• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ముష్కిల్ హై: షబానా ఫైర్, అజయ్ విచారం

By Pratap
|

ముంబయి: యురి ఘటన నేపథ్యంలో పాకిస్తాన్, భారతదేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీని ప్రభావం బాలీవుడ్‌పై కూడా పడింది. పాకిస్తాన్ ఆర్టిస్టుల పనిచేసిన సినిమాలను ఆడనివ్వబోమంటూ మహారాష్ట్ర నవ నిర్మాణ సంస్థ (ఎంఎన్ఎస్) హెచ్చరించడంతో దర్శక-నిర్మాత కరణ్‌ జోహార్‌ తెరకెక్కించిన 'యే దిల్‌ హై ముష్కిల్‌' చిత్రానికి అవాంతరాలు వచ్చాయి.

అయితే ఆ ఆటంకాలను అధిగమించి చిత్రం శుక్రవారం విడుదలకు సిద్ధమైంది. కరణ్ జోహర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి పడ్నవీస్ సమక్షంలో చర్చలు జరిపి చిత్రం విడుదలకు మార్గం సుగమం చేసుకున్నారు. ఇక ముందు తన సినిమాల్లోకి పాక్ ఆర్టిస్టులను తీసుకోబోనని ఆయన చెప్పారు.

ఆ చిత్రం విడుదలకు ఏర్పడిన ఆటంకాలపై, సినిమా రంగంలోకి రాజకీయాలు ప్రవేశించడంపై బాలీవుడ్ ఆర్టిస్టులు స్పందిస్తున్నారు. రాజకీయ నాయకులు మాత్రం బాలీవుడ్‌పై ఆ ఆంక్షలు పెట్టడానికే ముందుకు వస్తున్నారు.

 కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.

కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.

ఎంఎన్ఎస్ హెచ్చరిక విషయాన్ని హే దిల్ హై ముష్కిల్ చిత్ర నిర్మాతలు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఏ ఆటంకాలూ లేకుండా విడుదలయ్యేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.

 ఫడ్నవీస్ సమక్షంలో చర్చలు

ఫడ్నవీస్ సమక్షంలో చర్చలు

యే దిల్ హై ముష్కిల్ చిత్ర నిర్మాతలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా ఆర్మీ వెల్‌ఫేర్‌ ఫండ్‌ కింద కరణ్‌ రూ.5 కోట్లు ఇవ్వాలని ఎమ్‌ఎన్‌ఎస్‌ పార్టీ షరతు విధించింది. ఈ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వ తీరుపై పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు మండిపడ్డారు.

సిఎంపై షబానా ఆజ్మీ మండిపాటు

సిఎంపై షబానా ఆజ్మీ మండిపాటు

ఎమ్‌ఎన్‌ఎస్‌ పార్టీ నేతలు ఒక్కోసారి ఒక్కోరకంగా మాట్లాడుతుంటారని, కానీ సీఎం ఫడ్నవీస్ సినిమాకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విడుదల చేయించాల్సిందిపోయి ఇద్దరి మధ్య రూ.5 కోట్ల బ్రోకరింగ్‌ డీల్‌ కుదర్చడం సబుబుగా లేదని తాజాగా అలనాటి నటి షబానా అజ్మీ అన్నారు.

 ఫడ్నవీస్ బ్రోకరింగ్ చేశారు..

ఫడ్నవీస్ బ్రోకరింగ్ చేశారు..

హోంమంత్రి రాజ్‌నాథ్‌ సినిమా విడుదలకు హామీ ఇచ్చినప్పుడు ఫడ్నవీస్ దేశభక్తిని రూ.5 కోట్లకు కొనుక్కుంటున్నారని షబానా అన్నారు. బిజెపి వెంటనే ఆయనకు బుద్ధి చెప్పాలని, తాను భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నానని, కానీ రాజ్‌థాక్రే అలా లేరని షబానా అన్నారు.

 చాలా మంది భారత నటులు అలా...

చాలా మంది భారత నటులు అలా...

