హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డ్రగ్స్ కేసు: హీరో రవితేజ ఓసారి కోపానికి వచ్చి, ఉద్రేకానికి లోనై...

డ్రగ్స్ కేసులో హీరో రవితేజను ఎక్సైజ్ సిట్ అధికారులు శుక్రవారం సుదీర్ఘంగా ప్రశ్నించారు. సిట్ అధికారులు వేసిన ప్రశ్నలకు కొన్నిసార్లు ఆయన ధీటుగా సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో హీరో రవితేజను ఎక్సైజ్ సిట్ అధికారులు శుక్రవారం సుదీర్ఘంగా ప్రశ్నించారు. సిట్ అధికారులు వేసిన ప్రశ్నలకు కొన్నిసార్లు ఆయన ధీటుగా సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం మీద విచారణలో ఆయనను అధికారులు ఉక్కిరి బిక్కిరి చేశారు.

డ్రగ్స్ వాడకం, అమ్మకం, డ్రగ్స్‌మాఫియాతో సంబంధాలపై ప్రశ్నిస్తూనే సిట్ అధికారులు - ఏడాదిలో మూడిళ్లు ఎలా కొన్నారని ప్రశ్నించారు. దాంతో రవితేజకు ఆగ్రహం ముంచుకొచ్చిందని సమాచారం. కేసు ఒక్కటైతే మరోటి అడుగుతున్నారని ఆయన కోపగించుకున్నారని తెలుస్తోంది.

ఇది పద్ధతి కాదని కూడా రవితేజ సిట్ అధికారులకు నిలదీసినట్లు సమాచారం. విచారణలో భాగంగానే ఏడాదిలో మూడిళ్లు ఎలా కొన్నారని అడిగామని వారు సమర్థించుకున్నట్లు సమాచారం. డ్రగ్స్ వ్యాపారంలో మీ పాత్ర ఏమైనా ఉందా? కూడా అడిగారని అంటున్నారు.

ఇలా ఉద్రేకానికి లోనై...

ఇలా ఉద్రేకానికి లోనై...

డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందా, ఎప్పటి నుంచి వాటిని తీసుకుంటున్నారు? ఎవరెవరితో తీసుకుంటున్నారు జాక్ ఈవెంట్లలో ఎపుడెప్పుడు పాల్గొన్నారు, అక్కడ డ్రగ్స్ సరఫరా చేసే వారా? అని సిట్ అధికారులు అడిగారని సమాచారం. ఆ ప్రశ్నలకు రవితేజ ఉద్రేకానికి లోనైనట్లు చెబుతున్నారు. డ్రగ్స్ అలవాటే లేనప్పుడు, ఇతరుల గురించి ఎందుకు అడుగుతారని సిట్ అధికారులను ఆయన ప్రశ్నించారు.

Recommended Video

Ravi Teja Refused to Give Blood Hair and Nail samples
క్రియేటివిటీ కోసమే...

క్రియేటివిటీ కోసమే...

క్రియేటివిటీ కోసమే బ్యాంకాక్‌, గోవా లాంటి ప్రాంతాలకు వెళ్తామని రవితేజ సిట్‌కు చెప్పాడని అంటున్నారు. డ్రగ్స్‌ కోసమే అక్కడికి వెళ్తున్నామనే ఆరోపణలు వాస్తవం లేదని, అదంతా అసత్య ప్రచారమని ఆయన చెప్పినట్లు సమాచారం. డ్రగ్స్‌ కేసు విచారణలో భాగంగా శుక్రవారం ఎక్సైజ్‌ సిట్‌ రవితేజను విచారించింది. ఉదయం 10.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు దాదాపు 9 గంటల పాటు విచారణ కొనసాగింది.

ముందుగా ఇలా...

ముందుగా ఇలా...

