• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమ్మో! నిప్పుల వాన: తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

By Srinivas
|

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. గురువారం ఒక్కరోజే తెలుగు రాష్ట్రాల్లో 225 మంది మృతి చెందారు. తెలంగాణలో 147 మంది, ఏపీలో 78 మంది మృత్యువాత పడ్డారు. సూర్యాపేటలో అత్యధికంగా 47.5 డిగ్రీలు ఉంది.

మరో రెండు మూడు రోజులు ఈ ఎండ వేడి ఉంటుంది. హైదరాబాదులో శుక్రవారం నాడు భారీ ఉష్ఞోగ్రతలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ, వైద్యులు, విపత్తు నిర్వహణ శాఖ ప్రజలకు పలు సూచనలు చేస్తోంది. అప్రమత్తంగా ఉండాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను హెచ్చరించాయి.

 ఎండ - తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎండ - తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎండ వేడికి తోడు, వేడి గాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చిన్నారులు, వృద్ధులు పగటి సమయంలో ఇంటికే పరిమితం కావాలి.

 ఎండ - తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎండ - తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పెద్దవారు కూడా పని లేకుంటే ఇంటికే పరిమితం కావాలి. పిల్లలు క్రికెట్ వంటి ఆటలకు ప్రస్తుతానికి దూరంగా ఉండి, ఇంటి పట్టున ఉండాలి. ఇంటి వద్ద ఆటలు ఆడుకోవాలి.

 ఎండ - తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎండ - తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నిర్మాణ రంగ కార్మికులు, ఉపాధి కూలీలు ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న సమయంలో పని చేయవద్దు. ఉపాధి సమయం పనులు మార్చుకోవాలి.

 ఎండ - తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎండ - తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఉదయం, సాయంత్రానికి పనులను మార్చుకోవాలి. గొడుగు లేదా టోపీ లేకుండా ఎండలో తిరగవద్దు. నలుపు, ముదురు రంగు దుస్తులు వేసుకోవద్దు. తెలుపు రంగు లేదా పలుచని కాటన్ దుస్తులు ధరించాలి.

ఎండ - తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎండ - తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎండలో తిరిగినా, తిరగకపోయినా ఎక్కువగా నీటిని తాగాలి. ఎండలో నుండి వచ్చిన అయిదు నిమిషాల తర్వాత చల్లని నిమ్మకాయ రసం లేదా కొబ్బరి నీళ్లు తాగాలి. వీలైనంత వరకు నీడలోనే పని చేయాలి.

ఎండ - తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎండ - తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వడదెబ్బ బాధితులను ఫ్యాన్ లేదా ఏసీ రూంలోకి తరలించి చల్లటి నీటిలో ముంచి తడిగుడ్డతో శరీరాన్నితుడవాలి. వేడి నీటితో తుడవద్దు. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వచ్చేసరికి తడిగుడ్డతో తుడవాలి.

ఎండ - తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎండ - తీసుకోవాల్సిన జాగ్రత్తలు

శరీర ఉష్ణోగ్రత తగ్గకుంటే వైద్యులను సంప్రదించాలి. ఎండకాలంలో గొంతు, కళ్లు కూడా తడారిపోతాయి. కంటిలోని నీటి శాతం ఆవిరై డ్రై ఐస్‌గా మారుతాయి. సూర్యరశ్మి నేరుగా ముఖంపై తగలకుండా చూసుకోవాలి.

ఎండ - తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎండ - తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నీళ్లు, పాలు, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాల వంటివి తీసుకోవాలని వైద్యులు చెప్పారు. ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఇంటి పట్టునే ఉండాలి.

 ఎండ - తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎండ - తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఉప్పు కలిపిన మజ్జిగ లేదా గ్లూకోజ్ కలిపిన నీరు తాగాలి. బయటకు వెళ్లేటప్పుడు మంచినీరు ఎక్కువగా తీసుకోవాలి.

 ఎండ - తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎండ - తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తల తిరగడం వంటి సమస్యలు ఉంటే వెంటనే వైద్యుడిని కలవాలి. సూర్యకరిణాలు, వేడి గాలుల తాకిడికి గురి కాకుండా చూసుకోవాలి.

 ఎండ - తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎండ - తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎండలో నుండి వచ్చీ రాగానే తీపి పదార్థాలు, తేనె వంటి పదార్థాలు తీసుకోవద్దు. కాగా, మరో రెండు రోజుల పాటు రికార్ట్ స్థాయిలో ఉష్ణోగ్రత ఉంటున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Thirty-one people died due to sunstroke as north Telangana and parts of coastal Andhra Pradesh reeled under severe heat wave conditions on Wednesday with Nizamabad experiencing the hottest day at 46 degrees Celsius.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more