వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సొంతగడ్డపై ట్రంప్‌పై సత్య నాదెళ్ల నిప్పు: ఇలా...

అమెరికా ఇమ్మిగ్రేషన్ పాలసీతో తాను లబ్ధి పొందానని చెబుతూనే సత్య నాదెళ్ల ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలిసీపై నిప్పులు చెరిగారు. ఒంటరిగా ఏ దేశం కూడా మనుగడ సాగించలేదని అన్నారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

ముంబై: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ వలసవాదులపై నిషేధం విధించడడం మీద మైక్రోసాఫ్ట్ బాస్ సత్య నాదెళ్ల మరోసారి విరుచుకుపడ్డారు. అమెరికా వలసవాదుల దేశమని, విదేశీయులపై నిషేధం విధించడం సరి కాదని ఆయన అన్నారు. ఏకాకిగా ఏ దేశం కూడా ఉండలేదని ఆన అన్నారు.

అమెరికా విలువలను మైక్రోసాఫ్ట్ ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుందని కూడా ఆయన చెప్పారు. దేశీయ అతి పెద్ద డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ ఈవెంట్ ఫ్యూచర్ దడీకోడెడ్ 2017 సందర్భంగా ఆయన మాట్లాడారు. వలసవాదుల పట్ల ట్రంప్ అనుసరిస్తున్న వైఖరిపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు.

Satya Nadella opposes Trump policies

అమెరికా ఇమ్మిగ్రేషన్ పాలసీతో తాను లబ్ధి పొందానని, ఒంటరిగా ఏ దేశం కూడా మనుగడ సాగించలేదని తాను నమ్ముతున్నానని ఆయన అన్నారు. ఇండియన్ మార్కెట్ కోసం కొత్త స్కైప్ లైట్ యాప్‌ను ఆవిష్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని చెప్పారు.

తక్కువ బ్యాండ్ విడ్త్‌లో కూడా మెసేజింగ్, ఆడియో, వీడియో కాలింగ్ సదుపాయాలను ఇది కల్పిస్తుందని చెప్పారు. గుజరాతి, బెంగాళీ, హిందీ, మరాఠీ, తమిళ, తెలుగు భాషలను సపోర్ట్ చేస్తూ ఈ యాప్‌ను విడుదల చేశార. దేశంలో మైక్రోసాఫ్ట్ ఎక్కువగా పెట్టుబడులు పెడుతుందని, ఇప్పటికే మూడు డేటా సెంటర్లు తమకు ఉన్నయని ఆయనయ చెప్పారు.

English summary
Microsoft boss Satya Nadella opposed US president Donald Trump's immigration policies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X