సినిమా రంగంలో ఆయన ప్రస్థానం గురించి సిట్ అధికారులు రవితేజను అడినట్లు తెలుస్తోంది.దర్శకుడు పూరి జగన్నాథ్‌తో ఉన్న అనుబంధం గురించి అడిగారు. డ్రగ్స్‌ అలవాటు ఉందా, డ్రగ్స్‌ ఎక్కడి నుంచి తెప్పించుకునేవారని ప్రశ్నించారు తనకు డ్రగ్స్‌, ఇతర ఏ చెడు అలవాట్లు లేవని హీరో సమాధానమిచ్చాడు. మీ ఫోన్‌ నెంబర్లు డ్రగ్స్‌ కేసు నిందితులు కెల్విన్‌, జీషన్‌ అలీ ఫోన్‌ కాల్‌డాటాలో ఎలా ఉన్నాయని అడిగారు. వారెవరో తనకు తెలియదని, వారి కాల్ డేటాలో తన నెంబర్ ఉంటే తప్పు తనది ఎలా అవుతుందని ఆయన అన్నట్లు తెలుస్తోంది.

బాగా తీయడానికి...

బాగా తీయడానికి...

బ్యాంకాక్‌, గోవాలకు వెళ్లి పార్టీలు చేసుకునేవారని, అక్కడ డ్రగ్స్‌ను వినియోగించేవారన్న సమాచారం ఉందని అధికారులు అన్నారు. సినిమాలను బాగా తీ యడానికి రకరకాల లొకేషన్స్‌కు వెళుతుంటామని చెప్పారని తెలుస్తోంది. కొన్ని ప్రదేశాలకు వెళితే గొప్ప ఆలోచనలు వస్తాయని, ఇలాంటి క్రియేటివిటీ కోసమే బ్యాంకాక్‌, గోవా తదితర ప్రాంతాలకు వెళ్తామని రవితేజ చెప్పారు. సినిమా షూటింగ్‌ కోసమే ఇతర ప్రాంతాలకు కలిసి వెళ్తుంటామని చెప్పాడు. అక్కడ ఎలాంటి పార్టీలు చేసుకుంటారని సిట్ అధికారులు ప్రశ్నించారు. యూనిట్‌ అంతా కలిసి చిన్నచిన్న పార్టీలు చేసుకుంటామని చెప్పాడు.

 డ్రైవర్ సంగతి తెలియదు...

డ్రైవర్ సంగతి తెలియదు...

పూరి జగన్నాథ్‌ తనకు డ్రగ్స్‌ ఇవ్వలేదని రవితేజ స్పష్టం చేసినట్లు సమాచారం. మీ డ్రైవర్‌ శ్రీనివాసరావుతోనే డ్రగ్స్‌ను తెప్పించుకుంటున్నారట అని అంటూ శ్రీనివాసరావుకు జీషన్‌ అలీ, కెల్విన్‌ పరిచయమే కదా అని సిట్ అధికారులు ప్రశ్నించారు. ఆ విషయం తనకు తెలియదని, తనకు శ్రీనివాసరావు ఎప్పుడూ డ్రగ్స్‌ తెచ్చివ్వలేదని రవితేజ స్పష్టం చేశాడు. తాము బిజీగా ఉన్నప్పుడు సెల్‌ ఫోన్లను డ్రైవర్‌కో, అసిస్టెంట్‌కో, పీఏకో ఇస్తుంటామని, వాళ్లు తన నెంబర్‌ నుంచి ఫోన్‌ చేసి ఉండవచ్చని అన్నాడు.

భరత్‌కు గంజాయి అలవాటు మాత్రమే...

భరత్‌కు గంజాయి అలవాటు మాత్రమే...

మీ తమ్ముడు భరత్‌కు డ్రగ్స్‌ అలవాటు ఉందా అని అధికారులు అడిగారు. భరత్‌కు గంజాయి అలవాటు ఉండవచ్చు గానీ కొకైన్‌ వంటి మత్తు పదార్థాల అలవాటు మాత్రం లేదని రవితేజ చెప్పాడు. పూరి జగన్నాథ్‌, చార్మి, ముమైత్‌ఖాన్‌, ఇతర సినీ ప్రముఖులకు డ్రగ్స్‌ అలవాటుందా అని ప్రశ్నిస్తే లేదని చెప్పాడు.

English summary
It is said that Ravi teja has expressed anguish at the questions posed by Excise SIT officials in Hyderabad drugs case
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X