బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇవాంక పర్యటన: బెంగళూరును దెబ్బ తీసిన హైదరాబాద్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జిఈఎస్) నిర్వహణకు బెంగళూరు కూడా పోటీ పడింది. అయితే, అమెరికా హైదరాబాద్ వైపే మొగ్గు చూపింది. ఆ రకంగా హైదరాబాద్ బెంగళూరును దెబ్బ తీసింది.

Recommended Video

GES 2017 : Hyderabad's First Citizen Not Invited | Oneindia Telugu

హైదరాబాద్‌లో జిఈఎస్ గురువారం ముగిసింది. ఈ సదస్సులో వివిద దేశాలకు చెందిన 1,500 మంది పాల్గొన్నారు. బెంగుళూరును కాకుండా హైదరాబాద్‌ను 8వ జిఈఎస్‌కు అమెరికా ఎందుకు ఎంపిక చేసుకుందనేది ఎవరికీ అర్థం కాని విషయం.

 అది భారత ప్రభుత్వ నిర్ణయం

అది భారత ప్రభుత్వ నిర్ణయం

అమెరికా అధికార యంత్రాంగంతో సంప్రదింపులు జరిపి జిఈఎస్‌ను తమ దేశంలో నిర్వహించడానికి భారత్ నిర్ణయం తీసుకుంది. ఈ సదస్సును భారతదేశంలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఏడు రాష్ట్రాలు అమెరికాను సంప్రదించాయి. అయితే, అన్నీ పరిశీలించిన తర్వాత హైదరాబాద్‌లో నిర్వహించాలని అమెరికా నిర్ణయం తీసుకుంది.

 హైదరాబాదును ఎంపిక ఎందుకు చేశారు..

హైదరాబాదును ఎంపిక ఎందుకు చేశారు..

హైదరాబాదులో అద్భుతమైన మౌలిక సదుపాయాలున్నాయని, విమానాశ్రయానికి మంచి రోడ్డు కనెక్టివిటీ ఉందని, 1130 అమెరికా కంపెనీలు ఇక్కడి నుంచి పనిచేస్తున్నాయని, శీతాకాలం మంచి వాతావరణం ఉంటుందని గుర్తించి జిఈఎస్ ఇక్కడ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

కలిసి వచ్చిన అమెరికా కాన్సులేట్...

కలిసి వచ్చిన అమెరికా కాన్సులేట్...

హైదరాబాదులో యుఎస్ కాన్సులేట్ ఉండడం కూడా కలిసి వచ్చింది. తమ సిబ్బంది హైదరాబాదులో ఉండడంతో జిఈఎస్ వంటి అతి పెద్ద కార్యక్రమాన్ని వారి సాయంతో నిర్వహించడం సులభమవుతుందని అమెరికా భావించింది. భారత పర్యావరణ పరిస్థితికి సదస్సులో పాల్గొన్న పారిశ్రామికవేత్తలు కూడా మురిసిపోయారు.

 హైదరాబాద్ వైపు మొగ్గు

హైదరాబాద్ వైపు మొగ్గు

హైదరాబాదులో జరిగిన జిఈఎస్ విజయవంతమైందని అమెరికా అధికారులు భావిస్తున్నారు. భారదేశంలోని వివిధ నగరాల్లో, ముఖ్యంగా హైదరాబాదులో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపుతున్నట్లు అమెరికా అధికారులు భావిస్తున్నారు. హైదరాబాదును జిఈఎస్ అందరికీ పరిచయం చేసిందని, ఇక్కడి అద్భుమైన స్టార్టప్ ఎకోసిస్టమ్ వల్ల చాలా మంది హైదరాబాదులో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు.

English summary
Most were unaware of the factors that favoured Hyderabad over Bengaluru, which had a bigger startup ecosystem than the former for GES.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X