వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎగ్జిట్ పోల్స్ ఎంత వరకు నిజం.. ఒక్కసారి ఇవి చూస్తే..?

ఇప్పుడు అందరి దృష్టి అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల పైన ఉంది. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ ఫలితాల కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాల సాయంత్రం రానున్నాయి.

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: ఇప్పుడు అందరి దృష్టి అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల పైన ఉంది. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ ఫలితాల కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాల సాయంత్రం రానున్నాయి.

ఎన్నికలు జరిగిన తర్వాత ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? అని చెప్పడం చాలా కష్టం. అందులోను పలు దశలుగా ఎన్నికలు జరిగినప్పుడు, పెద్ద రాష్ట్రాలు అయినప్పుడు ఓటర్ల నాడిని పసిగట్టడం మరింత కష్టం.

రెండు రోజుల్లో యూపీతో సహా మిగతా రాష్ట్రాల ఫలితాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ఐదు గంటల తర్వాత వివిధ మీడియా సంస్థలు తాము నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించనున్నాయి.

వాస్తవాలు ఎంతంటే..

వాస్తవాలు ఎంతంటే..

వాస్తవానికి బుధవారంతోనే మొత్తం ఎన్నికలు పూర్తయినా.. ఒకటి రెండు చోట్ల ఉప ఎన్నికలు ఉండటంతో గురువారం సాయంత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలు రానున్నాయి. గతంలో కూడా ఇలా పలు ఎన్నికల విషయంలో ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి కాని వాటిలో వాస్తవాలు అంతగా కనిపించవు.

ఎగ్జిట్ పోల్స్

ఎగ్జిట్ పోల్స్

ఒక్కొక్కరు ఒక్కో పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు ఈ ఎగ్జిట్ పోల్స్ గతంలో వివిధ ఎన్నికల సందర్భంగా ఏం చెప్పాయో.. వాటిలో నిజాలేమిటో చూస్తే.. ఎగ్జిట్ పోల్స్ పైన ఏ మేరకు ఆధారపడవచ్చునో అర్థం చేసుకోవచ్చు.

ట్రెండ్లను అంచనా వేసినా..

ట్రెండ్లను అంచనా వేసినా..

ఒక్కోసారి కొన్ని కొన్ని సంస్థలు కాస్త దగ్గరగా వచ్చి, కొంతవరకు ట్రెండ్లను అంచనా వేస్తున్నాయి. కానీ లెక్కల్లో మాత్రం తేడా ఉంటాయి. 2015 ఢఇల్లీ అసెంబ్లీ, 2015 బీహార్ అసెంబ్లీ, 2014 యూపీలో లోకసభ ఎన్నికలు, 2012లో యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వివిధ మీడియా సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్‌ను ఇప్పుడు చాలామంది పరిశీలిస్తున్నారు.

ఢిల్లీ, బీహార్‌లలో ఇలా..

ఢిల్లీ, బీహార్‌లలో ఇలా..

ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఏఏపీ 70 సీట్లకు గాను 67 స్థానాలు గెలిచింది. బీజేపీ కేవలం మూడు స్థానాలతో సరిపెట్టుకుంది. బీహార్‌లో కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలు తప్పుగా తేలాయి. కానీ అప్పుడు వివిధ సర్వేలు ఎలా ఉన్నాయంటే...

ఏజెన్సీ ఏఏపీ బీజేపీ కాంగ్రెస్ ఇతరులు

ఏజెన్సీ ఏఏపీ బీజేపీ కాంగ్రెస్ ఇతరులు

India TV-C Voter 35-43 25-33 0-2 0
India Today-Cicero38-46 19-27 3-5 0-2
ABP-Nielsen 43 26 1 0
Today's Chanakya 48 22 0 0
Axis 53 17 0 0
News Nation 41-45 23-27 1-3 0-1
Data Mineria 31 35 4 0

ఏజెన్సీ గ్రాండ్ అలయెన్స్ బీజేపీ+ ఇతరులు

ఏజెన్సీ గ్రాండ్ అలయెన్స్ బీజేపీ+ ఇతరులు

ABP News-Nielsen 130 108 5
CNN-IBN-Axis 176 64 3
India Today-Cicero 111-123 113-127 4-8
NDTV-Hansa 110 125 8
India TV-Times Now-CVoter 112-132 101-121 6-14
News 24-Today's Chanakya 83 155 5

లోకసభ ఎన్నికల్లో బీజేపీ హవా

లోకసభ ఎన్నికల్లో బీజేపీ హవా

2014 లోకసభ ఎన్నికల సమయంలోను యూపీలో ఎగ్జిట్ పోల్ అంచనాలు తప్పయ్యాయి. 80 స్థానాలకు గాను బీజేపీ 73 స్థానాలు గెలుచుకుంది. కానీ దాదాపు అన్ని సంస్థలు 45 నుంచి 56 మధ్య సీట్లను బీజేపీ గెలుచుకుంటుందని తేల్చారు. చాణక్య-న్యూస్ 24 మాత్రం 67 స్థానాలు వస్తాయని చెప్పింది.

English summary
Polling for the final round of the seven-phased Uttar Pradesh Assembly elections 2017 concluded today. The Uttar Pradesh Assembly election results 2017 will be declared on March 11.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X