వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ ఉక్కుపాదం: సిలికాన్ వ్యాలీ టెక్కీలు గజగజ

సిలికాన్‌ వ్యాలీలో పనిచేస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు కష్టాలు ప్రారంభం అయ్యాయి. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న శరణార్థులపై ఉక్కుపాదం మోపేందుకు ఇమ్మిగ్రేషన్‌ అధికారులు సిద్ధం అవుతున్నారు.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్ /న్యూఢిల్లీ : సిలికాన్‌ వ్యాలీలో పనిచేస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు కష్టాలు ప్రారంభం అయ్యాయి. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న శరణార్థులపై ఉక్కుపాదం మోపేందుకు ఇమ్మిగ్రేషన్‌ అధికారులు సిద్ధం అవుతున్నారు. అక్రమ వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని అటార్నీ జనరల్‌ జెఫ్‌ సెషన్స్‌ నుంచి పోలీసులు, ప్రాసిక్యూటర్లు, జడ్జీలకు ఆదేశాలు అందాయి.

ఎంత కాలం నుంచి దేశంలో ఉంటున్నారన్న అంశంతో నిమిత్తం లేకుండా అక్రమ శరణార్థులందరినీ నిర్బంధించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. 'అక్రమ వలస దారులను గుర్తించి నిర్బంధించి వెనక్కి తిప్పి పంపడం' అనే నినాదంతో అధికారులు రంగంలోకి దిగుతున్నారు.

అదుపులోకి తీసుకున్న అక్రమ వలసదారులను ఉంచేందుకు తగిన ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి చేశారు. మున్ముందు అక్రమ వలసదారుల కేసులు పెరిగే అవకాశం ఉండటంతో అదనంగా మరికొందరు జడ్జిలనూ నియమించారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించాలనుకొనే వారి ఆటలు ఇకపై చెల్లవని, అమెరికాలో ట్రంప్‌ శకం ప్రారంభమైందని అటార్నీ జనరల్‌ జెఫ్‌ సెషన్స్‌ పేర్కొన్నారు.

అత్యధికులు టూరిస్టు, తాత్కాలిక వీసాదారులే

అత్యధికులు టూరిస్టు, తాత్కాలిక వీసాదారులే

తమ దేశంలో సుమారు కోటి మందికిపైగా అక్రమ వలసదారులు ఉంటున్నారని అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు భావిస్తున్నారు. అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారుల్లో అధికశాతం మంది మెక్సికన్లే. కొన్ని దశాబ్దాలుగా వారు అమెరికాలో ఉంటూ వ్యాపారాలు చేసుకుంటున్నారు. అక్రమ వలసదారుల్లో సుమారు ఐదు లక్షల మంది భారతీయులు ఉండొచ్చని తెలుస్తోంది. అక్రమంగా అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో అధికశాతం మంది టూరిస్ట్‌, స్టూడెంట్‌, తాత్కాలిక వీసాలపై వచ్చిన వారే. అదే సమయంలో సుమారు 80 వేల మంది భారతీయులు పర్మినెంట్‌ వీసాలపై అమెరికాలో స్థిరపడి, వివిధ రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారు.

34 % తగ్గిన అక్రమ వలసలు

34 % తగ్గిన అక్రమ వలసలు

దేశంలో అక్రమంగా ఉంటున్న శరణార్థులందరనీ వెళ్లగొడతానని దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఎన్నికల ప్రచార సమయంలో అమెరికన్లకు హామీ ఇచ్చారు. అక్రమ శరణార్థుల వల్లే అమెరికన్లు ఉపాధి కోల్పోతున్నారని.. నేరాలు పెరిగిపోతున్నాయన్నది ట్రంప్‌ వాదిస్తున్నారు.. ఆయన అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా సరిహద్దులను దాటి అక్రమంగా దేశంలోకి ప్రవేశించే వారి పట్ల కఠినంగా వ్యవహరించారు. దీంతో గత 40 ఏళ్లలో లేని విధంగా సరిహద్దులను దాటి దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అక్రమ వలసలు గత ఏడాది కన్నా 34% తగ్గిపోయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

మెక్సికో సరిహద్దుల్లో ఇలా..

మెక్సికో సరిహద్దుల్లో ఇలా..

ఇంతకుముందు అమెరికా- మెక్సికో సరిహద్దును దాటి అమెరికాలోకి ప్రవేశించిన వారిని అధికారులు గుర్తిస్తే వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయకుండా వెనక్కి తిప్పి పంపేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. సరైన పత్రాలు లేకుండా సరిహద్దు దాటి అమెరికాలోకి ప్రవేశించే వారిని అరెస్ట్‌ చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టాలని గత వారం అటార్నీ జనరల్‌ ఇమ్మిగ్రేషన్‌ అధికారులను ఆదేశించారు. మరోవైపు అమెరికా-మెక్సికో సరిహద్దులో 3200 కిలోమీటర్ల మేర నిర్మించనున్న గోడ నిర్మాణానికి అవసరమైన డిజైన్లు సిద్ధమవుతున్నాయి. సరిహద్దు పొడవునా పూర్తిస్థాయిలో గోడను నిర్మించకుండా అక్కడక్కడా అత్యాధునిక నిఘా వ్యవస్థతో కూడిన ప్రవేశమార్గాలు నిర్మించాలని అమెరికా భావిస్తోంది.

వారి స్వదేశాలకు పంపడానికి సమయం పట్టే చాన్స్

వారి స్వదేశాలకు పంపడానికి సమయం పట్టే చాన్స్

అక్రమ వలసదారులను గుర్తించిన తర్వాత వారిని వారి వారి దేశాలకు తిప్పి పంపించే ప్రక్రియ ప్రారంభమవుతుందని అమెరికన్‌ ఇమ్మిగ్రేషన్‌ అధికారులు చెబుతున్నారు. అయితే ఇది అంత తేలిక కాదని ఇమ్మిగ్రేషన్‌ నిపుణుల అభిప్రాయ పడుతున్నారు. ఈ ప్రక్రియ ప్రారంభం కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని వారు చెప్తున్నారు.

English summary
Illegal immigrants identification work will be starts now any time. US officials had superior powers to deal with non immigrants.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X