హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్టార్టప్‌లు విఫలమైనా ఐఎస్బీ సర్టిఫికేట్! కెటిఆర్ చొరవ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: స్టార్టప్‌లను ప్రోత్సహిస్తామని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఎన్నోసార్లు చెప్పారు. స్టార్టప్‌లో కోసం తెలంగాణ టీ హబ్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. చాలామంది స్టార్టప్‌ల వైపు బాగా మొగ్గు చూపుతున్నారు.

అయితే, స్టార్టప్ విఫలమైతో ఎలా అనే భయాలు కూడా కొందరిలో ఉంటాయి. విఫలమైనప్పటికీ ఐఎస్బీ ద్వారా ఈఆర్ఐ సర్టిఫికెట్ జారీ చేయనున్నారట. ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారాక రామారావు చొరవతో ఇది సాధ్యమైంది.

స్టార్టప్‌‌లో విఫలమైతే... అనే పరిణామాలను ఎదుర్కొని యువతరం నిలబడేలా తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహించనుంది. స్టార్టప్‌లలో విఫలమైనా ముందుకుసాగేలా కొత్త అవకాశాలు దొరికేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్ ‌(ఐఎస్‌బీ)తో అవగాహన కుదుర్చుకుంది.

Telangana innovative experiment for startups

స్టార్టప్ కేంద్రంలో కష్టపడ్డా ఫలితం రానట్లయితే వారికి 'ఎంటర్‌ప్రెన్యూర్‌ ఇన్‌ రెసిడెన్స్‌' (ఈఐఆర్‌) అనే సర్టిఫికేట్‌ను ఐఎస్‌బీ ద్వారా ఇప్పించబోతున్నారు. ఈ సర్టిఫికెట్‌ వల్ల విఫలమైన వారికి ఉద్యోగాల్లో ఇబ్బంది కలగకుండా ఉండటమే కాకుండా, తర్వాతి స్టార్టప్‌ ఆరంభించటానికి కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది.

సర్టిఫికెట్‌ ఇవ్వటంతోనే సరిపెట్టకుండా వారికి మార్గదర్శనం కూడా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ చేయనుందని తెలుస్తోంది. మంత్రి కేటీఆర్‌ ఇటీవల ఐఎస్‌బీ కొత్త డీన్‌తో సమావేశమైనప్పుడు ఈ విషయంపై చర్చించారని తెలుస్తోంది. ప్రస్తుతం టీ హబ్‌లో చేసే వారికే ఇవి వర్తింప చేస్తారని తెలుస్తోంది.

మరో విషయమేమంటే... అలాగని స్టార్టప్‌ ఆరంభించి విఫలమైనవారందరికీ ఈ సర్టిఫికెట్‌ ఇవ్వరు. నిజంగా ఆలోచన అద్భుతంగా ఉండి, వారి ప్రయత్నాలు గట్టిగా ఉన్నాయని భావిస్తేనే ఇస్తారు. ఇందుకోసం స్టార్టప్‌లో ఆయా అభ్యర్థుల పనితీరుపై నిశిత పరిశీలన ఉంటుంది.

English summary
Telangana Government innovative experiment for startups.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X