వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీడియా బాంబు: కెవిపిపై అమెరికాలో కేసు

By Pratap
|
Google Oneindia TeluguNews

చికాగో: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మీయ మిత్రుడు, కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావుపై తెలుగు మీడియా గురువారంనాడు బాంబు పేల్చింది. తెలుగులోని రెండు ప్రముఖ తెలుగు దినపత్రికల్లో కెవిపి రామచందర్ రావుపై అమెరికాలోని చికాగోలో కేసు నమోదైన విషయానికి సంబంధించిన వార్తాకథనాలు ప్రచురితమయ్యాయి. ఎన్నికల వేళ కాంగ్రెసుకు ఇది శరాఘాతమే కానుంది.

మీడియా కథనాల ప్రకారం - ఆంధ్రప్రదేశ్‌లో టైటానియం ఉత్పత్తులకు అవసరమైన ఖనిజాన్ని వెలికితీసి, అంతర్జాతీయ స్థాయిలో విక్రయించి, కోట్లు మూటగట్టుకునేందుకు ప్రయత్నం చేసినట్లు, ఇందులో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో 1.85 కోట్ల డాలర్లు (మన లెక్కలో చెప్పాలంటే 110.81 కోట్ల రూపాయలు) లంచాలుగా ఇచ్చేందుకు కుట్ర పన్నారని తేలింది. ఇందులో సుమారు 64 కోట్ల సొమ్ము బట్వాడా అయినట్లు సమాచారం.

Reports: case booked against KVP in USA

ఈ అక్రమ వ్యాపారం అమలుకు తమ దేశ భూభాగాన్ని, తమ దేశంలోని ఆర్థిక వ్యవస్థలను ఉపయోగించుకున్నారంటూ అమెరికాలోని చికాగో ఫెడరల్ కోర్టు అభియోగాలు నమోదు చేసింది. దీన్ని అంతర్జాతీయ కుంభకోణంగా, ద్రవ్య అక్రమ చలామణీగా అభివర్ణించింది. గత ఏడాది జూన్ 13వ తేదీన ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ సీల్ చేసిన ఈ కేసు వివరాలను బుధవారం వెల్లడించింది. ఈ అంతర్జాతీయ ముఠా నుంచి కెవిపి తనకోసం, తన తరఫు వారి కోసం ముడుపులు ఆశించారంటూ ఆయనపై గరిష్ఠంగా ఐదు అభియోగాలు మోపింది.

కెవిపితో పాటు హంగేరీకి చెందిన వ్యాపారి ఆండ్రస్ నాప్, ఉక్రెయిన్‌కు చెందిన సురెన్ జెవొర్గ్యాన్, అమెరికాలో స్థిరపడిన భారతీయుడు గజేంద్ర లాల్, శ్రీలంకకు చెందిన పెరియస్వామి సుందరలింగంలపైనా అభియోగాలు నమోదు చేసింది. "అంతర్జాతీయ స్థాయి అవినీతిపై మా న్యాయవిభాగం పోరాడుతుంది. ఈ ఆరుగురు విదేశీయులపై అభియోగాలు నమోదు చేయడంద్వారా... ఎవరు, ఎక్కడ విదేశీ అధికారులను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించినా ఊరుకునేది లేదని గట్టి సంకేతాలు పంపినట్లయింది'' అని న్యాయ విభాగం (క్రిమినల్ డివిజన్) అసిస్టెంట్ అటార్నీ జనరల్ (ఇన్‌చార్జి) డేవిడ్ ఓనీల్ ప్రకటించారు. ఈ కేసు వివరాలను ఆయనే వెల్లడించారు.

ఈ ఆరుగురు 'నిందితుల'కు సంబంధించిన 1.05 కోట్ల డాలర్ల (సుమారు 64కోట్ల రూపాయల) విలువైన ఆస్తులను జప్తు చేయాలని అభియోగ పత్రాల్లో చెప్పారు. ఈ లావాదేవీల్లో కీలకపాత్ర పోషించిన ఉక్రెయిన్ జాతీయుడైన దిమిత్రీ ఫిర్తాష్ అనే నిందితుడిని గతనెల 12వ తేదీన అరెస్టు చేశారు. 1.74 కోట్ల డాలర్ల పూచీకత్తు ఇచ్చాక 21వ తేదీన ఆయనకు బెయిల్ లభించింది. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఫిర్తాష్ ఆయనను కలిసినట్లు అభియోగ పత్రాల్లో చెప్పారు.

English summary
According to media - Chicago court has booked case against Congress Rajyasabha member and YS Rajasekhar Reddy's follower KVP Ramachandar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X