యురీ ఘటన అనంతరం పాకిస్థాన్‌ కళాకారులు నటించిన చిత్రాలను విడుదల కానివ్వమంటూ మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన ప్రకటించిన నేపథ్యంలో పలువురు పాకిస్థాన్‌ నటులతో ఇకపై పనిచేయమంటూ బాలీవుడ్‌ ప్రముఖులు ప్రకటించారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో నెలకొన్న ఈ పరిస్థితులపై అజయ్‌ దేవ్‌గన్‌ స్పందించారు.

అజయ్ దేవగన్ విచారం ఇలా...

అజయ్ దేవగన్ విచారం ఇలా...

సినీ పరిశ్రమలో ఎప్పుడూ మతపరంగా ఎలాంటి వివాదాలు లేవని, ఇక్కడ హిందూ, ముస్లిం, పార్శీ, క్రిస్టియన్‌ తదితర మతాల వాళ్లున్నామని, అందరం కలిసి పనిచేస్తున్నామని, అన్ని పండగలను జరుపుకుంటున్నామని, తమ మధ్య ఎప్పుడూ విభేదాలు తలెత్తలేదని బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ అన్నారు.

అజయ్ దేవగన్ విచారం..

అజయ్ దేవగన్ విచారం ఇలా...

సినీ పరిశ్రమలో ఎప్పుడూ మతపరంగా ఎలాంటి వివాదాలు లేవని, ఇక్కడ హిందూ, ముస్లిం, పార్శీ, క్రిస్టియన్‌ తదితర మతాల వాళ్లున్నామని, అందరం కలిసి పనిచేస్తున్నామని, అన్ని పండగలను జరుపుకుంటున్నామని, తమ మధ్య ఎప్పుడూ విభేదాలు తలెత్తలేదని బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ అన్నారు.

 బయటి వ్యక్తుల వల్లనే ఈ స్థితి...

బయటి వ్యక్తుల వల్లనే ఈ స్థితి...

పరిశ్రమలో బయటి వ్యక్తులు తలదూర్చడం వల్లనే సమస్యలు వస్తున్నాయని, చిత్ర పరిశ్రమకి చెందిన ఎవరైనా ఓ వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడితే చాలు వాళ్ల సినిమాలను అడ్డుకుంటున్నారని, దీంతో తాము భయపడుతున్నామని, ఇండస్ట్రీపై రాజకీయాలు చేయడం మమ్మల్ని బాధిస్తున్నాయని ఆయన అన్నారు.

యురి ఘటన నేపథ్యంలో పాకిస్తాన్, భారతదేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీని ప్రభావం బాలీవుడ్‌పై కూడా పడింది. పాకిస్తాన్ ఆర్టిస్టుల పనిచేసిన సినిమాలను ఆడనివ్వబోమంటూ మహారాష్ట్ర నవ నిర్మాణ సంస్థ (ఎంఎన్ఎస్) హెచ్చరించడంతో దర్శక-నిర్మాత కరణ్‌ జోహార్‌ తెరకెక్కించిన ‘యే దిల్‌ హై ముష్కిల్‌' చిత్రానికి అవాంతరాలు వచ్చాయి.

 దానికి కట్టుబడి ఉంటా...

దానికి కట్టుబడి ఉంటా...

దేశభక్తి పరంగా చూసినపుడు పాక్ ఆర్టిస్టులతో పనిచేయకూడదనే దాన్ని తాను సమర్థిస్తానని, కానీ ఎప్పుడైతే దీన్ని రాజకీయం చేస్తున్నారో అప్పుడు బాధపడుతున్నామని, ఇప్పటివరకు తాను పాకిస్థాన్‌ నటులతో కలిసి పనిచేశానని, కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా తాము దేశానికి మద్దతుగా నిలబడాల్సిన అవసరముందని, అందుకే ఈ సమస్య సద్దుమణిగే వరకు పాకిస్థాన్‌ నటులతో నటించనని అజయ్ దేవగన్ అన్నారు.

English summary
A day after Maharashtra chief minister Devendra Fadnavis brokered peace between MNS chief Raj Thackeray and filmmaker Karan Johar over the release of Ae Dil Hai Mushkil, actor Shabana Azmi has slammed his actions in a series of tweets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X