snapdeal aamir khan remarks bjp misleading intolerance debate అమీర్ ఖాన్ రిమార్క్స్ బిజెపి అసహనం స్నాప్‌డీల్
అమీర్‌ఖాన్ రగడ: 27నుంచి24వ ర్యాంక్‌కు స్నాప్‌డీల్
ముంబై: బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇటీవలి వరకు ఈ కామర్స్ బిజినెస్ సంస్థ స్నాప్‌డీల్‌కు ఇబ్బందులు తెచ్చింది. అయితే, అమీర్ ఖాన్ వివరణ ఇవ్వడం, ఆ తర్వాత స్నాప్‌డీల్ కూడా తమకు సంబంధం లేదని చెప్పిన నేపథ్యంలో ఆ సంస్థకు లాభం చేకూర్చింది.
తద్వారా మతఅసహనంపై అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు బీజేపీతో పాటు స్నాప్‌డీల్‌కు ఆలస్యంగానైనా లాభం చేకూర్చాయి. దేశంలో సాహితీవేత్తల అవార్డులు వెనక్కివ్వడం, గోమాంసం ఉదంతం, హిందూత్వ వ్యాఖ్యలతో బీహార్ ఎన్నికల పరాజయం బీజేపీ ప్రతిష్ఠను మసకబార్చాయి.
ఈ దశలో మత అసహనంపై అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు దేశంలోని హిందూత్వవాదులను ఏకతాటి పైకి తెచ్చాయి. చాలామంది బీజేపీకి అండగా నిలిచారు. కొందరు అమీర్ ఖాన్‌కు మద్దతిచ్చినప్పటికీ... ఎక్కువ మంది ఆయనను తప్పుబట్టారు.

అమీర్ ఖాన్ వ్యాఖ్యల నేపథ్యంలో... ఆయన అంబాసిడర్‌గా ఉన్న స్నాప్‌డీల్‌ను చాలామంది 'యాప్ వాపసీ' పేరుతో తమ మొబైల్స్ నుంచి తొలగించారు. దీంతో స్నాప్‌డీల్ వివరణ ఇచ్చింది. అమీర్ ఖాన్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని తెలిపింది.
తమ సంస్థకు అమీర్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్ మాత్రమే అని తెలిపింది. అమీర్ ఖాన్ వ్యాఖ్యలు, స్నాప్‌డీల్ వివరణ నేపథ్యంలో... స్నాప్‌డీల్ యాప్ 27వ స్థానం నుంచి ఐదు రోజుల్లో 24వ ర్యాంకుకు చేరుకుంది.