వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెచ్1బీ వీసాలపై ఆంక్షలతో నో ప్రాబ్లం, కానీ...

భారతీయ ఐటీ నిపుణుల్లో ప్రారంభస్థాయి ప్రోగ్రామర్ల సంఖ్య చాలా తక్కువైనందున ట్రంప్ ప్రభుత్వ ఆదేశాలతో నష్టం లేదని, పైగా ఐటీ నిపుణులకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఐటీరంగ నిపుణులు చెప్తున్నారు.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రారంభస్థాయి కంప్యూటర్ ప్రోగ్రామర్ ఉద్యోగాలను ప్రత్యేక నైపుణ్య వృత్తిగా పరిగణించబోమని, తద్వారా ఆ ఉద్యోగాలకు హెచ్-1బీ వీసా అర్హత ఉండదని ట్రంప్ సర్కార్ తాజాగా ఆంక్షలు విధించింది. కానీ అమెరికాకు వెళ్తున్న భారతీయ ఐటీ నిపుణుల్లో ప్రారంభస్థాయి ప్రోగ్రామర్ల సంఖ్య చాలా తక్కువైనందున ట్రంప్ ప్రభుత్వ ఆదేశాలతో నష్టం లేదని, పైగా ఐటీ నిపుణులకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఐటీరంగ నిపుణులు చెప్తున్నారు.

హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న భారతీయ ఐటీ నిపుణుల్లో ప్రారంభస్థాయి కంప్యూటర్ ప్రోగ్రామర్ల సంఖ్య చాలా తక్కువ. మొత్తం సర్టిఫైడ్ నిపుణులతో పోలిస్తే 2014, 2015ల్లో హెచ్-1బీ వీసాకు అర్హత సాధించిన వృత్తినిపుణుల్లో కంప్యూటర్ ప్రోగ్రామర్లు 12 శాతమేనని రికార్డులు చెప్తున్నాయి.

సిస్టమ్ అనలిస్టులు, సాఫ్ట్‌వేర్ డెవలపర్స్, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్లు వంటి ఉన్నతస్థాయి ఉద్యోగులుగా చాలా మంది నిపుణులు హెచ్ 1 బీ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.

అత్యధిక దరఖాస్తులు వారివే..

అత్యధిక దరఖాస్తులు వారివే..

కంప్యూటర్ ప్రోగ్రామర్స్ విభాగంలో 41 శాతం మంది అతి తక్కువ వేతన స్థాయిలో దరఖాస్తు చేసుకుంటున్న వారు ఉన్నారు. వీరంతా రోజువారీ విధుల నిర్వహణతోపాటు స్వంతంగా నిర్ణయం తీసుకునే సామర్థ్యం కలిగి ఉంటారని అంటున్నారు. మనదేశంలోని ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కమ్ మాత్రం చాలా మంది తమ సభ్యులు ఉన్నతస్థాయి వృత్తుల కోసం అమెరికా వీసాలకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది. అమెరికాకు వెళ్లాలనుకునే భారతీయ ఐటీ నిపుణుల్లో ప్రారంభస్థాయి కంప్యూటర్ ప్రోగ్రామర్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య తక్కువగా ఉండటమేగాక అది క్రమంగా మరింత తగ్గుతున్నదని నాస్కమ్ పేర్కొంది.

భారతీయ కంపెనీలదే హవా

భారతీయ కంపెనీలదే హవా

ప్రత్యేక నైపుణ్యం ఉన్న ఉద్యోగాల్లో విదేశాలకు చెందిన వ్యక్తులను నియమించుకోవటానికి అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ వీసాలను చాలాకాలంగా మంజూరు చేస్తున్నది. వీటిని భారతీయ ఐటీ కంపెనీలు అత్యధికంగా ఉపయోగించుకుంటున్నాయి. తమ వినియోగదారులకు సంబంధించిన ప్రాజెక్టుల్లో పని చేయటం కోసం దీర్ఘకాలంపాటు అమెరికాలో పని చేయటానికి ఈ వీసాపైనే తమ ఉద్యోగులను పంపుతున్న సంస్థలు కొంత మందిని ముందు పంపిన తర్వాత కొంత సమయానికి శిక్షణ ఇస్తున్నారు.

