వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్ వీడియో: భూమికి కన్నులా, కదిలే ద్వీపం!

|
Google Oneindia TeluguNews

అర్జెంటీనా: అదొక ద్వీపం. ఈ దీవి విస్తీర్ణం 130 గజాలు. దానిని చూస్తే భూమికి కన్నులా అనిపిస్తుంది. అంతేగాక, దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. అది మనిషి కన్నులాగే 360 డిగ్రీల్లో గగన తలాన్ని చూస్తున్నట్లు కనిపిస్తూ కదులుతూ ఉంటుంది. ఈశాన్య అర్జెంటీనాలోని పరానా డెల్టాలో ఈ 'ఐలాండ్‌ కన్ను' బయటపడింది.

సెర్జియో న్యూస్‌పిల్లరమ్‌.. అర్జెంటీనాకు చెందిన సినీ దర్శకనిర్మాత. ఆరునెలల క్రితం సినిమాకు కావాల్సిన లొకేషన్స్‌ కోసం వెతికే పనిలో పడ్డాడు. హార్రర్‌, గ్రహాంతరవాసుల కథా నేపథ్యానికి సరైన ప్రదేశం కోసం వెతుకుతున్న ఆ సినీ బృందానికి ఓ వింత ద్వీపం కంటపడింది.

‘The Eye’, a rotating island in Argentina

మొదట్లో ఆసక్తిగా ఉందని దానిపై కన్నేసి ఉంచారు. అయితే దాని కదలికలను గమనించిన తర్వాత ఆశ్చర్యపోయారు. ఏ ఐలాండ్‌లోనూ కనిపించని ఆ కదలికల రహస్యాన్ని బయటపెట్టేందుకు పరిశోధనలు ప్రారంభమయ్యాయి. భూగర్భ శాస్త్రవేత్తలు, స్కూబా డైవర్స్‌తో కలిసి అధ్యయనం చేశారు. పేరున్న శాస్త్రవేత్తలు అందరూ ఇలాంటి ద్వీపాన్ని ఇంతకు ముందెన్నడూ చూడలేదని నివ్వెరపోతున్నారు.

ఈ కన్ను ద్వీపం 130 యార్డుల విస్తీర్ణంతో ఉంది. దీనిలోని నీళ్లు చల్లగా క్రిస్టల్‌లా ఉంటాయి. కానీ లోపల మాత్రం నీరు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. దాని వల్లనే ద్వీపం కన్నులా అటు ఇటు చూస్తున్నట్లు అనిపిస్తుందేమో అని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

దానికి సంబంధించిన పూర్తి రహస్యాన్ని త్వరలోనే గుర్తిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గూగుల్‌ శాటిలైట్‌ మ్యాప్‌లో ఆ 'ఐలాండ్‌ ఐ' కదలికలను ఎవరైనా చూడొచ్చని చెబుతున్నారు.

English summary
We recently came across this article about a floating island in Argentina that rotates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X