వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాధే మా: లైవ్‌గా జ్యోతిష్కురాలు, బాబా డిష్యుం

By Pratap
|
Google Oneindia TeluguNews

ముంబై : టీవీల్లో జరిగే చర్చాకార్యక్రమాల్లో మాటల ఈటెలు విసురుకోవడం చూస్తునే ఉంటాం. కానీ చర్చా కార్యక్రమంలో పాల్గొనే వక్తలు బాహాబాహీకి దిగడం చాలా అరుదు. అయితే ఐబీఎన్‌7 చానల్‌లో వివాదాస్పద సన్యాసిని రాధేమాపై జరిగిన ఒక లైవ్‌ చర్చా కార్యక్రమంలో ఓ సాధువు, మరో మహిళా జ్యోతిష్కురాలు కొట్టేసుకున్నారు.

రాధే మాను విమర్శించే ముందు మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవాలని ఓమ్‌జీ అనడంతో చర్చలో పాల్గొన్న జ్యోతిష్కురాలు రాఖీ భాయ్‌ నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆయన ‘నేను మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు. (చర్చలో పాల్గొన్న మరో జ్యోతిష్కురాలు) దీపా శర్మ గురించి మాట్లాడాను' అన్నారు. దీంతో రెచ్చిపోయిన దీపా శర్మ ‘ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడండి' అని ఆయనను హెచ్చరించారు.

అయినా ఆయన తన వాదన కొనసాగించడంతో ఆమె ఆగ్రహంగా తానున్న చోటు నుంచి లేచి వెళ్లి ఓమ్‌ జీ చెంప ఛెళ్లుమనిపించారు. ఆయన కూడా ఏ మాత్రం తగ్గకుండా ఆవిడ చెంప ఛెళ్లుమనిపించారు. ఇద్దరూ కొట్టుకుంటుండడంతో యాంకర్‌, రాఖీభాయ్‌ వారిని ఆపే ప్రయత్నం చేశారు. ఈ ఘటనను చానల్‌ తీవ్రంగా ఖండించింది.

TV debate on Radhe Maa turns violent, lady slaps godman during live show

దీపా శర్మను మతబోధకురాలిగా సంభావిస్తారు. దీపా శర్మ కుటుంబంపై, ఆమెపై ఉన్న కేసులపై ఓమ్ జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శర్మ తొలుత చాలా మౌనంగా కనిపించారు. లేచి వెళ్లి ఓమ్ జీ వీపుపై తట్టి ఆతని వాగ్ధాటిని ఆపేశారు.ట

నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి అని దీపా శర్మ హెచ్చరించి ఆయనపై చేయి చేసుకున్నారు. ఆమె రెండు చేతులు గట్టిగా పట్టుకుని చెంపేస్తావా అంటూ ఓమ్ జీ ఆమెపై విరుచుకుపడ్డారు. తమ అతిథులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని అనుకున్నామని చానెల్ వ్యాఖ్యానించారు. వారి నుంచి ఇటువంటి ప్రవర్తనను తాము ఊహించలేదని, దాన్ని ఖండిస్తున్నామని చెప్పింది.

English summary
Shocking scenes were witnessed on the national television on Sunday when two guests on a live show used expletives, slapped and grappled with each other, leaving the audience aghast and prompting the channel to condemn the incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X