వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘భారత అమ్మాయిలకే వలేస్తాడట-పాక్ వెపన్ ఈ నీలికళ్ల చాయ్‌వాలా! ’

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌కు చెందిన ఓ చాయ్‌వాలా సోషల్ మీడియాలో ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నాడు. పాకిస్థానీలే అతడి గురించి తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. నీలికళ్లతో ఉన్న అతన్ని పాకిస్థాన్‌ అణ్వాయుధమంటూ ఆ దేశ నెటిజన్లు పొగడ్తలతో ముంచెంతుకుంటున్నారు.

పాకిస్థాన్ ఆక్రమిత పాకిస్థాన్(పీఓకే)లో భారత్‌ సర్జికల్‌ దాడులకు ప్రతీకారంగా ఈ ఈ నీలికళ్ల కుర్రాడు భారతీయ అమ్మాయిలపై సర్జికల్‌ దాడులు చేస్తాడని, దెబ్బకు ఇరుదేశాల మధ్య సమీకరణాలు సమానం అయిపోతాయని పాక్ నెటిజన్లు హోరెత్తిస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్

సోషల్ మీడియాలో వైరల్

చాయ్‌ అమ్ముతున్న ఈ నీలికళ్ల వ్యక్తి ఫొటోను జావేరియా లేదా జియా అలీ అనే ఫొటోగ్రాఫర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్టు చేసింది. కాగా, ఈ ఫొటో వెంటనే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.

అనూహ్య స్పందన

అనూహ్య స్పందన

రెండు నెలల కిందట జరిగిన ఫొటోవాక్‌లో భాగంగా ఇస్లామాబాద్‌లోని ఇత్వార్‌ బజార్‌ ప్రాంతంలో ఈ ఫొటో తీశానని, దానిని ఇటీవల సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా, అనూహ్యమైన స్పందన వస్తోందని జియా అలీ మీడియాతో ఆనందం వ్యక్తం చేసింది. మరోసారి అతడ్ని కలిసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.

ట్రెండ్ అవుతున్నాడు

ట్రెండ్ అవుతున్నాడు

చాయ్‌వాలా ‘#ChaiWala' హ్యాష్‌ట్యాగ్‌తో ఈ ఫొటో ట్విట్టర్‌ పాకిస్థాన్‌ ట్రెండింగ్‌లో టాప్‌ స్థానంలో నిలిచింది. ఇండియన్‌ కాఫీ వాలా (కరణ్‌ జోహార్‌) కంటే పాక్‌ చాయ్‌వాలా బెటర్‌ అంటూ వెకిలి కామెంట్లు కూడా పెడుతున్నారు.

నెటిజన్ల పోరు

నెటిజన్ల పోరు

ఇప్పటి వరకు ఇరుదేశాల మధ్య ఉన్న ఘర్షణలే సోషల్‌ మీడియాలో టాప్‌ ట్రెండింగ్‌ అంశాలుగా ఉండగా.. అకస్మాత్తుగా తెరపైకి వచ్చిన ఈ పాక్‌ నీలికళ్ల చాయ్‌వాలా.. ఒక్కసారిగా వాతావరణాన్ని సరదాగా మార్చేశాడు. ఈ ఫొటోపై భారతీయ నెటిజన్లు కూడా సరదా వ్యాఖ్యలతో హోరెత్తిస్తున్నారు.

English summary
An Islamabad chaiwala, or tea seller, has become Pakistan's blue-eyed boy, with people on social media calling him Pak's "nuclear weapon" who could be unleashed for "surgical strikes on Indian girls."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X