హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పకడ్బందీ వ్యూహంతోనే: రవితేజ విచారణ తేదీని మార్చిన సిట్

టాలీవుడ్ సినీ నటుడు రవితేజ విషయంలో సిట్ అధికారులు ఏ రకమైన వ్యూహన్ని అనుసరిస్తున్నారనే విషయమై ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రవితేజ విచారణ తేదిని రెండుసార్లు మార్చారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టాలీవుడ్ సినీ నటుడు రవితేజ విషయంలో సిట్ అధికారులు ఏ రకమైన వ్యూహన్ని అనుసరిస్తున్నారనే విషయమై ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రవితేజ విచారణ తేదిని రెండుసార్లు మార్చారు.జూలై 28వ, తేదిన రవితేజను విచారించే అవకాశాలున్నాయి.

పర్సనల్ విషయాలు మీకెందుకు?: సిట్‌కు చార్మి కౌంటర్పర్సనల్ విషయాలు మీకెందుకు?: సిట్‌కు చార్మి కౌంటర్

డ్రగ్స్ కేసు విషయమై సిట్ అధికారులు సినీ ప్రముఖులను విచారిస్తున్నారు. రవితేజ విచారణతో తొలి విడత సినీ ప్రముఖుల విచారణ ముగిసే అవకాశం ఉంది.

టాలీవుడ్‌కు 'డ్రగ్స్' కష్టాలు: ఆ గంటే కీలకం, చార్జీషీట్‌లో ఎవరెవరు?టాలీవుడ్‌కు 'డ్రగ్స్' కష్టాలు: ఆ గంటే కీలకం, చార్జీషీట్‌లో ఎవరెవరు?

అయితే విచారణకు హజరైన సినీ ప్రముఖులు ఈ కేసులో కొత్త కొత్త పేర్లను వెల్లడిస్తున్నారని స్వయంగా ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. అయితే రవితేజ సోదరుడు గతంలో డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యారు.

విచారణ సందర్భంగా ఈ విషయాలపై కూడ సిట్ అధికారులు ప్రశ్నించే అవకాశాలు లేకపోలేదు. డ్రగ్స్‌తో సంబంధాల కారణంగానే రవితేజ సోదరులకు దూరంగా ఉంటున్నారనే ప్రచారం కూడ ఉంది.

రవితేజ విచారణ తేదీలు ఎందుకు మారాయి.

రవితేజ విచారణ తేదీలు ఎందుకు మారాయి.

మాస్ మహరాజ రవితేజను సిట్ అధికారులు విచారించే తేదీలు ఎందుకు మారిపోయాయనే చర్చ సాగుతోంది.ఇప్పటికి రెండు దఫాలు రవితేజ విచారణ తేదిలను మార్చారు.ఈ నెల 28వ,తేదిన రవితేజను విచారించే అవకాశాలున్నాయి. ఎందుకు ఈ తేదిలు మార్చారనే విషయాలపై స్పష్టత రాలేదు.మరోవైపు పకడ్బందీ వ్యూహంతోనే రవితేజ విచారణ తేదిని మార్చారనే ప్రచారం కూడ లేకపోలేదు. చార్మిని విచారించిన తర్వాత వచ్చే సమాచారం ఆదారంగానే రవితేజను విచారించాలని భావించి విచారణ తేదిలను మార్చారనే ప్రచారం కూడ లేకపోలేదు.

Recommended Video

Kajal Aggarwal, Raashi Khanna And Lavanya Tripathi Names In Drugs Scandal
భరత్ డ్రగ్స్ కేసు పై

భరత్ డ్రగ్స్ కేసు పై

రవితేజ సోదరుడు భరత్ గతంలో డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యాడు. ఈ ఘటన జరిగిన నాటినుండి ఆయనతో రవితేజ దూరంగా ఉంటున్నారని టాలీవుడ్ వర్గాల కథనం. అయితే సిట్ విచారణ సందర్భంగా ఈ విషయాలను కూడ ప్రస్తావించే అవకాశాలు లేకపోలేదని సమాచారం. అయితే కెల్విన్‌తో సంబంధాలపై రవితేజను ఆరాతీసే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు కెల్విన్ సమాచారాన్ని భరత్ ఫోన్‌ ద్వారానే సేకరించారని ప్రచారంలో ఉంది.ఈ విషయాలను కూడ ప్రస్తావించే అవకాశాలున్నట్టు ఎక్సైజ్ వర్గాలు అభిప్రాయంతో ఉన్నాయి.

పూరీ బ్యాచ్ సభ్యులే ఎక్కువ

పూరీ బ్యాచ్ సభ్యులే ఎక్కువ

ఇప్పటివరకు సిట్ విచారణకు హజరైనవారిలో దర్శకుడు పూరీ జగన్నాధ్ బ్యాచ్ సభ్యులే ఎక్కువగా ఉన్నారు. తొలుత విచారణకు పూరీ జగన్నాథ్ హజరయ్యారు. ఆయన తర్వాత వరుసగా టాలీవుడ్ సినీ నటులు విచారణకు హజరౌతున్నారు. విచారణ సమయంలో ఈ కేసుకు సంబంధించిన కీలక సమాచారాన్ని సిట్ అధికారులు రాబడుతున్నారు. తమ వద్ద ఉన్న సమాచారం ఆధారంగా విచారణకు హజరైన వారి నుండి కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు.

జీషాన్ కీలక సమాచారం ఆధారంగా

జీషాన్ కీలక సమాచారం ఆధారంగా

డ్రగ్స్ కేసులో కెల్విన్‌తో పాటు జీషాన్ కూడ కీలకసమాచారాన్ని ఇచ్చారని ఎక్సైజ్ వర్గాల కథనం జీషాన్ ద్వారా టాలీవుడ్‌లోని కొందరికి డ్రగ్స్ చేరాయని ప్రచారం సాగుతోంది. ఈ మేరకు జీషాన్ ఇచ్చిన సమాచారాన్ని రూఢీ చేసుకొనేందుకుగాను సినీ ప్రముఖులను విచారిస్తున్నారు. మరింత సమాచారాన్ని సేకరిస్తున్నారు.జీషాన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా చార్మిని విచారించిన తర్వాత రవితేజను విచారించాలని భావించినట్టు ప్రచారంలో ఉంది.

English summary
SIT officials will interrogate tollywood actor Ravi Teja in drug case on 28 july, 2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X