వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెగ్గింగ్ లాంటి మాఫీ వద్దు.. గిట్టుబాటు కావాలి.. మరాఠీ రైతు సవాలిది..

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

ముంబై: భారీగా పంటల దిగుబడి సాధించినా కనీస ధర కూడా రాకపోవడంతో రైతుల ఖాళీ జేబులతో ఇండ్ల దారి పడుతున్నారు. తమకు రుణ మాఫీ ఇవ్వడం తాత్కాలికమే గానీ శాశ్వత పరిష్కారం లభించదని మహారాష్ట్ర రైతులు చెప్తున్నారు. వందల కొద్దీ గన్నీ బ్యాగుల నిండా ఉల్లిగడ్డలు ఉన్నాయి. మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లాలోని రాహురిలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఉల్లిగడ్డలు రైతులు విరివిగా తీసుకొచ్చారు. ఈ ఏడాది భారీగా పంటలు పండాయని రైతులు సంబురపడ్డారు.

కానీ వారి గర్వం కూడా ఎంతోకాలం నిలబడలేదు. తక్కువ ధర ప్రకటించడంతో విచారకరంగా, నిస్సహాయ స్థితిలో రైతులు సతమతం అవుతున్నారు.

గతేడాది ఉల్లిధరలు సగటున కిలో రూ.18 పలికింది. ఈ ఏడాది కేవలం ఐదు రూపాయలు మాత్రమే పలికింది. 68 కిలోమీటర్ల దూరంలోని పార్నర్ రైతు రాజేంద్ర రోకాడె 2000 క్వింటాళ్ల ఉల్లిగడ్డలు రాహురి వ్యవసాయ మార్కెట్‌కు తీసుకొచ్చాడు. కానీ రూ.5.50కు మాత్రమే పొందగలిగాడు. అదే 50 పైసలు కనీస లాభంగా భావించాడు.

Want good market price, not loan waiver, say Maharashtra farmers

ఇతర ప్రాంతాల్లో ఉల్లిగడ్డలు అమ్మడంతో రూ.1000కి పైగా లాభం పొందాడు. ఇతర ప్రాంతాల్లో విక్రయించడం వల్ల తాను ఇంటికి అవసరమైన వస్తువులు కొనగలిగానని తెలిపాడు. ప్రక్రుతిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రొకాడే వంటి రైతులు అనేకమంది ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో అణచివేతకు గురవుతున్నారు.

ఐదేళ్లలో వ్యవసాయంలో 12.5 % ప్రగతి సాధన
గత ఐదేళ్ల కాలంలో అత్యధికంగా మహారాష్ట్ర పంటల సాగులో 12.5 శాతం ప్రగతి సాధించారు. సంప్రదాయ పంటలు కందిపప్పు, సోయాబీన్, జొన్నలు, ఉల్లిగడ్డ తదితర పంటలు బాగానే పండాయి. సరైన వాతావరణం నెలకొనడంతో గత ఏడాది 110 శాతానికి పైగా వర్షపాతం నమోదైంది. గత ఏడాది 50 లక్షల క్వింటాళ్లు పప్పు ధాన్యాలు పండాయి.

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పెరిగి అది 1.17 కోట్ల క్వింటాళ్లు పండాయి. కానీ రైతులు పండించిన పంటలకు సరైన ధర లభించక వారు మార్కెట్ తెచ్చిన పంటకు సరిపడా డబ్బులతో వెనుదిరగలేదు. ప్రైవేట్ వ్యాపారులు క్వింటాల్ పప్పు రూ.3700 మించి పెంచడం లేదు. రూ.5050 క్వింటాల్ పెట్టి కొన్న చోటే పది రోజుల క్రితం ధరను వ్యాపారులు భారీగా తగ్గించేశారు.

రుణ మాఫీకి ఫడ్నవీస్ సర్కార్ ససేమిరా
రుణాల మాఫీ పథకం అమలు కోసం రాష్ట్రంలోని విపక్షాలు దేవేంద్ర ఫడ్నవీస్ సారథ్యంలోని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తారు. సామాన్య రైతుల ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రుణ మాఫీ అమలుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కానీ రైతులు మాత్రం రుణ మాఫీ వంటి తాత్కాలిక ప్రయోజనకరమైన పథకాలు వద్దని, శాశ్వత పరిష్కారం చూపే సరసమైన ధర లభించేలా చర్యలు తీసుకోవాలని రైతులు అంటున్నారు. రాహురిలో ఉల్లిగడ్డలు విక్రయించిన మరో రైతు విలాస్ సాగరే స్పందిస్తూ పంట రుణాలమాఫీ అమలు ఒక బిక్షాటన వంటిదని అభివర్ణించాడు.

