వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిన్న చిరంజీవి: ఆ రెండింటిపై పవన్‌పై జగన్ పైచేయి సాధించేనా?

|
Google Oneindia TeluguNews

విజయవాడ: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వల్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టమా? లాభమా అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ప్రత్యేక హోదా మొదలు 2019 ఎన్నికల వరకు పవన్ వల్ల తమకు నష్టమని వైసిపి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

నాడు చిరంజీవి

2009 ఎన్నికలకు ముందు 'అన్నయ్య' చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. దీని వల్ల నాడు తెలుగుదేశం పార్టీ నష్టపోయింది. ఇప్పుడు 2019 ఎన్నికల్లో 'తమ్ముడు' పవన్ కళ్యాణ్ వల్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే అవకాశాలున్నాయని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ వల్ల తమకు ఏ మేర నష్టం జరుగుతుందనే అంశంపై టిడిపి నేతలు కూడా ఆరా తీస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పవన్ వల్ల టిడిపికి మద్దతు పలికిన కాపులు... 2019 ఎన్నికల్లో దూరమయ్యే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు.

పవన్‌ తిరుపతి సభ తర్వాత పలు సమస్యలు తెరమరుగయ్యాయనే చెప్పవచ్చు. ప్రత్యేక హోదా అంశమే ప్రధానంగా తెరమీదకు వచ్చింది. కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు పవన్ చెక్ చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.

Will YS Jagan face Pawan Kalyan?

సమయం చూసి హోదా కోసం పోరాడుతున్న పవన్ కళ్యాణ్.. చంద్రబాబు ఇచ్చిన కాపు రిజర్వేషన్ హామీ నెరవేర్చకుంటే దానిని కూడా నిలదీసే అవకాశముంది. అప్పుడు ముద్రగడకు పవన్ చెక్ చెప్పినట్లేనని భావిస్తున్నారు. జనాకర్షక శక్తి ఉన్న పవన్ ముందు ముద్రగడ వంటివాళ్లు నిలవడం కష్టమే అంటున్నారు.

అందువల్లే తమ ఉద్యమానికి మద్దతివ్వాలని తాము పవన్‌‌ను ముద్రగడ కోరడం లేదేమో అంటున్నారు. కుల ప్రాతిపదికన జరిగే ఉద్యమాలకు మద్దతు ఇవ్వడానికి పవన్‌ కూడా ఇష్టపడరు. వచ్చే ఎన్నికల నాటికి కాపులను టిడిపికి దూరం చేసి తమవైపు తిప్పుకోవాలన్నది జగన్ వ్యూహంగా ఉందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో పవన్‌ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ముందుకు వచ్చారు. ఇది జగన్‌‌కు మింగుడుపడటం లేదని అంటున్నారు. దీంతో పవన్‌‌ను తక్కువచేసి చూపడానికి జగన్‌ సొంత మీడియా తంటాలు పడుతోందని కూడా అంటున్నారు.

తిరుపతి సభలో బిజెపిని, టిడిపిని గట్టిగా తిట్టలేదెందుకని వైసిపి నాయకులు వాపోయారు. ఇలాంటి విమర్శలకు పవన్‌ తన ప్రసంగంలోనే సమాధానం ఇచ్చారు. తాను నోరు జారనని స్పష్టం చేశారు. తిట్టకపోయినప్పటికీ బిజెపిని ఘాటుగానే ప్రశ్నించారు.

<br>'ప్రత్యేక' అడుగు: రంగంలోకి పవన్ కళ్యాణ్, పిలిచి చిక్కుల్లో పడ్డ జగన్!
'ప్రత్యేక' అడుగు: రంగంలోకి పవన్ కళ్యాణ్, పిలిచి చిక్కుల్లో పడ్డ జగన్!

ప్రజలు ఏమి కోరుకుంటున్నారన్న విషయమై ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ఏపీకి కేంద్రం ఎటువంటి ప్యాకేజీ ప్రకటించినా ఆ క్రెడిట్ ఎక్కువగా పవన్‌‌కే దక్కుతుంది. అది జగన్‌కు షాకేనని చెప్పవచ్చు.

ప్రత్యేక హోదా పైన జగన్ చేసిన ఉద్యమించారు. ఇప్పుడు పవన్ రంగంలోకి దిగడంతో జగన్ కార్నర్ అయ్యారు. అలాగే కాపు నేత ముద్రగడ ద్వారా కాపులను తనవైపు తిప్పుకుందామని జగన్ భావించారు. దానిని కూడా పవన్ కార్నర్ చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

కుల ఉధ్యమాలకు పవన్ మద్దతివ్వనప్పటికీ... కాపులకు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని నెరవేర్చమని అడిగే అవకాశముంది. లేకుంటే, చంద్రబాబు రిజర్వేషన్ల పైన ముందుకు సాగొచ్చు. ఏం జరిగినా జగన్‌కు ఇబ్బందేనంటున్నారు. ప్రత్యేక హోదా, కాపు ఉద్యమం నుంచి 2019 ఎన్నికల వరకు పవన్ వల్ల జరిగే నష్టాన్ని జగన్ ఎలా పూడ్చుకుంటారనే చర్చ సాగుతోంది.

English summary
Will YSR Congress Party chief YS Jagan face Jana Sena party chief YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X