వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సైకిల్ నుంచి కింగ్ ఫిషర్‌ దాకా: ఎవరీ విజయ్ మాల్యా?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాటిని తిరిగి చెల్లించకుండా దేశం విడిచిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా పేరు గత కొన్ని రోజులుగా మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. అసలు ఎవరీ విజయ్ మాల్యా. అనతి కాలంలో అంతటి అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించగలిగారో ఒక్కసారి చూద్దాం.

విజయ్ మాల్యా విలాసపురుషుడిగా, వ్యాపారవేత్తగా కర్ణాటక రాష్ట్ర రాజకీయాల నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. విజయ్‌మాల్యా 1955 డిసెంబర్‌18న కర్ణాటకలోని బంట్వాల్‌ అనే ఓ చిన్న పట్టణంలో విఠల్‌ మాల్యా, లలిత దంపతులకు జన్మించారు. తండ్రి విఠల్‌ మాల్యా పేరొందిన పారిశ్రామికవేత్త.

తండ్రి మార్గదర్శకత్వంలో బిజినెస్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేసిన మాల్యా తొలినాళ్లలో అనుభవం కోసం షాజహాన్‌పూర్‌లో క్లర్క్‌గా పనిచేశారు. అప్పట్లో ఆయన ఓ పాత సైకిల్‌‌ని వాహనంగా ఉపయోగించేవాడు. ఆ తర్వాత న్యూజెర్సీలో తన తండ్రికి వాటా ఉన్న ఒక ఫార్మా కంపెనీలోనూ పనిచేశారు.

Also Read: లండన్‌లో దర్జాగా విజయ్ మాల్యా: బస ఇక్కడే (ఫోటోలు)

విజయ్ మాల్యా 27వ ఏట ఆయన తండ్రి విఠల్‌ మాల్యా గుండెపోటుతో కన్నుమూశారు. దీంతో ఆయన తండ్రి ఛైర్మన్‌గా ఉన్న యునైటెడ్‌ బ్రూవరీస్‌ మాల్యా చేతికి వచ్చింది. అప్పట్లో యునైటెడ్ బ్రూవరీస్ అనేది 10 కోట్ల డాలర్ల వ్యాపార సామ్రాజ్యం. అంత చిన్న వయసులో ఆ సంస్ధకు సీఈఓగా బాధ్యతలను స్వీకరించిన విజయ్ మాల్యా తదుపరి రెండు దశాబ్దాల్లో బ్రూవరీస్ మార్కెట్ విలువను 60వేల కోట్లకు పెంచారు.

యునైటెడ్‌ బ్రూవరీస్‌ విజయాల సాధించిన విజయ్ మాల్యా అదే విధంగా భారత విమానయాన రంగంలో అద్భుతాలు చేద్దామనుకుని కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స స్థాపించారు. ఖరీదైన విమానాలు, కళ్లు చెదిరే సౌకర్యాలతో విమాన ప్రయాణం అంటే ఇలా ఉండాలనే రీతిలో కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ను తీర్చిదిద్దారు.

అంతేనా... విమానంలో పనిచేసే ఎయిర్‌ హోస్టెస్‌లను ఆయనే స్వయంగా ఎంపిక చేసేవారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ వచ్చిన తొలినాళ్లలో భారత విమాన ప్రయాణికులకు గొప్ప అనుభూతి మిగిల్చింది. కాకపోతే విమానయాన రంగంలో అనుభవం లేకపోవడంతో తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పల పాలయ్యారు.

కార్టూన్ : విజయ్ మాల్యా జంప్

బతికినంతకాలం రాజులా బతుకాలనేది విజయ్‌ మాల్యా సిద్ధాంతం. కింగ్‌ఫిషర్ బ్రాండ్‌కు విజయ్ మాల్యా ఇచ్చిన నిర్వచనం 'కింగ్‌ ఆఫ్‌ గుడ్‌ టైమ్స్‌'. ఖరీదైన, ఫ్లాషీ డ్రెస్‌లు.. ఎప్పుడూ చెంత ఉండే ఆర్మ్‌ క్యాండీల్లాంటి ముద్దుగుమ్మలు. ఖరీదైన విమానాలు, అరేబియన్‌ గుర్రాలు, రేసుకార్లు, యాట్‌లు ఇవన్నీ కూడా విజయ్ మాల్యా సొంతం.

ఇండియన్ ప్లేబాయ్‌గా విజయ్ మాల్యాకు పేరుంది. విలాసవంతమైన జీవితం గడపడంతో మాల్యాను ప్లేబోయ్‌ పత్రిక సారథి హగ్‌ హెఫ్నర్‌తో పోలుస్తారు. తనకంటే చాలా చిన్న వయసున్న డజన్ల కొద్దీ మోడల్స్‌తో ఆయన కింగ్‌ఫిషర్‌ క్యాలెండర్‌ కోసం ప్రత్యేకంగా ఫొటోలు తీయించేవారు. ఈ కార్యక్రమంలో కోసం మాల్యానే రోజుల తరబడి దగ్గర ఉండి పర్యవేక్షించడం గమనార్హం.

విజయ్ మాల్యాకు దేశభక్తి కూడా ఎక్కువే. అప్పట్లో టిప్పు సుల్తాన్ ఖడ్గాన్ని లండన్‌లో వేలం వేస్తుంటే, దాన్ని రూ. 1.57 కోట్లకు, గాంధీజీ జేబు గడియారం, చెప్పులు, కళ్లజోడును దాదాపు 12 కోట్ల రూపాయలకు వేలంపాటలో గెలుచుకుని భారతకు తిరిగి తీసుకు వచ్చినప్పుడు మాల్యా దేశభక్తిని యావత్ భారతావని కొనియాడింది.