కొత్త మార్గదర్శకాలు జారీచేసిన యూఎస్‌సీఐసీ

కొత్త మార్గదర్శకాలు జారీచేసిన యూఎస్‌సీఐసీ

ప్రారంభస్థాయి కంప్యూటర్ ప్రోగ్రామర్ ఉద్యోగాలను ప్రత్యేక నైపుణ్యం ఉన్న ఉద్యోగాలుగా గుర్తించలేమని పేర్కొంటూ అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎస్‌సీఐసీ) గతనెల 31న కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునే కంపెనీలు ఇకమీదట.. సదరు ఉద్యోగాలకు సంక్లిష్టమైన, ప్రత్యేకమైన నైపుణ్యాలు అవసరమని, ప్రొఫెషనల్ కోర్సులు చేసిన వారు అవసరమని నిరూపించుకోవాల్సి ఉంటుందని తెలిపింది. మరోవైపు, హెచ్-1బీ వీసాల ప్రక్రియను దుర్వినియోగం చేస్తూ అమెరికాలో స్థానికుల పట్ల వివక్ష చూపే కంపెనీలపై చర్యలు తీసుకుంటామని అమెరికా కార్మికశాఖ హెచ్చరించింది. అక్టోబర్ 1తో మొదలయ్యే అమెరికా నూతన ఆర్థికసంవత్సరానికి కొత్తగా హెచ్-1బీ వీసాలను ఆమోదించే ప్రక్రియ ప్రారంభమైనందున ప్రభుత్వం ఈ హెచ్చరికలను జారీ చేస్తున్నది.

రెట్టింపు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

రెట్టింపు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐసీ) జారీచేసిన మార్గదర్శకాలు భారత్ ఆధారిత ఐటీ కన్సల్టింగ్ సర్వీసు సంస్థలను లక్ష్యంగా పెట్టుకుని జారీ చేసినవే. ఇక నుంచి హెచ్ 1 బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునే కంప్యూటర్ ప్రోగ్రామర్లు ఇక రెట్టింపు జాగ్రత్తలు తీసుకోవాలని సైరస్ డి మెహతా అండ్ అసోసియేట్స్ మేనేజింట్ అటార్నీ అండ్ ఫౌండర్ సైరస్ డీ మెహతా పేర్కొన్నారు. ఇక రెండేళ్ల ఎంఎస్ డిగ్రీ ఎంతమాత్రం హెచ్ 1 బీ వీసా పొందేందుకు సరిపోదని వాషింగ్టన్ టెక్నాలజీ ఇండస్ట్రీ అసోసియేషన్ (డబ్ల్యూటీఐఏ) సీఈవో మిచేల్ స్కుటజ్లర్ తెలిపారు.

రికవరీ అనుమానమే

రికవరీ అనుమానమే

హెచ్ 1 బీ వీసాల జారీపై ఆంక్షలు విధించడంతో 2017 - 18లో రికవరీ సాధించడం సందేహమేనని ఐటీ ఇన్వెస్టర్లు చెప్తున్నారు. వచ్చే ఏడాది ఐటీ సంస్థల ప్రగతిపై అమెరికా ప్రభుత్వ ఆంక్షలు తీవ్రంగా ప్రభావం చూపుతాయని పేర్కొంటున్నారు. ట్రంప్ సర్కార్ ఆంక్షల వల్ల వేతనాలు 20 - 25 శాతం పెరుగుతాయని, ఇది ఐటీ రంగ లాభాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ‘నొమురా' రిసెర్చ్ పేర్కొంటున్నది. ఇతర ఖర్చులు కూడా పెరుగుతాయని ఫలితంగా ఆన్ సైట్ ఉద్యోగుల వినియోగం క్రమంగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. 2017లో ప్రగతి సింగిల్ డిజిట్‌కు పరిమితమై పోగా.. ఈ ఏడాది కొద్దిగా మెరుగు పడుతుందని అంచనా వేస్తున్నారు.

English summary
Accordig to experts - tougher H-1B norms will open doors for India's real talent to migrate to USA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X