వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండు లక్షలు డిపాజిట్ చేసిన ఖాతాలపై కూడ ఐటి శాఖ కన్ను, ఆధార్ తో ఖాతాలకు లింకు

పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం చర్యలు తీసుకొంటుంది. నవంబర్ 8వ, తర్వాత రెండులక్షలకు పైగా ఖాతాల్లో జమ చేసిన నగదుపై పరిశీలన చేస్తోంది. ప్రతి సేవింగ్స్ ఖాతాను ఆదార్ తో లి

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై :పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత బ్యాంకు లావాదేవీలను కేంద్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తోంది. అనుమానాస్పదంగా ఉన్న ఖాతాలను ఆదాయపన్ను శాఖాధికారులు పరిశీలిస్తున్నారు. రెండు లక్షలకు పైగా డిపాజిట్లు చేసిన ఖాతాలపై ఆరా తీస్తున్నారు. సేవింగ్స్ బ్యాంకు ఖాతాలను ఆధార్ తో అనుసంధానం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది.

దేశంలో నల్లధనాన్ని నిర్మూలించేందుకుగాను నగదు రహిత విధానాన్ని కేంద్రం ప్రోత్సహిస్తోంది. పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత నల్ల ధనాన్ని మార్చుకొనేందుకు అక్రమార్కులు తమకు తోచిన మార్గాల్లో డబ్బు మార్పిడి కోసం ప్రయత్నించారు.ఒక్కొక్కటిగా ఈ ఘటనలు వెలుగుచూస్తున్నాయి.

నల్లధనాన్ని మార్చుకొనేందుక బ్యాంకు అధికారుల సహయంతో కొందరు ప్రయత్నించిన ఘటనలు వెలుగుచూశాయి. అయితే చాల కాలంగా ఎలాంటి లావాదేవీలు లేని ఖాతాల్లో పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత పెద్ద ఎత్తున నగదు జమ అవుతున్న విషయాన్ని కూడ అధికారులు గుర్తించారు.

నల్ల ధనాన్ని మార్చుకొనేందుకు అక్రమార్కులు వక్రమార్గాల్లో పయనించారు. అయితే ఈ మార్గాలను కనిపెట్టిన ఆదాయపు పన్నుశాఖాధికారులు అక్రమార్కులపై చర్యలు తీసుకొనేందుకు రంగం సిద్దం చేస్తోంది. దరిమిలా పన్నులు ఎగవేయకుండా జాగ్రత్తలు తీసుకొంటుంది.

రెండు లక్షలు దాటితే ఆదాయపు పన్ను శాఖ కన్ను

రెండు లక్షలు దాటితే ఆదాయపు పన్ను శాఖ కన్ను

పెద్ద నగదు రద్దు తర్వాత ఆయా బ్యాంకు ఖాతాల్లో ఏ మేరకు ఎక్కువ మొత్తంలో నగదు జమ అయిందనే విషయాన్ని ఆదాయపు పన్ను శాఖాధికారులు పరిశీలిస్తున్నారు. అయితే రెండున్నరలక్షలకు పైగా డిపాజిట్లు చేస్తేనే ఆయా ఖాతాలపై ఆదాయపు పన్ను శాఖాధికారులు దృష్టిని కేంద్రీకరిస్తారనే ఆలోచనను వదిలేయండి. అనుమానం వచ్చిన ప్రతి ఖాతాను ఆదాయపు పన్నుశాఖాధికారులు తనిఖీ చేస్తున్నారు. రెండు లక్షలను డిపాజిట్ చేసిన ఖాతాలపై కూడ ఆదాయపు పన్నుశాఖాధికారులు వదలడం లేదు. ఈ ఖాతాలను కూడ పరిశీలిస్తున్నారు. ఏ ఖాతాలో ఎంత మొత్తం నగదు జమ అయింది. నవంబర్ 8కి ముందు ఎంత ఉంది, తర్వాత ఎంత ఉందనే విషయాలను ఐటిశాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.పెద్ద మొత్తంలో నగదును జమ చేసిన ఖాతాల సమాచారం బ్యాంకుల నుండి నేరుగా ఐటిశాఖకు చేరుతోంది.

