వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గంగూలీXరవిశాస్త్రి: మాజీల్లో విభజన, గంభీర్ తీవ్రవ్యాఖ్య

|
Google Oneindia TeluguNews

ముంబై: అనిల్ కుంబ్లేను హెడ్ కోచ్‌గా ఎంపిక చేసిన విషయమై సౌరవ్ గంగూలీ - రవిశాస్త్రిల మధ్య మాటల యుద్ధం నడిచింది. దీనిపై మాజీ క్రికెటర్లు ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. గౌతమ్ గంభీర్ రవిశాస్త్రి పైన తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

పిచ్చోళ్ల ప్రపంచంలో విహరిస్తున్నట్టున్నావ్.. హద్దులో ఉంటే మంచిది : రవిశాస్త్రి కామెంట్స్ పై గంగూలీ

రవిశాస్త్రి మాటలు అతడి అసహనాన్ని మాత్రమే సూచిస్తున్నాయని, కోచ్‌గా అనిల్ కుంబ్లేనే సరైన ఎంపిక అని చెప్పారు. అసలు ఈ పద్దెనిమిది నెలల కాలంలో జట్టుకు డైరెక్టర్‌గా ఉన్న రవిశాస్త్రి ఏం చేశారో చెప్పాలన్నారు. రవిశాస్త్రి ఉన్న కాలంలో ప్రపంచ కప్‌తో పాటు, ట్వంటీ 20 వరల్డ్ కప్ కూడా టీమిండియా పేలవ ప్రదర్శన కనబర్చిందన్నాడు. విజయాలను మీఖాతాలో వేసుకొని, అపజయాలు నావి కావంటే కుదరదన్నారు.

అదే సమయంలో మాజీ లెజండరీ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ రవిశాస్త్రిని సమర్థించినట్లుగా మాట్లాడాడు. భారత జట్టు ప్రధాన కోచ్‌గా కాకపోవడంపై రవిశాస్త్రి బాధపడటానికి కారణాలు ఉన్నాయని వ్యాఖ్యానించాడు. కోచ్ ఎంపిక బోర్డు ద్వారా కాకుండా ఒక సెలక్టర్ అభీష్టానికి అనుగుణంగా సాగడం అతడిని బాధించి ఉంటుందని బేడీ అభిప్రాయపడ్డాడు.

 Ravi Shastri's comments show his desperation: Gautam Gambhir

ప్రధాన కోచ్ విషయంలో బీసీసీది సరైన ఎంపికేనని సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. టీమిండియాకు ప్రస్తుతం మనసావాచా పని చేసే కోచ్ ఉన్నాడని, అనిల్ కుంబ్లేకు పని చేయడంలో మరో మార్గం తెలియదని, తనను కోచ్ పదవికి తిరస్కరించడంపై రవిశాస్త్రి ఆగ్రహంతో ఉన్నట్లుగా ఉన్నాడని, అతడికి ఇది కొత్త అనుభవమన్నాడు.

కుంబ్లే, రవిశాస్త్రి అసహనం: అత్యుత్సాహంతో..

కాగా, కోచ్ పదవికి ఎంపిక జరుగుతున్న సమయంలో గంగూలీ అక్కడ లేడని రవిశాస్త్రి విమర్శించిన విషయం తెలిసిందే. దీనిపై గంగూలీ కూడా తీవ్రంగానే స్పందించాడు. రవిశాస్త్రి పిచ్చోళ్ల ప్రపంచటంలో విహరిస్తన్నట్లు ఉన్నాడని, హద్దులో ఉంటే మంచిదని, ఇంటర్వ్యూ ఉంటే బ్యాంకాకులో షికార్లా అని గంగూలీ గరం అయ్యాడు.

English summary
Sanjay Manjrekar, Gambhir and skipper Bishan Singh Bedi shared their views on the ongoing verbal battle between Ravi Shastri and Sourav Ganguly in the wake of the national coach appointment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X