Want good market price, not loan waiver, say Maharashtra farmers

పంట రుణాల మాఫీకి బదులు కనీస చిల్లర ధర చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. ఉచిత హామీలకు బదులు మంచి మార్కెట్ ధరను చెల్లించాలని కోరుతున్నారు. సాగరే జిల్లా సహకార బ్యాంకులో 1.25 లక్షల రుణం తీసుకుని ఉన్నాడు. కనీసం తమకు 20 శాతం లాభాలు వచ్చినా బ్యాంకుల నుంచి రుణాలు తమకు అవసరమే లేదని తేల్చేశారు. అహ్మద్ నగర్ లోని అభయ్ ధానావాతే అనే రైతు కూడా అదే మాట చె్పారు. ఉల్లిగడ్డలు పండించేందుకు రూ.50 వేలు ఖర్చు చేశానని, ఎకరానికి 55 వేలు వస్తే చాలునని తెలిపారు. ఆరు నెలలు కష్టపడితే కేవలం రూ.5000 లాభం వస్తే చాలునన్నారు.

కరువు ప్రాంత రైతులూ గిట్టుబాటు ధరే కావాలంటున్నారు
వర్షపాతం తక్కువ నమోదైన ప్రాంతాల్లోనూ రైతులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పుణెలోని కౌథాడి అనే రైతు ఐదు ఎకరాల భూమిలో రూ.7.5 లక్షలు ఖర్చు చేశాడు. వాటి నుంచి రూ.80 వేల లాభాలు వచ్చాయి. పంటలకు సరైన ధర లభిస్తే తిరిగి వ్యవసాయం చేసేందుకు పెట్టుబడి లభిస్తుందని రైతులు చెప్తున్నారు. ఆసక్తికరమేమిటంటే 2008లో మాతోలే అనే వ్యక్తి రూ.9 లక్షల రుణం చెల్లించాడు.

అప్పటికే జాతీయ స్థాయిలో రుణ మాఫీ పథకం అమలు పూర్తయిందని రైతులు, అధికారులు పేర్కొన్నారు. తన పొలంలో డ్రిప్ ఇరిగేషన్ పథకం అమలు చేసేందుకు జితేగావ్ వాసి సమాధాన్ మిర్గాల్ అనే రైతు 1.50 లక్షలు రుణం తీసుకున్నాడు. వర్షపాతం సరిగ్గా లేక జొన్న పంట సాగు చేశాడు. దాని ధర కూడా క్వింటాల్‌కు రూ.1,800 నుంచి రూ.1,200కు పడిపోయింది. మరో పంట సాగు చేసి ఉంటే రుణ మాఫీ పథకం అవసరం లేదని మిర్గాల్ తెలిపాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పంట రుణాల మాఫీ అమలుకు పూనుకున్న తర్వాత మహారాష్ట్రలో భారీ స్థాయిలో చర్చ జరిగింది. కానీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నది. దీని సాకుగా విపక్షం మహారాష్ట్రలో పోయిన పునాదిని తిరిగి కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నది.

రుణ మాఫీ సమస్య పరిష్కారం కాదంటున్న ఫడ్నవీస్
పంట రుణాల మాఫీ పథకం రైతుల సమస్యలను ఏమాత్రం పరిష్కరించబోదని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పదేపదే చెప్తున్నారు. రైతులకు అవసరమైన నీరు, విద్యుత్ సరఫరా తదితర వసతులు కల్పన ద్వారా పంటల సాగుకు చర్యలు తీసుకోవచ్చునన్నాడు. రాష్ట్రంలోని 90 శాతం మంది రైతుల ఖాతాలన్నీ సహకార బ్యాంకులలో ఉన్నాయి. ఉస్మానాబాద్ జిల్లాలోని సహకార బ్యాంకు పంట బీమాకు కేంద్రం ప్రకటించిన రూ.10 కోట్లు రైతులకు పంపిణీ చేసే విషయంలో దుర్వినియోగం చేసిన సంగతిని ఫడ్నవీస్ గుర్తు చేస్తున్నారు. పంటల బీమా మొత్తాన్ని వడ్డీ కోసం డిపాజిట్లు చేసిందే తప్ప రైతులకు పంపిణీ చేయలేదు. రైతుల కడగళ్లు తీర్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు రైతు సంఘాల నేతలు ఆందోళన వ్యాప్తికి చ్యలు చేపడుతున్నారు.

English summary
Low price leave them with empty pockets in spite of bumper crop, yet they say loan waiver is a temporary relief not permanent solution. Piles of gunny bags full of onions are seen everywhere at the agriculture produce marketing committee (APMC) at Rahuri in Maharashtra's Ahmednagar district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X