వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవరీ సంగీత: జల్సాల కోసం ఎటు నుంచి ఎటు?

ఎయిర్ హోస్టెస్‌గా ఉద్యోగం చేస్తూ మోడలింగ్ చేస్తూ వస్తున్న సంగీత చాలా విచిత్రంగా ఎర్ర చందనం అక్రమ వ్యాపారంలోకి దిగింది.

By Pratap
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: ఎర్ర చందనం వ్యాపారం ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించిన సంగీతా ఛటర్జీకి సంబంధించిన పలు ఆసక్తికరమైన వెలుగు చూశాయి. విచారణలో ఆమె పోలీసు అధికారులకు వెల్లడించినట్లు సమాచారం. ఈ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు పోలీసులు ఆమెను తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు.

ఆ విచారణలో తాను ఎటు నుంచి ఎటు పయనించిందీ వివరించినట్లు సమాచారం. కోల్‌కతాకు చెందిన సంగీతా ఛటర్జీ ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌ హోస్టెస్‌గా పని చేస్తూ పలు యాడ్స్‌కు మోడల్‌గా వ్యవహరించేది. పైలట్‌ వరుణ్‌లాల్‌ను ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. ఆమెకు సంబంధించిన వివరాలు మీడియాలో వార్తాకథనాలుగా వచ్చాయి.

ఇక్కడే మలుపు...

తన ఇంటిలో పెంచు కుంటున్న ల్యాబ్‌ అనే ఆడ కుక్కకు క్రాసింగ్‌ కోసం ఎవరైనా మగ ల్యాబ్‌ జాతి కుక్క వుంటే తనను సంప్రదించాలని కోరుతూ తన ఫొటోతోపాటు చిరునామా, మొబైల్‌ నెంబర్‌ను ఇంటర్నెట్‌లో పెట్టింది. సంగీత ప్రకటనను చూసిన ఎర్రచందనం స్మగ్లర్‌ లక్ష్మణ్‌ తన వద్ద ల్యాబ్‌ మగ కుక్క వుందని చెప్పాడు.

Red sanders smuggling: Sangeetha's journey

దాంతో ఆగకుండా సంగీత ఇంటికి సరాసరి తన పెంపుడు కుక్కతో వెళ్ళాడు. ఇలా పరిచయమైన లక్ష్మణ్‌ ఆమెకు దగ్గరయ్యాడు. తన ఎర్రచందనం అక్రమ రవాణాలో ఆమెను భాగస్యామురాలిని చేస్తూ కోట్ల రూ పాయల తన సంపాదనను ఆమె బ్యాంకు ఖాతాలోనే జమ చేస్తూ వ్చచాడు. దీన్ని గుర్తించిన వరుణ్‌ లాల్‌ సంగీతతో విడాకులు తీసుకున్నారు.

అతనితో పెళ్లి

ఆ తర్వాత లక్ష్మణ్‌ను సంగీత వివాహం చేసుకుంది. తమిళనాడు నుంచి అక్రమంగా ఎర్రచందనం దుంగలను దేశ, విదేశాలకు తరలించడానికి లక్ష్మణ్‌ తన భార్య సంగీత సహాయం తీసుకుంటూ వచ్చాడు. ఎర్రచందనం అక్రమ సంపాదన ద్వారా సంగీత కోల్‌కాతాలో రూ. 25 కోట్ల విలుమైన మూడు భవనాలను సమకూర్చుకుంది. సుమారు 2.158 కేజీల బంగారం, యూకో బ్యాంకుతోపాటు ఇతర బ్యాంకులలో లక్షలాది రూపాయల నగదు జమచేసింది.

దాదాపు రెండున్నర ఏళ్ల పాటు సంగీత విలాసవంతమైన జీవితాన్ని గడిపింది. 2014వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో చిత్తూరు పోలీసులకు లక్ష్మణ్‌ పట్టుబడ్డాడు. అతని ద్వారా స్మగ్లింగులో సంగీత ప్రమేయా న్ని చిత్తూరు పోలీసు అధికారులు గుర్తించారు.

దాదాపు ఏడాదిన్నర కాలం గాలింపు చర్యలు చేపట్టి గత నెల మార్చి 28వ తేదీన సంగీతను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె చిత్తూరులోని జిల్లా జైల్‌లో రిమాండ్‌ ఖైదీగా ఉంది. వారం రోజుల పాటు పాకాల కోర్టు ద్వారా సంగీతను కస్టడీకి తీసుకున్న పోలీసు అధికారులు తమ విచారణను ముగించి, మంగళవారం మళ్ళీ కోర్టు ద్వారా సంగీతను రిమాండ్‌కు తరలించారు.

English summary
A model and air hostess Sangeetha chaterjee has turned into a red sanders smuggler.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X