వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిఆర్ఎస్‌కు తొలిషాక్ షాక్: జిహెచ్ఎంసిలో ఓటమి, కేటీఆర్ ఆసంతృప్తి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్ఎంసి) యూనియన్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)కి షాక్ తగిలింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, అధికారంలోకి వచ్చిన తర్వాత టిఆర్ఎస్‌కు ఇది తొలి దెబ్బ.

అనూహ్యంగా జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టిఆర్ఎస్‌కు యూనియన్ ఎన్నికల్లో ఓటమి ఎదురుకావడం కోలుకోలేని దెబ్బనే. ఇద్దరు మంత్రులు, ఓ శాసనసభ్యుడు, నాయకులు ప్రచారం చేసినప్పటికీ ఓటమి తప్పలేదు.

టిఆర్ఎస్‌పై ఇలా విజయం

టిఆర్ఎస్‌పై ఇలా విజయం

బిజెపి అనుబంధ సంస్థ భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ (బిఎంఈయ) టిఆర్ఎస్ అనుబంధ సంస్థ అిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ (జిహెచ్ఎఈయూ)ను 1,317 ఓట్ల తేడాతో ఓడించింది.

ఇలా ప్రచారం చేసినా..

ఇలా ప్రచారం చేసినా..

డిప్యూటీ సిఎం మొహమ్మద్ అలీ, మంత్రి నాయని నర్సింహా రెడ్డి, టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి, శాసనసభ్యుడు వి శ్రీనివాస్ గౌడ్, తదితర నేతలు ఈ ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేశారు. బిఎంఈయూ మాత్రం కొంత మంది స్థానిక బిజెపి నేతల సహకారం తీసుకుంది. జాతీయ స్థాయి నుంచి కూడా కొంత సాయం లభింంచింది.

టీఆర్ఎస్‌‌కు తొలి ఎదురుదెబ్బ

టీఆర్ఎస్‌‌కు తొలి ఎదురుదెబ్బ

2014 శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత టిఆర్ఎస్‌కు జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఓడిపోవడం తొలి ఎదురుదెబ్బ. శాసనసభ ఎన్నికల తర్వాత ఆర్టీసి, హైదరాబాదు మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సీవరెజ్ బోర్డు యూనియన్ల ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలిచింది. ఏడాది క్రితంం సింగరేణి యూనియన్ ఎన్నికల్లో కూడా విజయం సాధించింది.

ఉద్యమ కాలంలో గెలిచింది...

ఉద్యమ కాలంలో గెలిచింది...

రాష్ట్రం ఏర్పడక ముందు 2012 యూనియన్ ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయం సాధించింది. ఈ ఓటిమిపై మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాల పంపిణీ వంటి హామీలను అమలు చేయకపోవడం వల్ల ఓటమి పాలు కాకతప్పలేదని అన్నారు.

భారీ మెజారిటీ...

భారీ మెజారిటీ...

టిఆర్ఎస్ అనుబంధ జిహెచ్ఎీయూ 1,317 ఓట్ల భారీ మెజారిటీతో ఓడిపోయింది. మొత్తం 4,260 ఓట్లు పోలయ్యాయి. 2012 ఎన్నికల్లో జిహెచ్ఎంయు 12 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించి గుర్తింపు పొందింది.

English summary
The ruling TRS affiliated municipal workers’ union lost the prestigious Greater Hyderabad Municipal Corporation (GHMC) union polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X