వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐపీఎల్ ఫైనల్: SRH Vs RCB, ఆసక్తికర విషయాలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 9వ ఎడిషన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ పైనల్లోకి అడుగు పెట్టింది. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ఫైనల్స్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో తలపడనుంది.

వార్నర్ వీరోచిత పోరు, యువీ ఫెయిల్: ఫైనల్లోకి హైదరాబాద్

ఫైనల్‌కు చేరాలంటే చావోరేవో తేల్చుకోవాల్సిన క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్‌ను చిత్తుచేసింది. గుజరాత్ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయిన రైజర్స్‌ మరో నాలుగు బంతులు మిగిలుండగానే ఛేదించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ 93 పరుగులు చేసి జట్టును పైనల్లోకి చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు.

sunrisers hyderabad

58 బంతులాడిన డేవిడ్ వార్నర్ 11 ఫోర్లు, 3 సిక్సర్లతో లయన్స్ బౌలర్లపై విరుచుపడి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో బిపుల్‌ శర్మ 11 బంతుల్లో 27 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్లు తలపడున్నాయి. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచినా అది రికార్డు అవుతుంది.

SRH Vs RCB జట్ల మధ్య ఆసక్తికర అంశాలు:

* ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫైనల్ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ ఆడటం ఇదే తొలిసారి

* గురువారం ఏబీ డివిలియర్స్ సాధించిన 79 పరుగులు, శుక్రవారం డేవిడ్ వార్నర్ సాధించిన 96 పరుగులే గుజరాత్ లయన్స్ జట్టుని ఫైనల్స్‌లోకి రాకుండా అడ్డుకున్నాయి.

* ఐపీఎల్ 9వ ఎడిషన్‌లో డేవిడ్ వార్నర్ మూడు సార్లు 75కు పైగా పరుగులు సాధించాడు. మూడు సార్లు కూడా 90కి పైగా పరుగులు సాధించడం విశేషం.

* ఐపీఎల్‌లో ఎక్కువ సార్లు 90కి పైగా పరుగులు చేసిన ఆటగాడిగా డేవిడ్ వార్నర్ చరిత్ర సృష్టించాడు. ఐదు సార్లు 90కి పైగా పరుగులు సాధించిన అన్ని మ్యాచ్‌ల్లో ఆ జట్టు విజయం సాధించింది.

* ఐపీఎల్ 9వ ఎడిషన్‌లో డేవిడ్ వార్నర్ 468 పరుగులు సాధించాడు. ఐపీఎల్ సీజన్‌లో ఒక బ్యాట్స్ మెన్ సాధించిన అత్యధిక పరుగులివే

* 700కి పైగా పరుగులు సాధించిన నాల్గవ ఆటగాడిగా డేవిర్ వార్నర్ చరిత్ర సృష్టించాడు. క్రిస్ గేల్ రెండు సార్లు ఈ రికార్డుని అధిగమించాడు.

* ఐపీఎల్‌లో టైటిల్ బరిలో హైదరాబాద్, బెంగుళూరు జట్లు తలపడటం ఇది రెండోసారి. 2009లో జరిగిన ఎడిషన్‌లో ఈ రెండు జట్ల తలపడ్డాయి. ఆ సమయంలో హైదరాబాద్ జట్టు పేరు డెక్కన్ ఛార్జర్స్. ఈ సీజన్‌లో డెక్కన్ ఛార్జర్స్ విజయం సాధించింది.

* మే 29 (ఆదివారం) జరగనున్న ఐపీఎల్ పైనల్ మ్యాచ్‌ బ్యాట్స్‌మెన్ Vs బౌలర్లుగా క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. రాయల్ ఛాలెంజర్స్ జట్టులో అద్భుతమైన బ్యాట్స్ మెన్లు ఉంటే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో అద్భుతమైన బౌలర్లు ఉన్నారని చెబుతున్నారు.

English summary
New Delhi, May 28: Sunrisers Hyderabad skipper David Warner smashed unbeaten 93 as he single-handedly led Sunrisers Hyderabad (SRH) into the Indian Premier League (IPL) 2016 final after securing a four wicket win over Gujarat Lions (GL) in the Qualifier 2, in New Delhi on Friday. (Match Scorecard)
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X