వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెత్త షాట్లు, స్పిన్ రివర్స్: భారత్ ఓటమికి కారణం?

By Pratap
|
Google Oneindia TeluguNews

నాగపూర్: స్పిన్ బలంతో న్యూజిలాండ్‌పై నెగ్గుతామని భావించిన భారత్‌కు సీన్ రివర్స్ అయింది. అదే స్పిన్ మంత్రజాలంతో న్యూజిలాండ్ ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచులో మట్టి కరిపించింది. 127 పరుగుల లక్ష్యాన్ని భారత్ అలవోకగా ఛేదిస్తుందని భావించిన తరుణంలో కివీస్ స్పిన్నర్లు చుక్కలు చూపించారు.

ఫొటోస్: టీ20 ప్రపంచకప్ సందడి

స్పిన్నర్లు మిచెల్‌ సాంట్నర్‌ నాలు గు, ఇష్‌ సోధి మూడు, నాథన్‌ మెకల్లమ్‌ రెండు వికెట్లు పడగొట్టి భారత పతనాన్ని శాసించారు. భారత్‌లో పుట్టి కివీ్‌సలో స్థిరపడిన ఇష్‌ సోధి ఈ దశలో టీమిండియాను కోలుకోలేని దెబ్బతీశాడు. స్వల్ప తేడాతో కోహ్లీ, రవీంద్ర జడేజా (0)లను అవుట్‌ చేశాడు.

Why team India defeated at Nagpur?

ధోనీ ఓటమి నుంచి తప్పించడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. భారత్ బ్యాటింగ్ పటిష్టత, స్పిన్నర్ల బలం ఉపయోగపడుతుందని అందరూ భావించారు. నిజానికి, ఏ విధమైన పిచ్ మీదనైనా న్యూజిలాండ్ పేసర్లనే ప్రధానంగా ప్రయోగిస్తుంది. కానీ జట్టు కెప్టెన్ కానె విలియమ్స్ బుద్ధిబలం ప్రయోగించి బౌల్ట్, సౌతీ వంటి దిగ్గజాలను పక్కన పెట్టి ముగ్గురు స్పిన్నర్లను తుది జట్టులోకి తెచ్చాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కానే విలియమ్సన్ చెప్పినట్లే రెండో ఇన్నింగ్సులో పిచ్ బాగా మందగించింది. దీన్ని కివీస్ స్పిన్నర్లు సమర్థంగా వాడుకున్నారు. అయితే, పిచ్‌పై బ్యాటింగ్ అంత తేలిక కాదని భారత బ్యాట్స్‌మెన్‌కు తెలియదని అనుకోలేం.

Why team India defeated at Nagpur?

అయితే, భారత బ్యాట్స్‌మెన్ సహనం ప్రదర్శించలేకపోయారు. దూకుడుగా ఆడి మ్యాచును సాధ్యమైనంత త్వరగా ముగిద్దామని అనుకున్నట్లు తోస్తోంది. దీంతో బ్యాడ్ షాట్లు కొట్టి న్యూజిలాండ్ బౌలర్లకు దొరికిపోయారు. 26 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయినా కూడా భారత్ విరాట్ కోహ్లీ, ధోనీ గట్టెక్కిస్తారని భావించారు. కానీ, సీన్ రివర్స్ అయింది.

మిగిలిన మూడు మ్యాచుల్లో భారత్ విజయం సాధిస్తేనే భారత్ సెమీస్‌కు చేరే అవకాశాలుంటాయి. శనివారంనాడు పాకిస్తాన్‌తో జరిగే మ్యాచు భారత్‌కు కీలకం కానుంది.

English summary
Title favourites India were suffered a shocking 47-run defeat at the hands of a spirited New Zealand in World Twenty20 opening game at the VCA stadium in Jamtha, Nagpur on March 15.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X