వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రివర్స్: కిమ్‌తో చర్చలకు సిద్దమన్న అమెరికా

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఉత్తరకొరియాను దారికి తెచ్చుకొనేందుకు అమెరికా చివరి ప్రయత్నాలను మొదలుపెట్టింది. చివరి ఆయుధంగా చర్చలు జరిపేందుకు తాము సిద్దంగా ఉన్నట్టు అమెరికా ప్రకటించింది. ఇప్పటివరకు ఉత్తరకొరియాతో తాడోపేడో తేల్చుకొందామని ప్రకటించిన అమెరికా మాట మార్చింది. ఉత్తరకొరియాతో నేరుగా చర్చలు జరుపుతామని ప్రకటించింది.

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ఇటీవల కాలంలో హైడ్రోజన్ బాంబును పరీక్షించినట్టు ప్రకటించిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కిమ్ వ్యవహరశైలిపై మండిపడ్డాయి.

ట్రంప్‌కు కిమ్ షాక్: క్షిపణులను తరలించిన ఉ.కొరియా, ఇక యుద్దమే?ట్రంప్‌కు కిమ్ షాక్: క్షిపణులను తరలించిన ఉ.కొరియా, ఇక యుద్దమే?

ఉత్తరకొరియా అధ్యక్షుడు అణుపరీక్షలు, ఖండాంతర క్షిపణులను ప్రయోగిస్తూ జపాన్, అమెరికా, దక్షిణ కొరియాలకు చుక్కలు చూపించాడు. ఎప్పుడు ఏం జరుగుతోందననే భయాన్ని జపాన్ వ్యక్తం చేసింది.

అయితే ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనేందకు తాము సిద్దంగా ఉన్నట్టు అమెరికా, దాని మిత్ర దేశాలు ప్రకటించాయి. ఈ తరుణంలోనే ఉత్తరకొరియాపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీవ్రమైన ఆంక్షలను విధించింది. ఈ ఆంక్షల విధింపుపై కిమ్ తీవ్రంగా మండిపడ్డారు. అమెరికాతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సివస్తోందని హెచ్చరించారు.

ఉత్తరకొరియాతో చర్చలకు సిద్దమేనని అమెరికా ప్రకటన

ఉత్తరకొరియాతో చర్చలకు సిద్దమేనని అమెరికా ప్రకటన

ఉత్తర కొరియాతో నేరుగా చర్చలు జరుపుతున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టెల్లెర్సన్ పేర్కొన్నారు. ఉత్తర కొరియా కొనసాగిస్తున్న అణ్వాయుధాల తయారీపై ఆందోళన వ్యక్తమౌతున్న నేపథ్యంలో... ఉద్రిక్త పరిస్థితులను చల్లబర్చడమే తన అత్యవసర లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అణ్వాయుధాల తయారీ పూర్తికాకముందు ఉత్తరకొరియా చర్చలు జరిపే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

చర్చల ద్వారా సమస్య పరిష్కారం కోసం ప్రయత్నాలు

చర్చల ద్వారా సమస్య పరిష్కారం కోసం ప్రయత్నాలు

ఉత్తరకొరియా వ్యవహరిస్తున్న తీరుతో విసుగు చెందిన అమెరికా భద్రతా మండలి ద్వారా తీవ్ర ఒత్తిడిని తెచ్చాయి. అయినా కిమ్‌ వైఖరిలో మార్పు రాలేదు. దీంతో ఆంక్షల తీవ్రతను తీవ్రతరం చేసింది భద్రతా మండలి. అయితే యుద్దానికి సిద్దమంటూ సంకేతాలు ఇచ్చిన అమెరికా చివరి నిమిషంలో మాత్రం మనసు మార్చుకొన్నట్టు కన్పిస్తోంది.‘‘మేం మాట్లాడుతున్నాం... మేం అంధకారంలో లేము... ఇంకా ద్వారాలు తెరిచే ఉన్నాయని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి రెక్స్‌టైల్లెర్సన్ ప్రకటించారు.

ఉత్తరకొరియాతో చర్చించేందుకు రెండు మార్గాలు

ఉత్తరకొరియాతో చర్చించేందుకు రెండు మార్గాలు

ఉత్తర కొరియాతో నేరుగా చర్చలు జరిపేందుకు తమకు రెండు మార్గాలున్నాయని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి టైల్లెర్సన్ ప్రకటించారు. మేం వాళ్లతో చర్చలు జరపగలం. సొంత మార్గాల్లోనే చర్చలు జరిపితీరుతాం. చర్చల ద్వారా ప్రస్తుత పరిస్థితులను చల్లబర్చగలమని నమ్ముతున్నాం. వివరాలు ముందు ముందు మీకే తెలుస్తాయి...'' అని టెల్లెర్సన్ వెల్లడించారు. శాంతి, స్థిరత్వమే లక్ష్యంగా ఉత్తర కొరియాతో తమ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుందన్నారు.

చైనాలో పర్యటిస్తున్న టైల్లెర్సన్

చైనాలో పర్యటిస్తున్న టైల్లెర్సన్

అమెరికా అధ్యక్షుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ఆవేశపూరిత వ్యాఖ్యలు కూడా తగ్గిస్తారా అని మీడియా అడగ్గా... ‘‘ ప్రస్తుతం మెుత్తం పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. ఇది వెనక్కి దిగిరావాలని అందరూ కోరుకుంటారు.. అదే గనుక జరిగితే ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాలు ఆపేస్తుంది...'' అన్నారు. ఉత్తర కొరియా సహా పలు అంశాలపై చర్చించేందుకు టెల్లర్సన్ ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్నారు.. నవంబర్ మాసంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడ చైనాతో పాటు దక్షిణ కొరియా, జపాన్ దేశాల్లో పర్యటించనున్నారు.

English summary
As the United States grapples with how to contend with North Korea's nuclear weapons program that has been fueling a worsening war of words, the rhetoric took a decisively cooler tone Saturday when Secretary of State Rex Tillerson acknowledged for the first time that the administration is in direct contact with Pyongyang over its missile and nuclear tests, reports The New York Times.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X