వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెచ్చిన కోహ్లీ: సిగ్గు సిగ్గు.. అనుష్క త్యాగానికి థ్యాంక్స్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇటీవల దూకుడుగా ఆడుతున్నాడు. శనివారం నాడు భారత్ - పాక్ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ దంచి కొట్టాడు. మొదట యువరాజ్ సింగ్, ఆ తర్వాత ధోనీ సహకారంతో కోహ్లీ భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు.

ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మ పైన క్రికెట్ అభిమానులు తమదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. ఆమె దూరం అయినందువల్లే కోహ్లీ రెచ్చిపోయి ఆడుతున్నాడని, అందుకు ఆమెకు ధన్యవాదాలు అంటూ సామాజిక అనుసంధాన వేదికల్లో చురకలు వేస్తున్నారు.

Shameful! Twitter mocks Anushka as Kohli leads India to victory

భారత్ - పాక్ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ 37 బంతుల్లోనే 55 పరుగులు చేశాడు. భారత్ గెలుపు పైన పెద్ద ఎత్తున ట్విట్టర్లో అభిమానులు సందడి చేస్తున్నారు. అదే సమయంలో కొందరు అనుష్క శర్మ పైన సెటైర్లు వేస్తున్నారు. కొందరు ఆమెకు అనుకూలంగా కూడా మాట్లాడుతున్నారు.

Shameful! Twitter mocks Anushka as Kohli leads India to victory

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు ఇటీవల విడిపోయినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. గతంలో అనుష్క ఉన్నందువల్లే కోహ్లీ బాగా ఆడటం లేదని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు వారు దూరమయ్యారు. కోహ్లీ బాగా ఆడుతున్నాడు. దేశం కోసం త్యాగం చేసిన అనుష్కకు థ్యాంక్స్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. దీనిపై కొందరు మండిపడుతున్నారు. ఓ యువతిని (అనుష్క) అవమానించి విక్టరీని సెలబ్రేట్ చేసుకోవడం విడ్డూరమంటున్నారు.

కాగా, విరాట్ కోహ్లీకి మాజీ ప్రియురాలు అనుష్క నుంచి అభినందనల మెసేజ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. పాక్ పైన విజయం అనంతరం అనుష్క కంగ్రాచ్యులేషన్స్ చెబుతూ, ఓ స్వీట్ గెశ్చర్ పంపిందని 'బాలీవుడ్ లైఫ్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

English summary
Indian middle order's most trusted soldier Virat Kohli anchored a tricky chase to enable his side humble arch-rivals Pakistan by six wickets in a rain-curtailed World Twenty 20 group 2 tie at the packed Eden Gardens here on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X