాల్లోకి రారని, అందుకు అవసరమైన వ్యూహరచన చేసిన తర్వాతనే రాజకీయ ప్రవేశం చేస్తారని త్యాగరాజన్ అన్నారు. ముందు తన అభిమానుల్ని, అభిమాన సంఘాల్ని కట్టడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.

 వారుంతా ఇలా అన్నారు..

వారుంతా ఇలా అన్నారు..

రజనీ రాజకీయాల్లోకి వస్తారని, రావాలని ఆకాంక్షిస్తున్నానని సీనియర్‌ నటుడు, అన్నాడీఎంకే నేత ఆనంద్‌రాజ్‌ అన్నారు. రజనీ రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందర్‌రాజన్‌ చెప్పారు. రజనీకాంత్ నిర్ణయం వేరేగా ఉన్నా ఏమి చేయలేమని టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఎస్‌.తిరునావుక్కరస్‌ అభిప్రాయపడ్డారు. ఖుష్బూ సహా మరికొంత మంది నేతలు రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మాట్లాడుతామని అన్నారు.

 వ్యూహం కూడా ముఖ్యమని..

వ్యూహం కూడా ముఖ్యమని..

యుద్ధానికి సిద్ధం కావాలని అభిమానులకు పిలుపునిచ్చిన రజనీకాంత్ తాజాగా రాజకీయాలకు బలంతో వూహ్యం కూడా ఉండాలని అన్నారు. దీన్ని బట్టి ఆయన వ్యూహరచనకు ఇస్తున్న ప్రాధాన్యం అర్థమవుతోంది.

 మహేంద్రన్ ఇలా చెప్పారు..

మహేంద్రన్ ఇలా చెప్పారు..

దర్శకుడు మహేంద్రన్ మాటలను చూస్తే రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం ఖాయమని అర్థమవుతోంది. రజనీకాంత్ త్వరలో కీలకమైన నిర్ణయం ప్రకటిస్తారని ఆయన చెప్పారు. అంతేకాకుండా రజనీకాంత్ నాయకుడైతే ప్రజలకు మంచి జరుగుతుందని కూడా అన్నారు. అయితే, రజనీకాంత్‌పై ఒత్తిడి పెట్టవద్దని, తొందరపెట్టకూడదని ఆయన అన్నారు. దేని గురించైనా ప్రశాంతంగా ఆలోచించే రజనీకాంత్ ఏ రంగంలోనైనా ఉన్నత స్థానంలోనే ఉంటారని అన్నారు. ప్రజాశక్తిని తన వైపు ఆకర్షించే శక్తి రజనీలో ఉందని అన్నారు.

English summary
tamil super star Rajinikanth does not want to repeat Megastar Chiranjeevi's Prajarajyam failure.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X