వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరికొందరు సినీ స్టార్లకు నోటీసులు! పూరీ 'గుట్టు' విప్పిన శ్యామ్

డ్రగ్స్ కేసు విచారణలో వెలుగులోకి వస్తున్న అంశాల ఆధారంగా అవసరమైతే మరికొందరికి నోటీసులు జారీ చేస్తామని ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ గురువారం తెలిపారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: డ్రగ్స్ కేసు విచారణలో వెలుగులోకి వస్తున్న అంశాల ఆధారంగా అవసరమైతే మరికొందరికి నోటీసులు జారీ చేస్తామని ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ గురువారం తెలిపారు.

హైదరాబాద్ వదలొద్దు: శ్యాంకు సిట్, సహకరిస్తే సరే.. సినీస్టార్స్‌కు హెచ్చరికహైదరాబాద్ వదలొద్దు: శ్యాంకు సిట్, సహకరిస్తే సరే.. సినీస్టార్స్‌కు హెచ్చరిక

రెండోరోజు విచారణలో శ్యాం కే నాయుడు సహకరించారని చెప్పారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు కొనసాగుతున్నదని, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు. ఈ కేసులో పాత్ర ఉన్న ఎవర్నీ వదులబోమని చంద్రవదన్ స్పష్టం చేశారు.

విచారణ అంశాలు గోప్యంగా..

విచారణ అంశాలు గోప్యంగా..

కేసు దర్యాప్తు పారదర్శకంగా ఉంటుందన్న చంద్రవదన్ చెప్పారు. విచారణకు హాజరవుతున్న ప్రతి ఒక్కరూ సిట్‌కు సహకరించాలని తేల్చి చెప్పారు. దర్యాప్తులో వెలుగులోకి వస్తున్న అన్ని కోణాలను పరిశీలిస్తున్నామన్నారు. విచారణ ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేమని, అయితే, సాధ్యమైనమేరకు దర్యాప్తును వేగవంతం చేశామన్నారు. అంతటా గంభీర వాతావరణం నెలకొన్నదని చెప్పారు. విచారణ అంశాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

Recommended Video

Hyderabad Drugs Case : Puri Jagannadh interrogated for almost 10 hours by SIT
సిట్ అధికారుల ప్రశ్నలు ఇలా...

సిట్ అధికారుల ప్రశ్నలు ఇలా...

సిట్ కార్యాలయంలోకి విచారణకు వచ్చిన సిని తారలను సిసి కెమెరాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. లోపలకు వచ్చినప్పటి నుంచి డ్రగ్స్ పైన వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. డ్రగ్స్ దందా గురించి మీకు తెలిసింది చెప్పాలని, డ్రగ్ పెడ్లర్స్‌తో ఉన్న ఫోటోలు చూపిస్తూ.. ఆ పరిచయం గురించి చెప్పాలని, ఫోన్ సంభాషణలు తదితరాల వాటిపై ఆరా తీస్తున్నారు.

ఎవరెవరు ఎప్పుడంటే..

ఎవరెవరు ఎప్పుడంటే..

బుధవారం పూరీ జగన్నాథ్‌ను, గురువారం శ్యామ్ కె నాయుడును, శుక్రవారం సుబ్బరాజును విచారించారు. అనంతరం 24న నవదీప్‌ను, 25న చిన్నాను, 26న చార్మీని విచారించనున్నారు. చార్మీని కూడా సిట్ కార్యాలయంలోనే విచారించనున్నారని తెలుస్తోంది. రవితేజను 27న, నందును 28న, తనీష్‌ను 29న విచారించనున్నారు. ముమైత్ ఖాన్ తేదీ ఇంకా ఖరారు కాలేదు.

పూరీ గురించి షాకింగ్

పూరీ గురించి షాకింగ్

పూరీ జగన్నాథ్ స్వయంగా డ్రగ్స్ వాడటమేకాకుండా సినీ పరిశ్రమలో ఒక హీరోయిన్‌తోపాటు కొందరు ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేసేవారని శ్యాం కే నాయుడు సిట్ అధికారులకు చెప్పారని తెలుస్తోంది. ఈవెంట్లకు వచ్చేవారికి, ప్రముఖులను మచ్చిక చేసుకునేందుకు గుడ్‌విల్ కోసమే ఆయన డ్రగ్స్ అందించేవారని చెప్పారని తెలుస్తోంది.

అలా పీల్చుతారని..

అలా పీల్చుతారని..

ఈవెంట్, సీక్రెట్ పార్టీలు ఏర్పాటుచేసుకుని, ఎంపిక చేసిన వారిని ఆహ్వానించేవారని, వారంతా ఆనందోత్సాహాలతో గడిపేలా డ్రగ్స్ అందించేవారని శ్యామ్ కె నాయుడు చెప్పారని వార్తలు వస్తున్నాయి. డ్రగ్స్ వాడకం ఎలా ఉంటుందో పలు ఆసక్తికర సంగతులను చెప్పారని అంటున్నారు. కొంతమంది సిగరెట్లలో, మరికొందరు పౌడర్ పీల్చడంలో నిష్ణాతులని చెప్పారని సమాచారం. పూరీ డ్రగ్స్ తీసుకుంటుండగా తాను పలుమార్లు చూశానని చెప్పినట్లు తెలుస్తోంది.

English summary
The Special Investigation Team (SIT) probing the Hyderabad drug racket grilled Tollywood cinematographer Shyam K Naidu on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X