• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సీఎం అభ్యర్థుల పోరు: స్మృతీ వర్సెస్ వరుణ్ గాంధీ

|

అలహాబాద్: ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై భారతీయ జనతా పార్టీలో అప్పుడే తీవ్ర పోటీ రాజుకుంటోంది. మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కుటుంబ వారసుడు, కేంద్ర మంత్రి మేనకాగాంధీ తనయుడు, స్థానిక బిజెపి ఎంపీ వరుణ్‌గాంధీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీల మధ్యే ఈ పోటీ మరీ తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అంతేగాక, వీరి బల ప్రదర్శన ఆదివారం బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశం నేపథ్యంలో హోర్డింగ్‌ల రూపంలో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సీఎం అభ్యర్థిని ప్రకటించాలా వద్దా అన్న అంశంపై అధిష్ఠానం నిర్ణయం తీసుకోనప్పటికీ అలహాబాద్ అంతటా పోస్టర్లు, హోర్డింగ్‌ల హంగామా సాగుతోంది. అయితే, ఈ విషయంలో వరుణ్‌గాంధీ అందరికంటే ముందుండటం గమనార్హం.

అడుగడుగునా పెద్దఎత్తున హోర్డింగ్‌లతో ఆయన అనుచరులు హడావిడి చేసేస్తున్నారు. కొందరైతే స్మృతీ ఇరానీ కంటే వరుణ్ గాంధీ ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే మంచిదని పోస్టర్లలో పేర్కొనడం గమనార్హం. 'అబ్కీ బార్ వరుణ్ గాంధీ'అంటూ పోస్టర్లలో వారు పేర్కొంటున్నారు. పార్టీ కేంద్ర నాయకత్వం ఆదరణను ఎక్కువగా చూరగొన్న మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ పోస్టర్లు కూడా అలహాబాద్ రోడ్లపై విరివిగానే కనిపించాయి.

Varun Gandhi annoys BJP with posters attacking Smriti Irani and declaring him as CM candidate for Uttar Pradesh

ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాలతోపాటు ఉత్తరప్రదేశ్‌కే చెందిన కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఫోటోను కూడా అన్ని పోస్టర్లలో ప్రముఖంగా ప్రదర్శించారు. 2012 ఎన్నికల్లో పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఓబీసీ నేత ఉమాభారతి పోస్టర్లు కూడా అక్కడక్కడా కనిపించడం విశేషం.

కాగా, ఈ పోస్టర్లు, హోర్డింగ్‌ల హంగామా వ్యవహారంపై బిజెపి జాతీయ కార్యదర్శి సిద్ధార్థనాథ్‌సింగ్ మాట్లాడుతూ.. 'వరుణ్‌గాంధీ అభిమానులు చాలామంది ఉన్నారు. కానీ, ఈ పోస్టర్ల ద్వారా నిర్ణయాలు జరుగవు. హోర్డింగ్‌లు ప్రజాదరణకు కొలమానాలు కావు' అని స్పష్టం చేశారు.

అసోంలో మాదిరిగా ముందే సీఎం అభ్యర్థి పేరును ప్రకటించాలా వద్దా? అన్న అంశంలో బిజెపి ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా, రాష్ట్ర నేతలు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేరును గట్టిగా ప్రస్తావిస్తున్నప్పటికీ, అధిష్ఠానం మాత్రం ఇంకా ఏ నిర్ణయానికి రాలేదు. రాజ్‌నాథ్, స్మృతీ ఇరానీల పేర్లు వినిపిస్తున్నప్పటికీ వరుణ్ గాంధీ కూడా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ఉన్నట్లే తెలుస్తోంది. పార్టీ నిర్ణయం తర్వాత ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bharatiya Janata Party (BJP) leader Varun Gandhi unruffled feathers within the party camp by launching a self-promotion campaign in Uttar Pradesh. Supporters of the Gandhi family scion have put up his posters across Allahabad demanding the BJP leadership to announce Varun as the chief ministerial candidate for Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more