వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ వర్సెస్ మమతా: వీడనున్న నేతాజీ మిస్టరీ?

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ మృతిపై నెలకొన్న మిస్టరీ వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన ఫైళ్లను పశ్చిమబెంగాల్ ప్రభుత్వం విడుదలచేసింది. మొత్తం 12,744 పేజీలతో కూడిన 64 రహస్య ఫైళ్లను శనివారం నేతాజీ కుటుంబ సభ్యులకు అందజేసింది.

కేంద్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కారణంగానే మమతా బెనర్జీ పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నేతాజీ ఫైళ్లను బహిర్గతం చేసేందుకు పూనుకున్నట్లు తెలుస్తోంది. నేతాజీకి సంబంధించిన ప్రతీ ఫైల్‌ను మమత ప్రభుత్వం డిజిటైలేజేషన్ చేసింది.

నేతాజీ కుటుంబానికి ఫైళ్లను డివిడీల రూపంలో రాష్ట్ర హోంశాఖ అందించింది. కాగా, సోమవారం(సెప్టెంబర్ 21) నుంచి కోల్‌కతా మ్యూజియంలో నేతాజీకి సంబంధించిన ఫైళ్లను ఉంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం ఆ ఫైళ్లను పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో ఉంచింది.

కాగా, వివిధ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయనే ఉద్దేశంతో ఎన్నో ఏళ్లుగా రహస్యంగా ఉంచిన నేతాజీ ఫైళ్లను మమత ప్రభుత్వం బహిర్గతం చేయడంపై కేంద్రం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జాతీయ అంశాలకు సంబంధించిన అంశాలను రాష్ట్రం ప్రభుత్వం చేపట్టడంపై కేంద్రం స్పందించే అవకాశం ఉంది.

 West Bengal government declassifies 64 files related to Netaji Subhas Chandra Bose

అయితే నేతాజీ కోల్‌కతాలోనే జన్మించి అక్కడి నుంచే తన స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రారంభించారు. మమత ప్రభుత్వం నేతాజీ ఫైళ్లను బహిర్గతం చేయడంతో కేంద్రంతో ఆమె ఢీకొంటున్నట్లు కనిస్తోంది.

కాగా, గత దశాబ్దాల నుంచి మిస్టరీగా ఉన్న నేతాజీ మరణం, ఆయనకు సంబందించిన పలు విషయాలు ఈ ఫైళ్ల ద్వారా తెలిసే అవకాశం ఉంది. ఓ విమాన ప్రమాదంలో నేతాజీ చనిపోయారన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

ఇది ఇలా ఉండగా, మరికొందరు నేతాజీ బతికే ఉన్నారంటూ వాదించారు. ఈ నేపథ్యంలో నేతాజీ మృతికి సంబంధించిన కొన్ని విషయాలు ఈ ఫైళ్లలో ఉండవచ్చని ఆయన కుటుంబసభ్యులు భావిస్తున్నారు.

English summary
Secret files related to Netaji Subhas Chandra Bose were released by the West Bengal government on Friday and will now be open to the public.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X