వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్బీఐలో వేతనం: టాప్‌లో లేని రాజన్, వారి కంటే చాలా తక్కువే

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్‌కు ఆర్బీఐలో అత్యధిక వేతనం అని చాలామంది భావిస్తారు. కానీ ఆర్బీఐలో అత్యధిక వేతనం తీసుకునే వారిలో ఆయన నాలుగో స్థానంలో ఉన్నారు. ఆయన కంటే మరో ముగ్గురు ముందున్నారు.

తాజాగా వెలుగుచూసిన సమాచారం ప్రకారం ఆర్బీఐలో అత్యధిక వేతనం అందుకునేది రాజన్‌ కాదు.. రాజన్‌ కన్నా మరో ముగ్గురు ఎక్కువ వేతనం పొందుతున్నారని ఆర్బీఐ తాజాగా తెలిపింది.

అంతేకాదు డిప్యూటీ డైరెక్టర్లకన్నా ప్రిన్సిపల్‌ అడ్వయిజర్ వేతనం ఎక్కువని, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ కన్నా కొందరు కిందిస్థాయి ఉద్యోగుల వేతనం అధికమని ఆర్బీఐ వెల్లడించింది. సమాచార హక్కు చట్టం కింద ఆర్బీఐ ఈ సమాచారాన్ని వెబ్‌సైట్లో ఉంచింది.

RBI governor Raghuram Rajan not the top paid man at RBI

దీని ప్రకారం రఘురామ్ రాజన్‌ నెల జీతం రూ.1,98,700. ఇందులో బేసిక్‌ వేతనం రూ.90 వేలు. కాగా డీఏ రూ.1.01లక్షలు, ఇతరాలు రూ.7వేలుగా ఉన్నాయి. రాజన్‌ కన్నా అధికంగా వేతనం అందుకుంటున్న వారిలో ఆర్బీఐలో మరో ముగ్గురున్నారని తెలిపింది.

గోపాలకృష్ణ సీతారామ్‌ హెగ్డే(నెలసరి వేతనం రూ.4 లక్షలు), అన్నామలై అరాపులి (రూ.2.2లక్షలు), వీ కందసామి (రూ.2.1 లక్షలు)లు రఘురామ్ రాజన్ కన్నా అధిక వేతనం పొందుతున్నారు. అయితే వీరు ప్రస్తుతం ఆర్బీఐతో పని చేస్తున్నదీ లేనిదీ వెల్లడించలేదు.

కేవలం వ్యక్తులు, వారి వేతనాలను మాత్రమే ఆర్బీఐ వెల్లడించింది. వారి హోదాలను తెలియజేయలేదు. గత సమాచారం ప్రకారం హెగ్డే ఆర్బీఐకి ప్రధాన న్యాయ సలహాదారుగా పని చేస్తున్నారు.

ఇక ఆర్బీఐలోని మరో ప్రిన్సిపల్ అడ్వయిజర్‌గా పని చేస్తున్న కిల్లావాలా వేతనం ఆర్బీఐలోని నలుగురు డిప్యూటీ గవర్నర్లు, 11 మంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కన్నా అధికమని తెలిపింది. అయితే, బేసిక్ విషయంలో మాత్రం రఘురామ్ రాజన్ టాప్‌లో ఉన్నారు. ఆర్బీఐలో 44 మంది ఉద్యోగులు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కన్నా ఎక్కువ వేతనం పొందుతున్నారు.

English summary
RBI governor Raghuram Rajan not the top paid man at RBI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X