వింటేజ్‌ కార్లంటే విజయ్ మాల్యాకు ప్రాణం. తాను ఏ దేశానికి వెళ్లినా వింటేజ్‌ కార్లను కొనుగోలు చేయడం ఆయనకు అలవాటు. ఆయన కలెక్షన్‌లో 1913 నాటి వింటేజ్ కార్లు కూడా ఉన్నాయి. ఆయన కలెక్షన్‌లో 250 వింటేజ్‌ కార్లున్నాయి. ఈ కార్ల కలెక్షన్‌ పర్యవేక్షణ కోసం 1992లో ఆయన ఏకంగా ఒక మేనేజర్‌నే నియమించుకున్నారు.

సైకిల్ నుంచి వింటేజ్ కారు వరకు: ఎవరీ విజయ్ మాల్యా?

సైకిల్ నుంచి వింటేజ్ కారు వరకు: ఎవరీ విజయ్ మాల్యా?


ఆయన కార్లలో కొన్నిటిని కాలిఫోర్నియాలోని ప్రైవేట్ మ్యూజియంలో ఉంచారు. కార్లతో పాటు గుర్రాలన్నా విజయ్ మాల్యాకు చాలా ఇష్టం. బెంగళూరులో ఆయనకు 250 ఏళ్లనాటి ఒక గుర్రాల శాల ఉంది. ప్రపంచ వ్యాప్తంగా విజయ్ మాల్యాకు 42 ఇళ్లు ఉన్నాయి. ఎయిర్‌బస్‌ ఏసీజే 319 అనే విమానాన్ని తన ఇష్టాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకున్నారు.

సైకిల్ నుంచి వింటేజ్ కారు వరకు: ఎవరీ విజయ్ మాల్యా?

సైకిల్ నుంచి వింటేజ్ కారు వరకు: ఎవరీ విజయ్ మాల్యా?


అప్పట్లోనే 4 కోట్ల డాలర్లతో.. అంటే దాదాపుగా 250 కోట్ల రూపాయలతో పూర్తిగా ఆయన ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఈ విమానాన్ని తీర్చిదిద్దారు. ఈ విమానంలో లివింగ్‌ స్పేస్‌ 6000 ఘనపుటడుగులు. 24 మంది ప్రయాణించేందుకు వీలుంది. దీనికి తోడు మరో రెండు కార్పోరేట్ జెట్ విమానాలు కూడా ఉన్నాయి.

 సైకిల్ నుంచి వింటేజ్ కారు వరకు: ఎవరీ విజయ్ మాల్యా?

సైకిల్ నుంచి వింటేజ్ కారు వరకు: ఎవరీ విజయ్ మాల్యా?

మరో రెండు కార్పొరేట్‌ జెట్‌ విమానాలతో పాటు యాట్‌లు కూడా ఉన్నాయి. ముంబైలో అరేబియా సముద్రం కనిపించేలా నిర్మించుకున్న ఇంద్రభవనంలాంటి పది పడగ్గదుల విల్లా మాల్యా సొంతం. గోవాలో రొమాంటిక్‌ బ్యాష్‌లకు కింగ్‌ ఫిషర్‌ విల్లా పెట్టింది పేరు. దీనికి తోడు ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్‌ రివేరాలో లంగరేసిన ఇండియన్‌ ఎంప్రెస్‌ యాట్‌ మాల్యా సొంతం.

 సైకిల్ నుంచి వింటేజ్ కారు వరకు: ఎవరీ విజయ్ మాల్యా?

సైకిల్ నుంచి వింటేజ్ కారు వరకు: ఎవరీ విజయ్ మాల్యా?

ఇందులో మాల్యా విలాసవంతమైన పార్టీలు ఇచ్చేవారు. 95 మీటర్ల పొడుగుండే ఈ మెగాయాట్‌లో హెలీప్యాడ్‌ కూడా ఉంది. 2006లో ఖతార్‌కు చెందిన ఒక షేక్‌ నుంచి మాల్యా దీన్ని కొనుగోలు చేశారు. ఈ యాట్‌లో ఒకప్పుడు మాల్యా ఇచ్చిన పార్టీలకు ఉక్కు సంపన్నుడు లక్ష్మీ మిట్టల్‌, హాలీవుడ్‌ నటీనటులు, క్రీడా, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

 సైకిల్ నుంచి వింటేజ్ కారు వరకు: ఎవరీ విజయ్ మాల్యా?

సైకిల్ నుంచి వింటేజ్ కారు వరకు: ఎవరీ విజయ్ మాల్యా?


కాగా, 2011లో ఆయన ఆర్ధిక మాంద్యంలోకి వెళ్లడంతో మొదట దీనినే అమ్మేశారు. ఇది కాక ఆయనకు ఇంకో యాట్‌ ఉంది. అది 1906 నాటి వింటేజ్‌ యాట్‌. దాని పేరు కలిజ్మా. హాలీవుడ్‌ నటుడు రిచర్డ్‌ బర్టన్‌ నుంచి మాల్యా దాన్ని కొనుగోలు చేశారు. అప్పట్లో దీని విలువ రూ.48 కోట్లకు పైమాటే.

English summary
It was with much fanfare that Vijay Mallya the former chairman of the UB group had bought the sword of Tipu Sultan. I want to restore the legacy of Tipu, Mallya said at a crowded press conference at Bengaluru in 2004. Following which he announced that he had paid Rs 1.57 crore for the sword which is several centuries old.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X