వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక ‘మాంసం ఆరోగ్యానికి హానికరం’!: డబ్ల్యూహెచ్ఓ

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: ఇప్పటి వరకు ధూమపానం ఆరోగ్యానికి హానికరమని మాత్రమే మనకు తెలుసు. ఇక నుంచి మాంసాహారం కూడా ఆరోగ్యానికి హానికరమన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రోజుకు 50 గ్రాముల కంటే ఎక్కువ మాంసం తినడం ప్రమాదమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) తన పరిశోధన నివేదికలో తేల్చింది.

జంతు మాంసం క్యాన్సర్‌ కారకమని స్పష్టం చేసింది. డబ్ల్యూహెచ్‌వోకి చెందిన.. క్యాన్సర్‌పై పరిశోధన చేసే అంతర్జాతీయ సంస్థ జంతు మాంసం, శుద్ధి చేసిన మాంసంలో క్యాన్సర్‌ కారకాలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.

పైగా దీన్ని ఎంత ఎక్కువగా తింటే క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు అంత ఎక్కువని తెలిపింది. ఈ సంస్థకు చెందిన 22 మంది నిపుణులు పది దేశాల్లో జంతు మాంసం తినేవారు, క్యాన్సర్‌ బాధితులపై అధ్యయనం చేశారు. ఇందులో జంతు మాంసం తినడం వల్లే క్యాన్సర్‌ వస్తుందని స్పష్టంగా తేలకున్నా.. ఈ మాంసంలో క్యాన్సర్‌కు దారి తీసేవి చాలా ఉన్నాయని గుర్తించింది.

WHO links processed meat to cancer

పెద్దపేగు, క్లోమం, ప్రొస్టేట్‌ క్యాన్సర్లకు జంతు మాంసం కారకమవుతుందని గుర్తించింది. జంతు మాంసం తినే మోతాదును తగ్గించుకుని అంతే పోషక విలువలు ఉన్న ఇతర ఆహారపదార్థాలపై ఆధారపడటం ఉత్తమమని వివరించింది. జంతుమాంసాన్ని అత్యధిక వేడిలో వేయించడం, నిప్పుల్లో కాల్చుకు తినడం, వేపుళ్లు వేయడం, ఉప్పులో నానబెట్టి తర్వాత వాడటం మంచిది కాదని తెలిపింది.

ఇలా చేస్తే మాంసంలో క్యాన్సర్‌ కారకాలు ఎక్కువ అవుతాయి. అయితే వంటకాలకు సంబంధించి మరింత అధ్యయనం జరగాల్సి ఉంది. నిల్వ ఉన్న, శుద్ధి చేసిన జంతుమాంసాన్ని వీలైనంత వరకు తినకపోవడం ఉత్తమం. పౌష్ఠికాహార విషయానికి వస్తే మాంసంలో కూడా చాలా పోషక విలువలుంటాయి.

తాజా మాంసాన్ని తగిన మోతాదులో తినడం ఉత్తమం. శుద్ధిచేసిన మాంసాన్ని తినడం వల్ల ఏటా ప్రపంచ వ్యాప్తంగా 34,000 మంది క్యాన్సర్‌ బారినపడి చనిపోతున్నట్లు, జంతుమాంసం తినడం వల్ల 50 వేల మంది క్యాన్సర్‌ బారినపడి చనిపోతున్నట్లు అంచనా.

కాగా, చేపలు, కోడి మాంసం వల్ల క్యాన్సర్‌ వస్తున్నట్లు ఇప్పటి వరకు గుర్తించలేదు. రోజుకు 50గ్రాముల శుద్ధి చేసిన జంతు మాంసం తింటే పెద్దపేగు క్యాన్సర్‌ ముప్పు 18 శాతం పెరుగుతుంది.

పెద్దపేగు క్యాన్సర్‌ విషయానికి వస్తే రోజుకు 100 గ్రాముల చొప్పున జంతు మాంసం తినేవారికి ఈ ముప్పు 17 శాతం ఎక్కువని తేల్చారు. జంతుమాంసం తినడం ఎక్కువయ్యేకొద్దీ ముప్పు పెరుగుతుంది. 20 ఏళ్లపాటు జరిపిన అధ్యయనంలో జంతు మాంసం ఎక్కువగా తినడం వల్ల 12 రకాల క్యాన్సర్లు వస్తాయని వైద్య నిపుణులు గుర్తించారు.

English summary
The cancer research arm of the World Health Organization (WHO) has determined that the consumption of processed meats like hotdogs, ham, sausages and meat-based sauces causes colorectal cancer, while eating red meat like beef, pork and lamb is “probably carcinogenic to humans.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X