• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

"చిన్నమ్మ" నవ్వింది: తమిళనాట ఇక సంక్షోభమే...

By Pratap
|

చెన్నై: ఆర్కెనగర్‌లో దినకరన్ విజయం సాధించడం పట్ల చిన్నమ్మ శశికళ హర్షం వ్యక్కం చేశారు. అక్రమాస్తుల కేసులో జైలు జీవితం గడుపుతున్న ఆమె ఎట్టకేలకు నవ్వారు. ఎన్నికల గుర్తు టోపీ కావాలని పట్టుబట్టిన దినకరన్‌కు నిరాశే అయింది.

చివరకు కుక్కర్ దక్కించుకుని ప్రత్యర్థులను ఊపిరాడకుండా చేశారు. జయలలిత సాధించిన మెజారిటీ కన్నా ఎక్కువ మెజారిటీ సాధించారు. డబ్బులు పంచి గెలిచినట్లు కొ వ్యాఖ్యలు చేస్తున్నారని తిప్పికొట్టారు. నియోజకవర్గంలో ఉన్నవారందరికీ డబ్బులు ఎలా పంచగలమని ఆయన ప్రశ్నించారు.

ఎన్నాళ్లకెన్నాళ్లకు శశికళ...

ఎన్నాళ్లకెన్నాళ్లకు శశికళ...

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలి బెంగళూరు జైలులో ఉన్న శశికళ ఇప్పటికీ నవ్వారు. మేనల్లుడు టీటీవీ దినకరన్‌ విజయం విషయం తెలిసి ఇళవరసితో తన సంతోషాన్ని పంచుకున్నారు. జయలలిత తర్వాత తానే అనుకున్న శశికళకు ఏడాది కాలంగా ఎదురు దెబ్బలే తగులుతూ వచ్చాయి.

జైలు అధికారుల ద్వారా లేఖ...

జైలు అధికారుల ద్వారా లేఖ...

దినకరన్‌కు జైలు అధికారుల ద్వారా శశికళ శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నాడీఎంకేకు చెందిన కోట్లాది మంది కార్యకర్తలు దినకరన్‌కు సహాయసహకారాలు అందించాలని, దివంగత ముఖ్యమంత్రి జయలలిత రెండుసార్లు ఎమ్మెల్యేగా వ్యవహరించిన ఆర్‌కే నగర్‌ అభివృద్ధికి దినకరన్‌ కృషి చేయాలని శశికళ కోరారు. ఈ మేరకు ఆమె రాసిన లేఖను జైలు అధికారుల ద్వారా దినకరన్‌కు పంపించారు.

ప్రలోభాలతోనే దినకరన్ గెలిచారని...

ప్రలోభాలతోనే దినకరన్ గెలిచారని...

ఆస్పత్రిలో జయలలిత ఉన్నప్పటిదంటూ విడుదల చేసిన వీడియోతోపాటు డబ్బులు పంపిణీ చేయడం కూడా ఆర్కె ఎన్నికల్లో పనిచేశాయని దినకరన్ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో 234 నియోజకవర్గాలు ఉన్నాయని, అందులో ఆర్కేనగర్‌ ఒకటి మాత్రమేని, అక్కడ ఒకచోట గెలిచినంత మాత్రాన సముద్రంలాంటి అన్నాడీఎంకేకు ఏమీకాదని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి జయకుమార్‌ అన్నారు.

అమ్మ కంచుకోటలా తయారు చేశారు.

అమ్మ కంచుకోటలా తయారు చేశారు.

అమ్మ జయలలిత పార్టీని కంచుకోటలా తయారు చేశారని, ఆమె కంటే ఆధిక్యం ఎక్కువ వచ్చినంత మాత్రాన టీటీవీ దినకరన్‌ ఎక్కువేమీ కాదని జయకుమార్ అన్నారు. నల్లధనాన్ని విచ్చలవిడిగా పంచి టీటీవీ దినకరన్‌ విజయం సాధించారరని ఆయన ఆరోపించారు.. స్టాలిన్‌ కూడా అదే చెప్పారని, దినకరన్‌ విజయం తమపై ఎలాంటి ప్రభావం చూపదని ఆయన అన్నారు. 30 ఏళ్లు జయలలిత పక్కన ఉండి మోసం చేశారని వ్యాఖ్యానించారు.

దినకరన్ స్లీపర్ సెల్స్...

దినకరన్ స్లీపర్ సెల్స్...

తమకు స్లీపర్ సెల్స్ ఉన్నారని, మూడు నెలల్లో ఓపిఎస్-ఈపిఎస్ ప్రభుత్వం పడిపోతుందని దినకరన్ చేసిన వ్యాఖ్యను ఆషామాషీగా కొట్టేయడానికి వీలు లేదని అంటున్నారు. ప్రస్తుతానికి దినకరన్‌కు 18 మంది శాసనసభ్యుల మద్దతు ఉందని ప్రచారం జరుగుతోంది. ఇటువంటి స్థితిలో దినకరన్ తన వ్యూహానికి పదును పెట్టి ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నాలు చేయరని అనుకోవడానికి ఏమీ లేదు. అందువల్ల తమిళనాట మళ్లీ సంక్షోభం తప్పదనే ప్రచారం సాగుతోంది.

English summary
Sasikala was happy with Dinakaran's voctory in RK Nagar by elections with big majority.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X