వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవార్డులు: మెలికపెట్టిన కమల్ హాసన్, టార్గెట్ మోడీ!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారత్‌లో మత అసహనం పెరిగిందంటూ పలువురు సాహితీవేత్తలు, ప్రముఖులు అవార్డులను వెనక్కి ఇచ్చారు, ఇస్తున్నారు. మత అసహనం సరికాదని చెబుతున్న మరికొందరు సినీ ప్రముఖులు అవార్డులు వెనక్కి ఇవ్వమని చెబుతున్నారు.

తాజాగా, కమల్ హాసన్ మంగళవారం నాడు ఆసక్తికర వ్యాఖ్య చేశారు. అవార్డులు తిరిగి ఇవ్వడం సులభమేనని, కానీ డబ్బులు ఇవ్వలేం కదా అని నవ్వుతూ చెప్పారు. అవార్డులను తిరిగి ఇచ్చేవారు డబ్బును కూడా తిరిగి ఇచ్చేయాలని వ్యాఖ్యానించారు.

మంగళవారం ఆయన హైదరాబాదులో విలేకరులతో మాట్లాడారు. అవార్డులు వెనక్కిచ్చే వారు డబ్బులు కూడా ఇస్తే వారి పైన గౌరవం పెరుగుతుందని చెప్పారు. అవార్డులు కళాకారుల ప్రతిభకు ప్రతీకలని, మన పైన గౌరవంతో ఇచ్చిన పురస్కారాలు తిరిగి ఇచ్చేయడం సబబు కాదన్నారు. తాను వెనక్కి ఇవ్వనని చెప్పారు.

తాను ఎందుకు ఇవ్వనో కారణం కూడా చెప్పారు. అవార్డు ఎంపిక ప్రక్రియ విభిన్న నేపథ్యమున్నన వ్యక్తులు, సంస్థల చేతులలో ఉంటుందని, వాటితో సంబంధం లేని ఏవో కొన్ని రాజకీయ సంస్థలు తప్పులు చేస్తున్నారని తిరిగి ఇచ్చేయడం సరికాదని, నిరసన చెప్పేందుకు చాలా మార్గాలున్నాయన్నారు.

అదే సమయంలో బాలీవుడ్ అగ్ర నటుడు షారుక్ ఖాన్ కూడా అవార్డులు తిరిగి ఇవ్వనని అభిప్రాయపడ్డారు. ప్రముఖ నటి శోభన, విద్యాబాలన్‌లు చాలా రోజుల క్రితమే తాను అవార్డును వెనక్కి ఇవ్వనని చెప్పారు.

 scholars return awards to demand free speech

ప్రధాని మోడీ ప్రభుత్వం వచ్చాక దేశంలో మత అసహనం పెరిగిందంటూ చాలామంది ఇప్పటి వరకు అవార్డులను వెనక్కి ఇచ్చారు. అయితే, అవార్డులు వెనక్కి ఇవ్వడాన్ని బిజెపి నేతలతో పాటు పలువురు తప్పుపడుతున్నారు. మోడీని ప్రధానిగా, బిజెపిని అధికారంలో చూడలేని వారు ఇలా చేస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు.

1975లో ఎమర్జెన్సీ విధించినప్పుడు, 1984లో సిక్కులను ఊచకోత కోచినప్పుడు, ఆ తర్వాత కాశ్మీర్ పండిట్లను చంపేసినప్పుడు, జమ్ము కాశ్మీర్‌లో సిక్కులను చంపినప్పుడు, యూపీఏ హయాంలోను జరిగిన మత ఘర్షణల సమయంలో ఎవరు కూడా అవార్డులు ఎందుకు వెనక్కి ఇవ్వలేదని బిజెపి నిలదీస్తోంది.

ఇప్పుడు మోడీ అధికారంలోకి వచ్చినప్పుడే ఇలా జరగడం రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నారు. అవార్డును వెనక్కి ఇచ్చిన వారిలో తొలి వ్యక్తి నెహ్రూ కోడలు అని గుర్తు చేస్తున్నారు. అలాగే, అవార్డులు వెనక్కి ఇచ్చిన వారిలో కొందరు గతంలో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చేశారని, వామపక్ష-కాంగ్రెస్ సానుభూతిపరులు ఉన్నారని చెబుతున్నారు.

English summary
Indian scholars return awards to demand free speech.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X