ఆధారాలు చూపకపోతే జరిమానా చెల్లించాల్సిందే

ఆధారాలు చూపకపోతే జరిమానా చెల్లించాల్సిందే


పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన నగదు భారీగా ఉంటే, ఆ నగదుకు సంబంధించిన ఆధారాలను మాత్రం తప్పక చూపించాల్సిందే. ఈ ఆధారాలను చూపించకపోతే జరిమానాను కట్టాల్సిందే.చాలాకాలంగా ఎలాంటి లావాదేవీలు లేని బ్యాంకుఖాతాలు, అసలు చిల్లిగవ్వ కూడ లేని ఖాతాల్లో పెద్ద ఎత్తున నగదు జమ అవుతోందని ఆదాయపు పన్నుశాఖాధికారులు గుర్తించారు. మరో వైపు జన్ ధన్ లాంటి ఖాతాల్లో కూడ పెద్ద నగదు జమ అవుతున్న విషయాన్ని కూడ అధికారులు గుర్తించారు. రెండు వారాల్లో జన్ ధన్ ఖాతాల్లో సుమారు 27 వేల కోట్ల రూపాయాలు జమ అయ్యాయి. ఇలాంటి ఖాతాలను నల్లధనం మార్పిడి కోసం వాడుకొంటున్నట్టుగా ఆదాయపు పన్ను శాఖాధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఖాతాలపై చర్యలు తీసుకొనే అవకాశం ఉంది.

సేవింగ్స్ ఖాతాలను ఆధార్ తో అనుసంధానం

సేవింగ్స్ ఖాతాలను ఆధార్ తో అనుసంధానం


సేవింగ్స్ ఖాతాలను కూడ ఆధార్ తో అనుసంధానించాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది. నగదు రహిత లావాదేవీల కోసం బ్యాంకు ఖాతాలను నగదు రహిత లావాదేవీల కొసం ఆధార్ తో అనుసంధానం చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి స్మార్ట్ పోన్ లేకపోతే ఆధార్ నెంబర్ ఆధారంగా నగదు రహిత లావాదేవీలను జరిపేందుకు కేంద్రం ఈ రకమైన నిర్ణయం తీసుకొంది.దేశంలో సుమారు 112 కోట్ల బ్యాంకు ఖాతాలుంటే, వీటిలో సుమారు 40 కోట్ల ఖాతాలు మాత్రమే ఆధార్ తో లింకు చేసి ఉన్నాయి. మిగిలిన ఖాతాలను కూడ ఆదార్ తో లింక్ చేయనున్నారు.దీని ద్వారా నిరక్షరాస్యులు వేలిముద్రల ద్వారా లావాదేవీలను నిర్వహించుకొనే వెసులుబాటు ఉంటుంది.

కొత్త ఏడాదికి తీరనున్న కరెన్సీ కష్టాలు

కొత్త ఏడాదికి తీరనున్న కరెన్సీ కష్టాలు

కొత్త సంవత్సరంలో కరెన్సీ కష్టాలు తీరే అవకాశం ఉందని ఆర్థికశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. 2017 జనవరి నాటికి కరెన్సీ కష్టాలు బాగా తగ్గిపోయే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రద్దైన కరెన్సీలో సుమారు 50 శాతం కరెన్సీ చలామణిలోకి తీసుకురావడం ద్వారా కరెన్సీ కష్టాలు తగ్గిపోయే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఫోస్ యంత్రాలను ప్రవేశపెడితే పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉందని మరికొందరు అధికారులు అభిప్రాయంతో ఉన్నారు.

English summary
more than 2 lakh rupees deposit amount in acconts income tax department enquiry about the accounts said bank officers.no transaction for long time some acconts,after demonetasion that acconts lakhs of rupees deposited, and jandhan accounts also.every savings accont link with aadhar for rural people cahsless transactions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X