వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

7 రేస్ కోర్స్ రోడ్డు: కేసీఆర్ ప్రధానమంత్రి పదవిపై కన్నేశారా, చంద్రబాబుతో పోటీనా?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రధానమంత్రి పదవిపై కన్నేశారా? చంద్రబాబుతో పోటీ పడుతూ కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారా? అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఆదివారం కేసీఆర్ కేంద్రంపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయం తీసుకు వస్తామని, ప్రజలు మార్పు కోసం చూస్తున్నారని, కొందరితో ఇప్పటికే మాట్లాడామని, దేశానికి నాయకత్వాన్ని తెలంగాణ ఇస్తే గర్వపడాలని, తనకు అవకాశమిస్తే గర్వపడేలా చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కొత్త చర్చకు కేసీఆర్ వ్యాఖ్యలు

కొత్త చర్చకు కేసీఆర్ వ్యాఖ్యలు

ఆదివారం కేసీఆర్ మీడియా సమావేశంలో చెప్పిన తృతీయ కూటమి వ్యాఖ్యలు దేశ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. దేశవ్యాప్తంగా టీఆర్ఎస్ విధానాలకు దగ్గరగా ఉండే పార్టీలను కలుపుకుని థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు కృషి చేస్తానని, అందుకు తానే నాయకత్వం వహిస్తానని కేసీఆర్ వెల్లడించారు.. కేసీఆర్ మాటలను విశ్లేషిస్తే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఆయన మనసులోని కోరిక కనిపిస్తోందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మోడీ దెబ్బతో గుబులు, నిన్న బాబు, నేడు కేసీఆర్-స్టాలిన్ హెచ్చరిక: దండయాత్రకు చెక్మోడీ దెబ్బతో గుబులు, నిన్న బాబు, నేడు కేసీఆర్-స్టాలిన్ హెచ్చరిక: దండయాత్రకు చెక్

కేసీఆర్‌పై ఆసక్తికరం

కేసీఆర్‌పై ఆసక్తికరం

జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు నేను సిద్ధమేనని, సమీప భవిష్యత్తులో జాతీయ రాజకీయ పరిస్థితులు మారనున్నాయని, మార్పును తీసుకువచ్చే బాధ్యతను తన భుజాలపై వేసుకునేందుకు కూడా సిద్ధమని, మరో మూడు నాలుగేళ్లలో మార్పు వస్తుందని కేసీఆర్ చెప్పడంపై ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఆసక్తికర కథనం ఇచ్చింది.

జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ చేతికి ఆనాటి రూ.3 కోట్లు, టైంకు ఇచ్చిన మెగా బ్రదర్?జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ చేతికి ఆనాటి రూ.3 కోట్లు, టైంకు ఇచ్చిన మెగా బ్రదర్?

మోడీపై విమర్శల దాడి

మోడీపై విమర్శల దాడి

ఇటీవలి కాలంలో ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శల దాడిని కేసీఆర్ పెంచారని, ముఖ్యంగా రైతులకు మద్దతు ధర, రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర సాయం, విభజన హామీల అమలు తదితరాల్లో కేంద్రం వైఫల్యం చెందిందని వ్యాఖ్యానిస్తున్నారని ఆ పత్రిక పేర్కొంది. కేసీఆర్ ఇప్పటికే తమిళనాడులోని డీఎంకేతో పాటు సమాజ్ వాదీ పార్టీ, జేడీఎస్ తదితరాలతో చర్చిస్తున్నట్టు తెలుస్తోందని పేర్కొంది.

ఢిల్లీలోని 7 రేస్ కోర్సు రోడ్డుపై కన్నేశారా

ఢిల్లీలోని 7 రేస్ కోర్సు రోడ్డుపై కన్నేశారా


ఢిల్లీలోని 7 రేస్ కోర్స్ రోడ్డుపై కేసీఆర్ కన్నేశారా అని హెడ్డింగ్ పెట్టి.. ప్రధానమంత్రి పదవిని అలంకరించాలన్న కోరిక ఆయనలో ఉన్నట్లుగా కనిపిస్తోందని అభిప్రాయపడింది. తన ప్రత్యర్థి చంద్రబాబుతోనూ మాట్లాడతానని కేసీఆర్ చెప్పారని, కాలం కలిసి వస్తే తృతీయ కూటమిలోకి తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఆర్జేడీ వంటి పార్టీలు కూడా చేరే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది.

మరో ట్విస్ట్ చంద్రబాబు కంటే ముందుగా..

మరో ట్విస్ట్ చంద్రబాబు కంటే ముందుగా..


కేంద్రంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఏపీ టీడీపీ నేతలు ఇటీవల పలుమార్లు అవసరమైతే చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పుతారని, మరో ఫ్రంట్ కోసం ప్రయత్నాలు చేస్తారని బీజేపీకి హెచ్చరికలు జారీ చేశారు. చంద్రబాబుతో ప్రతి విషయంలో పోటీ పడినట్లుగా కనిపించే కేసీఆర్.. ఆ కోణంలోను బాబుతో పోటీ పడే ప్రయత్నం చేస్తున్నారా అనే చర్చ కూడా సాగుతోంది.

English summary
Chief Minister K Chandrasekhar Rao, who fought for Telangana Statehood not only by building on a massive people’s movement but also by winning the support of like-minded political parties across India, on Saturday said that he was ready to play a key role on national political landscape to spearhead an “initiative for change” to challenge the supremacy of the Centre in order to ensure every State got its due from Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X